April 2026



*పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు  పల్నాడు జిల్లా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  ధార గుప్తా గారు పల్నాడు జిల్లా జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

 మహారాజశ్రీ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అధికారి గారి దివ్యసముఖమునకు వ్రాసుకున్న అర్జీ


విషయం: నైపుణ్యం పెంచండి… నిరుద్యోగం తగ్గించండి 

రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, స్థానిక ఉద్యోగాలు, చేతివృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయవలెనని వినతి

“మీ సమస్య… మా బాధ్యత” అనే భరోసా తో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయాల్లో ప్రజల సమస్యలను స్వీకరిస్తూ, గ్రామాలు–నగరాల్లో పర్యటిస్తూ ప్రజల ఆకాంక్షలను తెలుసుకుంటున్నాము. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా యువతను కలసి వారి సమస్యలు, ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుంది. ఈ కార్యక్రమాల్లో SC, ST, OBC, మహిళలు, చేతివృత్తిదారులు, నైపుణ్య శిక్షణలో ఉన్నవారు, నిరుద్యోగులు, చిన్న చదువులతో సరైన జీవన మార్గం తెలియని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు “జిల్లాకో నైపుణ్య కేంద్రం” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రణాళికలు కేవలం సమావేశాలు, నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించేలా అమలు కావాల్సిన అవసరం ఉందని అధికారులు ఆ దిశగా ఆలోచించాలి అని మనవి చేస్తున్నాము. రాష్ట్రంలో యువత నుంచి వస్తున్న వినతుల్లో గణనీయమైన వాటా ఉద్యోగాల కోసమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది; ఇది తక్షణ చర్యలు అవసరమని సూచిస్తోంది 

కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చి, Skill India Mission, PMKVY 4.0, PM-NAPS, Jan Shikshan Sansthan, PM Vishwakarma, Digital India, Startup India, Mudra, Stand Up India, PM-SETU వంటి అనేక పథకాల ద్వారా యువతకు, చేతివృత్తిదారులకు, స్వయం ఉపాధి ఆశావహులకు శిక్షణ, మద్దతు, రుణాలు, టూల్‌కిట్లు, పరిశ్రమల అనుసంధానం వంటి అవకాశాలు కల్పిస్తోంది. ఈ అవకాశాలు రాష్ట్రంలో సమర్థవంతంగా వినియోగించబడితే లక్షలాది కుటుంబాలకు ఉపయుక్తం అవుతాయి 

అయితే, యువత నుంచి మాకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, పథకాలు ఉన్నప్పటికీ పరిశ్రమలకు సరిపోయే నైపుణ్యం కొరతగా ఉంది; శిక్షణ ఒకటి, పరిశ్రమల అవసరం మరోటి అన్న పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్ ఉన్నా ప్రాక్టికల్ స్కిల్ లేకపోవడం, ప్లేస్‌మెంట్‌పై తక్కువ దృష్టి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం పేరుతో ఉన్న నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, స్కూల్ స్థాయి నుంచే vocational education బలహీనంగా ఉండటం, తక్కువ జీతాలు, నైపుణ్యం ఉన్నవారి వలసలు, చేతివృత్తుల పట్ల నిర్లక్ష్యం, డేటా ట్రాకింగ్ లోపం వంటి సమస్యలు తీవ్రమైనవిగా గుర్తించాము. రాష్ట్రంలో ఇటీవల జిల్లాకో నైపుణ్య ప్రణాళిక, పరిశ్రమలకు అనుగుణ శిక్షణ, టెన్త్ విద్యార్థుల ట్రాకింగ్ వంటి అంశాలపై చర్యలు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి వేగంగా మరియు సమగ్రంగా అమలు కావాల్సిన అవసరం ఉంది 

కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కింది అంశాలను అత్యంత ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మనవి చేస్తున్నాము

ప్రతి జిల్లాలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా Skill Map తయారు చేయాలి. పోర్టు, ఐటీ, షిప్పింగ్, ఆటోమొబైల్, సోలార్, మైనింగ్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఆయిల్ & గ్యాస్, అక్వా, ఫిషరీస్, పేపర్, అగ్రో రంగాలకు సరిపడే శిక్షణ మాడ్యూల్స్ రూపొందించాలి. మండల స్థాయిలో Skill Centers ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు సులభంగా చేరువ చేయాలి. SC, ST, BC, మహిళలు, డ్రాప్‌అవుట్స్, చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక స్కిల్ ప్యాకేజీలు అమలు చేయాలి. శిక్షణతో పాటు placement or loan అనే మోడల్‌ను పటిష్టంగా అమలు చేయాలి. ప్రతి MoUలో ఉద్యోగాల సంఖ్య, శిక్షణ లబ్ధిదారుల సంఖ్య, నియామకాల లక్ష్యాలు స్పష్టంగా ప్రకటించాలి. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగ, శిక్షణ సమాచారం నిరంతరం ప్రచారం చేయాలి. vocational education ను స్కూల్ స్థాయి నుంచే బలోపేతం చేయాలి. తక్కువ చదువు ఉన్న యువత, డ్రాప్‌అవుట్స్, సంప్రదాయ చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక మార్గాలు  రూపొందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా డేటా ట్రాకింగ్, ఫలితాల మానిటరింగ్, ప్లేస్‌మెంట్ సమీక్ష వ్యవస్థను బలపరచాలి. చేతివృత్తులు కేవలం జీవనోపాధి కాదు; అవి సంస్కృతి, కుటుంబ గౌరవం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. అందువల్ల వాటికి ఆధునిక నైపుణ్య శిక్షణ, పరికరాలు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణం గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే స్థానికులకు ఉద్యోగాలు లభిస్తే వలసలు తగ్గి, కుటుంబాల ఆర్థిక భరోసా పెరుగుతుంది. 

యువతకు ఉద్యోగం కల్పించడం అంటే ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పించడం కాదు అది ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం. నైపుణ్యాభివృద్ధి అంటే కేవలం శిక్షణ కాదు; అది రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే సమగ్ర అభివృద్ధి ఉద్యమం.
అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని, నిధులు, పథకాలు, సాంకేతిక సహాయం, పరిశ్రమల సమన్వయం, నియామక హామీలు కలిపి సమగ్ర కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనవి చేస్తున్నాము.

జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు



 
 
*పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *పల్నాడు జిల్లా జిల్లా కార్యాలయంలో ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లపు కృపారావు గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభ ఉపన్యాసం చేసిన వల్లెపు కృపారావు గారు జనతా వారద కార్యక్రమం ప్రతి శుక్రవారం పల్నాడు జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని తమ సమస్యలపై వినతులు సమర్పించిన పిదప వాటి పరిష్కార కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అలాగే ప్రతి సోమవారం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మరియు జనత వారది కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి రెవెన్యూ కార్యాలయం వద్ద కూడా ప్రతి సోమవారం జనతా వారది కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈ సదవకాశాన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు* 

 *అలాగే ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం కూడా జరిగింది. తదుపరి సంబంధిత ప్రభుత్వ అధికారులకు వాటిపై వివరణ అడిగి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి తెలియజేయడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆవుల ఆదినారాయణ బీజేపీ దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా బీజేవైఎం నాయకులు ఇమ్మడిశెట్టి అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు*

 
 
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

. ఈవారం జనతావారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని వయ్యకల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది ,కార్యక్రమంలో నాలుగు దరఖాస్తులు రావడం జరిగింది, ముఖ్యంగా పొలం బాటకు వెళ్లే రహదారి కొరకు, త్రాగు నీటిలో ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కొరకు, సైడ్ డ్రైనేజీల మరమ్మతులు మరియు నిర్మాణం కొరకు, కిసాన్ సంబంధిది నిధులు కొరకు, దరఖాస్తులు రావడం జరిగింది, ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు, బిజెపి నేతలు అన్నవరపు శ్రీనివాసరావు, నార్ల సాంబశివరావు పాల్గొన్నారు.


వినుకొండ పట్టణం లొ బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ P V N మాధవ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల ప్రకారం మన వినుకొండ పట్టణంలో  జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
 జనతా వారధి అనగా ప్రజల నుంచి సమస్యలు సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దాన్ని పరిష్కరించే కార్యక్రమమే ఈ జనతా వారధి .
దీనిలో భాగంగా   జరిగిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా గృహ సంపర్కం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసు కోవడం జరిగినది.
అది వారం ఉదయం బోసు బొమ్మ దగ్గర ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో పూజా కార్యక్రమం పూర్తిచేసుకుని అక్కడి నుండి బొమ్మ మీదగా పప్పు బజార్ వరకు గృహ సంపర్కం చేయడం జరిగింది కార్యక్రమంలో పెన్షన్లు కావాలని, నీళ్లు సమయానికి రావడం లేదని, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కొత్తది కావాలని ప్రజలు మన కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది .
కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి గొడవర్తి సుజాత,  పట్టణ మాజీ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు, బండి వెంకటేశ్వర్లు , పట్టణ ఉపాధ్యక్షులు దేసు వెంకట లక్ష్మీనారాయణ,  పువ్వాడ అరవింద తదితరులు పాల్గొన్నారు.



పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 *పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు*


**గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,**  
**జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,** 
*పల్నాడు జిల్లా*

**విషయం:**పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి.

*అమ్మ ,*

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న **జనతా వారధి** కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.

జిల్లాలోని అనేక గ్రామాల్లో **Solid & Liquid Waste Management (SLWM)** కింద నిర్మించిన కంపోస్ట్ పిట్స్, సెగ్రిగేషన్ షెడ్లు నిర్వీర్యంగా ఉన్నాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా మాత్రమే నిర్వహణ జరుగుతోంది. 

**స్వచ్ఛ భారత్ మిషన్** కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన ఈ యూనిట్లు ప్రస్తుతం చెత్త నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయి. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీ, రీసైక్లింగ్ వ్యవస్థ సరిగా అమలు కావడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత మరియు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

దీని వల్ల **“చెత్త నుంచి సంపద”** లక్ష్యం సాధ్యం కావడం లేదు. గ్రామాల్లో అస్వచ్ఛత పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి.

**రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు** ప్రతిష్టాత్మకంగా **స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర** కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది.

**కావున మనవి:**

1. జిల్లా వ్యాప్తంగా అన్ని SLWM యూనిట్లపై **ప్రత్యేక సమగ్ర ఆడిట్** నిర్వహించాలి.
2. పనిచేయని కంపోస్ట్ పిట్స్ / షెడ్లను **తక్షణం పునరుద్ధరించాలి**.
3. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం **కఠినంగా అమలు** చేయాలి.
4. ప్రతి గ్రామానికి తగినంత **పారిశుధ్య కార్మికులను** నియమించాలి.
5. గ్రామ/వార్డు స్థాయిలో **పర్యవేక్షణ కమిటీలు** ఏర్పాటు చేసి బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించాలి.
6. కంపోస్ట్ ఉత్పత్తికి **సరైన మార్కెట్ లింకేజీ** కల్పించాలి.
7. ప్రజలకు **అవగాహన కార్యక్రమాలు** విస్తృతంగా నిర్వహించాలి.


గ్రామాల్లో పారిశుధ్యం కేవలం నిర్మాణాలతో కాకుండా, **సమర్థవంతమైన నిర్వహణ** ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పై అంశాలపై **తక్షణ చర్యలు** తీసుకొని “చెత్త నుంచి సంపద” లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.

**జనతా వారధి – పల్నాడు జిల్లా టీమ్**  

             * *ఇట్లు**     
  *ఏలూరి శశి కుమార్*
    *జిల్లా అధ్యక్షులు*  
    *భారతీయ జనతా పార్టీ*
   *పల్నాడు జిల్లా*



శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ,శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు,  జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని కనుమర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలోని   సమస్యలపై నాలుగు అర్జీలు ఇవ్వడం జరిగింది ,లంబాడీ డొంక కాల్వపై బ్రిడ్జి నిర్మాణం మంజూరుకై, ఆంజనేయస్వామి గుడి వెనక బజారులో అసంపూర్ణంగా ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, బొడ్డు రాయి వెనుక  వీధిలో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, సంవత్సరం కాలంగా గ్రామంలో ఆగిపోయినటువంటి గ్రామీణ రక్షిత మంచినీటి పథకానికి మరమ్మత్తులు నిర్వహించి త్రాగునీటిని అందించాలని అర్జీలు ఇవ్వడం జరిగింది,వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని తెలిపాము కార్యక్రమంలో మణిబాబు పాల్గొన్నారు



 
*పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు నరసరావుపేట పట్టణ కార్యదర్శి సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం లొ వినతి పత్రం సమర్పించడం జరిగింది*

*విషయం* : SC, ST, BC బాల బాలికల సంక్షేమ వసతి గృహాలలో సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి.
(ఈ వేసవి కాలం వసతి గృహాల సంస్కరణ కాలంగా పరిగనించండి)

భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా ప్రతి వారం గ్రామాలు, పట్టణాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నది. మరియు ప్రజల ఆశలు, ఆవేదనలు, అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కార్యకర్తలు బాధ్యతగా భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్రంలోని SC, ST, BC బాల బాలికల సంక్షేమ వసతి గృహాలను సందర్శించడం జరిగింది. మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ హాస్టల్స్ పరిశీలనలో భాగంగా విద్యార్థులతో, వార్డెన్‌లతో, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. ముందుగా, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని సానుకూల చర్యలను అభినందిస్తున్నాము. డైట్ బిల్లుల చెల్లింపులో వేగం పెరగడం, కాస్మోటిక్ అలవెన్సుల విడుదల, ఆహార నాణ్యతలో మెరుగుదల వంటి మార్పులు విద్యార్థుల్లో కొంత భరోసా కలిగించాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు.

అయితే, క్రింది స్థాయిలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేండ్లు సంక్షేమ హాస్టల్స్ ను విస్మరించింది. వారి నిర్లక్ష్యం ఇంకా వెంటాడుతుంది. కొన్ని హాస్టల్స్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనసును కలచివేస్తున్నాయి —
చాలా చోట్ల భవనాలు పాడై ప్రమాదకరంగా ఉండడం, తగిన శుభ్రత లేకపోవడం, తాగునీటి కొరత, సరైన పోషకాహారం అందకపోవడం, వైద్య సదుపాయాల లోపం, విద్యా సహాయం లేకపోవడం వంటి సమస్యలు స్పష్టంగా గమనించాము. కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ సమస్యలను చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపించింది — ఇది అత్యంత ఆందోళనకరం.

ఈ నేపథ్యంలో, ప్రస్తుత వేసవి సెలవులను ఒక అవకాశంగా తీసుకుని సంక్షేమ హాస్టల్స్‌లో సమగ్ర మార్పులు తీసుకురావాలని మేము గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

మా ముఖ్యమైన సూచనలు మరియు చర్చించి నిర్ణయం తీసుకోవలసిన విషయాలు క్రింద విధంగా ఉన్నాయి:

1. విద్యార్థులు సెలవులకు వెళ్లే ముందు ప్రతి హాస్టల్‌లో తల్లిదండ్రులు/గార్డియన్‌ల సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి.
2. విద్యార్థుల సమస్యలు, అనుభవాలు నమోదు చేసి వాటిపై చర్యలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 

3. విద్యార్థి–తల్లిదండ్రులు–ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయాలి.
4. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్స్‌కు Infrastructure Audit నిర్వహించి ప్రమాదకర భవనాలను వెంటనే పునర్నిర్మించాలి లేదా మార్చాలి. గదులు, మరుగుదొడ్లు సున్నాలు పెయింట్ లు వేసి శుభ్రపరచాలి. 
5. ప్రతి విద్యార్థికి కనీస వసతి ప్రమాణాలు నిర్ధారించాలి.
6. ప్రస్తుత ధరల ఆధారంగా డైట్ చార్జీలను పెంచి, మెను అమలు కచ్చితంగా జరిగేలా చూడాలి.
7. ప్రతి హాస్టల్‌లో RO ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
8. శుభ్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేయాలి.
9. విద్యా ప్రమాణాల పెంపు కోసం ట్యూటర్స్ నియామకం మరియు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు కల్పించాలి.
10. అన్ని హాస్టల్స్‌లో CCTV ఏర్పాటు చేయాలి; బాలికల హాస్టల్స్‌లో మహిళా వార్డెన్లు తప్పనిసరి చేయాలి.
11. బిల్లుల చెల్లింపును పారదర్శకంగా Direct Benefit Transfer (DBT) ద్వారా చేయాలి.
12. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్-ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి.
13. ప్రతి నెల వైద్య పరీక్షలు మరియు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి.
14. ప్రతి నెల విద్యార్థులతో ఓపెన్ మీటింగ్ నిర్వహించి వారి సమస్యలను నేరుగా నమోదు చేసే విధానం తీసుకురావాలి.

సంక్షేమ హాస్టల్స్ అనేవి కేవలం వసతి గృహాలు కావు — అవి అణగారిన వర్గాల పిల్లలకు భవిష్యత్తు నిర్మించే కేంద్రాలు. ఒక పేద విద్యార్థి తన గ్రామానికి వెళ్లేటప్పుడు “నా హాస్టల్‌లో సమస్యలు ఉన్నాయి” అని చెప్పకుండా, తిరిగి వచ్చేటప్పుడు “ఇది నా ఇంటికంటే మంచి స్థలం” అని గర్వంగా చెప్పే పరిస్థితి రావాలి. అదే నిజమైన సంక్షేమం. అదే నిజమైన పరిపాలన.

ఈ వేసవి సెలవులను “సంస్కరణల కాలం”గా మార్చి, ప్రతి విద్యార్థి హృదయంలో “ప్రభుత్వం మా వెంట ఉంది” అనే నమ్మకాన్ని కలిగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.

సేవా అంత్యోదయ పరమావధిగా సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి, సమానత్వం కోసం భారతీయ జనతా పార్టీ పని చేస్తుంది. మేము ఒక ఉద్యమ స్ఫూర్తితో వారికీ అండగా నిలుస్తాము. వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాము. మీరు పై విషయాలు అత్యంత కీలకమైనవిగా పరిగనించాలని వినతిస్తున్నాము.

ఇట్లు 
 *పల్నాడు జిల్లా జనతా వారధి రాష్ట్ర జట్టు*

శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్, శావల్యాపుర మండల సీనియర్ నాయకులు శ్రీ అసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల పరిధిలోని బొందిని పాలెం గ్రామంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక బిజెపి నేత రావినూతల ఆదాం నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఎనిమిది దరఖాస్తులు ఇవ్వడం జరిగింది పంచాయతీ ఆఫీస్ నుండి స్మశానానికి వెళ్లే రహదారిని సిసి రోడ్డు వేయించాలని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి రహదారులకు సైట్ డ్రైనేజీలు నిర్మించాలని,అలాగే గత 17 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకానికి ,నిధులు మంజూరు చేయాలని, రైతు భరోసా,కిసాన్ సమ్మాన్ నిధి  అమలు కొరకు రైతులు దరఖాస్తులు ఇచ్చారు.వీటి పరిష్కారం కొరకై  బిజెపిపార్టీ తమవంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు చెప్పడం జరిగింది


పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారిధి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ PVN మాధవ్ గారి పిలుపు మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాలతో, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ  గారికి  సీనియర్ సిటీజన్స్ సమస్యలు పై మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు , పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


విషయం:
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డులు మరియు “ఆయుష్మాన్ వయో వందన కార్డ్”లను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించేలా తగు ఆదేశాలు జారీ చేయవలసినదిగా వృద్ధుల సంక్షేమం పై ఆలోచన చేయవలసిందిగా వినతి.

భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పౌరులను సర్వ స్పర్శి సర్వ వ్యాప్తి నినాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుస్తున్నారు. పెద్దఎత్తున వృద్ధులను కలిసిన సమయంలో వారి నుంచి వచ్చిన విన్నపములు చాలా ప్రధానమైన అంశములుగా మేము భావిస్తున్నాము 

భారతదేశంలో వృద్ధ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

• 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేయడం
• 70 సంవత్సరాలు పైబడిన వారికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పించే “ఆయుష్మాన్ వయో వందన (PMJAY)” పథకం అమలు చేయడం

ఇవి వృద్ధులకు ఎంతో ఉపయోగకరమైన పథకాలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కార్డులు ఉన్నప్పటికీ వృద్ధ పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్ కార్డులు కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. 

• బ్యాంకులు, దేవాలయాలు, హాస్పిటల్స్, కోర్టులు వంటి ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
• ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ అనేక చోట్ల వాటిని గుర్తించడం లేదు.
• “ఆయుష్మాన్ వయో వందన కార్డు” ఉన్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్య సేవలను నిరాకరిస్తున్నాయి.
దీని వల్ల వృద్ధులు అత్యవసర వైద్య సేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
• కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJAY వయో వందన పథకం ప్రకారం 70 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల ఆరోగ్య భీమా సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు, ఆధార్ ఆధారంగా నమోదు, ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ చికిత్స జరగడం లేదు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని Go No.49/02.04.2025 ప్రకారం AB PM -JAY కుటుంబాలకు మరియు ఇతర కుటుంబాలకు అందించేలా నిర్ణయించింది. కానీ ఇది సరైన విధంగా అమలు జరగడం లేదు.

వృద్ధాప్య పెన్షన్ ను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో భాద్యతయితంగా అందచేస్తుంది. ఈ పధకం కొంతవరకు వృద్దులకు ఆశరాగా ఉన్నప్పటికీ పెరుగుతున్న వృద్ధాశ్రమాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుంది.

పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వృద్ధ పౌరుల సంక్షేమార్థం క్రింది చర్యలు తీసుకోవలసిందిగా మనవి.

• రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు (బ్యాంకులు, దేవాలయాలు, కోర్టులు, హాస్పిటల్స్)
సీనియర్ సిటిజన్ కార్డులను తప్పనిసరిగా అంగీకరించేలా ఆదేశాలు జారీ చేయాలి. సీనియర్ సిటిజెన్ కార్డులు అందచేయాలి.

• అన్ని హాస్పిటల్స్ (ప్రభుత్వ మరియు ప్రైవేట్)
“ఆయుష్మాన్ వయో వందన కార్డు”ను తప్పనిసరిగా అమలు చేయాలని కఠిన ఆదేశాలు ఇవ్వాలి.

• ఈ కార్డులను నిరాకరించే సంస్థలపై
తగిన చర్యలు (penalties) తీసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలి.

• జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారులు నియమించి
వృద్ధులకు సకాలంలో సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలి.

• ప్రజల్లో అవగాహన కల్పించేందుకు
ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.

• పెరుగుతున్న వృద్ధాశ్రమాలపై నిఘా పెంచాలి. అవసరమైన కుటంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించే వ్యవస్థ ఉండాలి.

వృద్ధ పౌరులు సమాజానికి మూలస్తంభాలు. వారి గౌరవం, ఆరోగ్యం, భద్రత ఏలినవారి బాధ్యత.

వృద్దులు ఒంటరివారు, అనాధలు కాకూడదు. వారి హక్కులు పరిరక్షించడంలో మరియు వారికీ అండగా నిలవడంలో భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్న పని చేస్తుంది.

కాబట్టి పై వినతిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మనవి.

ఇట్లు 
 *పల్నాడు జిల్లా జనతా వారధి రాష్ట్ర జట్టు*



శావల్యాపురం మండలంలో జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది


కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ బిజెపి మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు, ఈ వారం "జనతా వారధి" కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మతుకుమల్లి గ్రామంలో స్థానిక బిజెపి నేత వజ్జా వెంకటేశ్వర్లు గారి నిర్వహణలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అందులో భాగంగ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, పొలాలకు వెళ్లేటువంటి రహదారుల నిర్మాణం కొరకు, జలజీవన్ మిషన్ పూర్తిచేసి పంచాయతీకి అప్పగించడం కొరకు, పీఎం కిసాన్ రైతు భరోసా నిధుల మంజూరు కొరకు, వంటి అంశాలపై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జిదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు