రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండలం సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈ వారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా ప్రజలు పలు సమస్యల్ని అర్జీలు రూపంలో ఇవ్వడం జరిగింది, గ్రామంలోని సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని అలాగే మనిషి చనిపోయింది తర్వాత ఆ మనిషిని కాల్చేందుకు కనీసం స్మశానం కూడా మా గ్రామానికి లేదని రోడ్లమీదనే శవాన్ని కాల్చేటువంటి పరిస్థితిలో ఉన్నామని గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు లేనందున ప్రభుత్వం వారు నిధులు మంజూరు చేసి స్మశానానికి స్థలాన్ని కేటాయించాలని, అలాగే ముటుకూరి పేరయ్య అనే రైతు తన పొలంలోకి వెళ్లేందుకు సరిహద్దు రైతు అడ్డంకులు సృష్టిస్తున్నారని కావున ప్రక్కనేప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోనుండి నా పొలంలోకి వెళ్లేందుకు రెవెన్యూరెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఉపాధి హామీ పనులు కల్పించాలని అలాగే పొలాన్ని ఆన్లైన్ చేయించాలని కిసాన్ సమ్మన్ నిధి పథకం వర్తింపజేయాలని దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది .
May 2026
*ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది*
*ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది*
*పాల్గొన్న నాయకులు:*
*ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ వల్లెపు కృపారావు గారు జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
*కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు గారి చేతుల మీదుగా జనతా వారధికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, 'జనతా వారధి' ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న వల్లెపు కృపారావు గారు తెలిపారు*
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పలనాడు జిల్లా అధ్యక్షుడు శ్రీ ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈ వారం జనత వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుర్రం వారి పాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. పొలానికి వెళ్లే రహదారిలో మూడు కాలువలపై బ్రిడ్జి ల నిర్మాణం కొరకు, కొత్తలూరు పంచాయతీకి వెళ్లే రహదారి నిర్మాణం కొరకు, ఉపాధి హామీ పనులు నిధుల జమ కొరకు, గ్రామంలోని సైడ్ డ్రైనేజీల నిర్మాణం కొరకు వివిధ సమస్యలపై ఐదు అర్జీలు రావడం జరిగింది, వీటి పరిష్కారానికై బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది.
బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతి తో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే “జనతా వారధి కార్యక్రమం” పల్నాడు జిల్లా కార్యాలయం లొ మే 22 తేది శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వినుకొండ మండలం నుండి వేమా ఏడుకొండలు పిర్యాదు ఇవ్వడం జరిగింది. తనను ఒక వ్యక్తి మోసం చేసి లక్షల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. ఈ విషయంపై ఈపూరు మండల ఎస్సై గారితో మాట్లాడి త్వరగా తనకు న్యాయం చేయాలని బిజెపి నుంచి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
అలాగే సోమవారం నిర్వహించబడే జనతా వారధి కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేయవలసిందిగా కోరిన మల్లెల శివ నాగేశ్వరావు.
సోమవారం జరగభోవు జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్న మల్లెల శివ నాగేశ్వరావు.
జనతా వారధి పల్నాడు జిల్లా టీమ్
,పార్టీ ఆదేశాల మేరకు, ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని ,శావల్యాపురం మండలంలోని తుమ్మలకుంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు పొలాలకు వెళ్లేటువంటి రహదారులు అద్వాన్నంగా ఉన్నాయని రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం కింద ఈ పొలాలకు వెళ్లే రహదారులు నిర్మించాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలోని ఎస్సీ కాలనీకి విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో రావడంలేదని లో వోల్టేజీ సమస్యతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నామని దరఖాస్తు ఇవ్వడం జరిగింది . ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మరియు స్థానిక బిజెపి నేతలు సిద్దయ్య ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెరువుల మట్టి నిర్వహణపై వినతి పత్రం సమర్పించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్చార్జి మరియు జనతా వారిది స్టేట్ టీమ్ నెంబర్ కేతనబోయిన హనుమంతరావు మరియు పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
*విషయం : రాష్ట్రవ్యాప్తంగా చెరువు మట్టి తవ్వకాలపై నిబంధనలు కచ్చితంగా అమలు చేయుట, గత పాలనలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టుట, రైతులకు మరియు కుమ్మరి వృత్తిదారులకు చెరువు మట్టిని ఉచితంగా అందించుట – వినతి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1.13 లక్షల చెరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్నాయి. చెరువులు సాగునీటి వనరులు మాత్రమే కాకుండా భూగర్భ జలాల పునరుద్ధరణ, చేపల పెంపకం, వర్షపు నీటి నిల్వ, గ్రామ పర్యావరణ సమతౌల్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చెరువుల్లో సంవత్సరాలుగా పేరుకుపోయే పూడికను తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సాగునీటి అందుబాటు మెరుగుపడుతుంది. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.
అయితే, భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంతో గ్రామాల్లోకి పర్యటనలు చేస్తూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తుంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చెరువు మట్టి తవ్వకాలలో అనేక ప్రాంతాల నుండి మస్టర్ రోల్స్, పని అంచనాలు, కొలత పుస్తకాలు (MB), వినియోగ ధృవీకరణ పత్రాలు, సోషల్ ఆడిట్ రికార్డులు లేకుండానే పనులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి.
అదేవిధంగా, 2019–2024 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చెరువు మట్టి అక్రమ తవ్వకాలు జరిగి, ఆ మట్టిని బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20 నుండి 65 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు పూడిక మట్టి తరలించబడినట్లు భావించబడుచున్నది. దీని మార్కెట్ విలువ సుమారు ₹13,500 కోట్ల నుండి ₹31,500 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.
గతంలో ఈ అక్రమాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ పలు సందర్భాలలో నిరసనలు చేపట్టినప్పటికీ తగిన విచారణ జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం చెరువు మట్టిని విక్రయించరాదు. చెరువు మట్టిని రైతుల పొలాలకు, నేల సారం పెంచుటకు, చెరువు గట్లు బలపరచుటకు, గ్రామ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వ అవసరాల కొరకు, కుమ్మరి వృత్తిదారుల వినియోగానికి ఉపయోగించవలసి ఉంటుంది.
చెరువు మట్టి తరలింపునకు సాధారణంగా క్రింది పత్రాలు తప్పనిసరిగా ఉండవలెను
• గ్రామ పంచాయతీ తీర్మానం
• జలవనరుల శాఖ అనుమతి
• తహసీల్దార్ సమాచారం
• కొలతల నమోదు పుస్తకం (MB)
• వినియోగదారుల రిజిస్టర్
• సోషల్ ఆడిట్ రికార్డులు
• అవసరమైతే మైనింగ్ క్లియరెన్స్ / NOC
అయితే, ప్రస్తుత అమలులో ఈ నిబంధనలు అనేక ప్రాంతాల్లో పాటించబడటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
అందువల్ల మా వినతులు :
1. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న చెరువు మట్టి తవ్వకాలపై ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ నియమించాలి.
2. 2019–2024 మధ్య జరిగిన చెరువు మట్టి తవ్వకాలపై న్యాయ / విజిలెన్స్ విచారణ చేపట్టాలి.
3. ప్రతి చెరువు మట్టి తవ్వకానికి పూర్తి పారదర్శకతతో రికార్డులు నిర్వహించాలి.
4. చెరువు మట్టిని రైతులకు పూర్తిగా ఉచితంగా అందించాలి.
5. కుమ్మరి వృత్తిదారులకు వారి జీవనోపాధి కోసం అవసరమైన మట్టిని ఉచితంగా కేటాయించాలి.
6. అక్రమ చెరువు మట్టి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
7. ప్రతి క్యూబిక్ మీటర్ మట్టి వినియోగానికి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
8. సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేయాలి.
“చెరువు మట్టి రైతుల హక్కు – కొందరి వ్యాపార వస్తువు కాదు.”
చెరువులను పరిరక్షిస్తే రైతు బలపడతాడు. రైతు బలపడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకొని రైతుల, కుమ్మరి వృత్తిదారుల హక్కులను కాపాడవలసిందిగా వినయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కోరుచున్నది.
బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే “జనతా వారధి కార్యక్రమం” పల్నాడు జిల్లా కార్యాలయం లొ మే 15 తేది శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వినుకొండ పిడుగురాళ్ల నుంచి ఫిర్యాదులు రావడం వాటిని రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులకు పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నబట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారుపల్నాడు జిల్లా sc మోర్చా అధ్యక్షులు మేళం మధు బాబు గారు పల్నాడు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులుగుజ్జు మహేష్ గారు యువ మౌర్చ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వంకాయలపాటి వంశీధర్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులునాసారయ్య గారు యూవ మౌర్చ్ నాయకులు కోటి తదితరులు పాల్గొన్నారు.
అలాగే సోమవారం నిర్వహించబడే జనతా వారధి కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేయవలసిందిగా కోరుతున్నాము.
సోమవారం జరగభోవు జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.
ఇట్లు
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా
జనతా వారధి పల్నాడు జిల్లా టీమ్
**విషయం: నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో భూ రీ-సర్వే సమస్యపై బీజేపీకి అర్జీ అందజేసిన రైతు.**
**నకరికల్లు,
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం **చల్లగుండ్ల గ్రామానికి** చెందిన రైతు **ఆవుల పాపయ్య** తన వ్యవసాయ భూమికి సంబంధించి ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ సమస్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) నకరికల్లు మండల అధ్యక్షులు **బాజీ గారికి** వినతి పత్రం సమర్పించారు.
### **ప్రధాన సమస్య:**
గ్రామంలో ఇటీవల జరిగిన భూ రీ-సర్వే ప్రక్రియలో, ఆవుల పాపయ్యకు చెందిన పొలం పొరపాటున **రీ-సర్వే ఉమ్మడి (Joint) ఖాతాలో** జమైంది. దీనివల్ల:
* ఆన్‌లైన్‌లో పొలానికి సంబంధించిన **వన్-బి (1B) మరియు అడంగల్** వివరాలు రావడం లేదు.
* సొంత భూమికి సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టత లేకపోవడంతో రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
* రెవెన్యూ రికార్డుల్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ పథకాలు లేదా ఇతర అవసరాలకు ఆ భూమి వివరాలు దొరకడం లేదు.
### **బిజెపి నేతల స్పందన:**
ఈ సమస్యపై స్పందించిన మండల అధ్యక్షులు బాజీ గారు మాట్లాడుతూ, రీ-సర్వే పేరుతో అధికారులు చేస్తున్న పొరపాట్ల వల్ల సామాన్య రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పాపయ్య అందజేసిన అర్జీని ఆన్‌లైన్ ద్వారా ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని, అలాగే ఈ సమస్యపై ఒక వీడియోను కూడా సంబంధిత గ్రూపుల్లో చేర్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
బాధిత రైతుకు న్యాయం జరిగే వరకు, ఆ భూమి వివరాలు ఆన్‌లైన్‌లో విడివిడిగా (Individual) నమోదయ్యే వరకు బిజెపి తరపున పోరాడుతామని, వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
**ఇట్లు,**
**బిజెపి మండల శాఖ,**
**నకరికల్లు.**
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వాడిది టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటి నిర్వహణపై వినతి పత్రం సమర్పించడం జరిగింది*
*నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ సోమవారం అనగా మే 12వ తేదీన ఉదయం 10 గంటల నుండి 2 గంటలవరకు జనతా వారది కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది*
*జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది*
*ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయలలో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే పల్నాడు జిల్లా జనతా వారధి టీం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు స్వీకరించటం జరుగుతుందని తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*
*మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం లో వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు*
“ *నీరు ఉంటేనే జీవితం ఉంటుంది*
*విషయం : భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్ధ్యం, భవిష్యత్ నీటి భద్రత*
*ప్రస్తుతం వాతావరణం లో వస్తున్న మార్పుల కారణంగా వర్షపాత సరళిలో అనిశ్చితి, పెరుగుతున్న భూగర్భ జల వినియోగం, ఎండిపోతున్న బోర్లు, క్షీణిస్తున్న చెరువుల సంఖ్య మరియు ఆయకట్టు ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సూచిస్తున్నాయి*
ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి రాష్ట్రంలో జలవనరుల సక్రమ నిర్వహణ మరియు భూగర్భ జల రీచార్జ్ కు ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్, రీచార్జ్ పిట్స్), చెక్ డ్యాం లు, పెర్కొలేషన్ టాంక్ లు, రీచార్జ్ షాఫ్ట్ లు మొదలైన నిర్మాణాల విస్తరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయి, వేసవిలో తాగునీటి కొరత, వ్యవసాయానికి నీటి సమస్యలు, మురుగునీటి నిల్వ, వర్షపు నీరు కాలువల్లో వృథాగా పోవడం వంటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచడానికి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే శాశ్వత పరిష్కారాల్లో ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్ & రీచార్జ్ పిట్స్) ముఖ్యమైనవి.
రీచార్జ్ పిట్స్: వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది; భూగర్భ జల స్థాయి పెరుగుతుంది; బోర్లు, బావులు ఎక్కువకాలం పనిచేస్తాయి; వరద ప్రభావం తగ్గుతుంది; భూమి తేమ పెరిగి వ్యవసాయానికి మేలు చేస్తుంది.
సోక్ పిట్స్: ప్రతి ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ భూమిలోకి ఇంకుతుంది; మురుగునీటి నిల్వ తగ్గుతుంది; దోమలు, దుర్వాసనలు తగ్గుతాయి; పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది నిరంతర భూగర్భ జల రీచార్జ్ జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం V B G RAM G, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా రైన్‌వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్‌వాటర్ రీచార్జ్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ పై రాష్ట్రాలకు నిధులు, సాంకేతిక మార్గదర్శకాలు, జియో-ట్యాగింగ్, మానిటరింగ్ వ్యవస్థలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. “ ప్రతి వర్షపు నీటి చుక్క భూమిలోకి చేరాలి ” అనే లక్ష్యంతో ప్రోత్సాహం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కీలకం. 2019 వరకు సుమారు 2 లక్షల ఇంకుడు గుంటలు నిర్మించబడ్డాయి. అయితే, తర్వాత నిర్మాణాలు ఆగిపోయాయి; ఉన్నవి నిర్లక్ష్యంతో పూడికతో నిండిపోయాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ కార్యక్రమాలను నిర్వీర్యం చేసింది. 2024 – 2025 లో భూగర్భ జల రీఛార్జ్ లక్ష్యంగా ఇంకుడు గుంటల నిర్మాణం ప్రారంభించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కార్యక్రమం అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లడం లేదు.
భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పిట్స్ అవసరం ఉన్నప్పటికీ అమలు తగిన స్థాయిలో లేదు. ప్రతి గ్రామం మరియు పట్టణాలలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలు, వంటి నిర్మాణాల వద్ద రీఛార్జ్ పిట్స్, ట్రెంచ్ లు, రీఛార్జ్ వెల్స్ నిర్మించాలని, మరియు రోడ్డు డ్రైనేజ్, ఇంటినుండి వచ్చే గ్రే వాటర్ వద్ద సోక్ పిట్స్ వంటి నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, లోపాలు ఎక్కువై లక్ష్యాల కోసం పనులు మొక్కుబడిగా పూర్తి చేయడం, సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, నాణ్యత లేని నిర్మాణాలు, నిర్వహణా లోపం, మట్టితో నిండిపోవడం, పూర్తి కాని పనులను పూర్తి చేసినట్టు చూపడం, ప్రజల్లో అవగాహన లోపం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రామ స్థాయి పర్యవేక్షణ లేమి కనిపిస్తున్నది.
ఇట్టి పరిస్థితులలో అధికారులు క్రింది అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
1. రాష్ట్రవ్యాప్త “గ్రౌండ్‌వాటర్ రీచార్జ్ మిషన్” ప్రారంభించాలి.
2. ప్రతి గ్రామానికి వార్షిక భూగర్భ జల రీచార్జ్ టార్గెట్ నిర్ణయించాలి.
3. ప్రతి ఇంటికి తప్పనిసరిగా రీఛార్జ్ పిట్ మరియు సోక్ పిట్ ఉండాలనే నిబంధన అమలు చేయాలి.
4. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు భవనాలలో వర్షపునీటి సంరక్షణ మరియు భూగర్భ జల రీఛార్జ్ తప్పనిసరి చేయాలి.
5. గ్రామాలలో, పట్టణాలలోని వ్యవసాయ మరియు మంచినీటి చెరువులన్నింటిలో పూడిక తీయడం, చెరువులలోనికి వచ్చే కాలువలను, మార్గాలను శుభ్రం చేయడం వంటి పనుల వార్షిక నిర్వహణకు నిధులు కేటాయించి రైతులు, ప్రజల భాగస్వామ్యం తో ప్రతీ సంవత్సరం తప్పక చేపట్టాలి.
6. ప్రతి పనికి మరియు నిర్మాణానికి జియో-ట్యాగింగ్ & పబ్లిక్ మానిటరింగ్ అమలు చేయాలి.
7. నాణ్యత తనిఖీలకు థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్షన్ ఏర్పాటు చేయాలి.
8. గ్రామస్థాయి వాటర్ కమిటీలు ఏర్పాటు చేయాలి మరియు గ్రామ వాటర్ బడ్జెట్ అంచనాలు తయారు చేయించాలి.
9. గ్రామసభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామస్థాయిలో నీటి వనరుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి.
10. భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాల నిర్వహణకు ప్రత్యేక వార్షిక నిధి ఏర్పాటు చేయాలి.
11. బావులు, బోర్లు ఎండిపోతున్న మండలాలకు ప్రత్యేక రీచార్జ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి.
12. విద్యా సంస్థలలో వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భజల రీఛార్జ్ లపై మరియు జలవనరుల సంరక్షణ, సక్రమ నిర్వహణలపై భవిష్యత్ తరాలకు ప్రతినిధులైన విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలతో ప్రతీ సంవత్సరం తగిన అవగాహన, శిక్షణ కల్పించాలి.
పై అన్నిరకాల కార్యక్రమాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై బాధ్యత నిర్ణయించే వ్యవస్థ తీసుకురావాలి.
ఈ అంశాన్ని సాధారణ అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా, భవిష్యత్ తరాల జీవన భద్రత గా పరిగణించి అత్యవసర ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని మనవి.
ఈ రోజే గ్రామ స్థాయి నుంచి నీటి సంరక్షణను ఉద్యమంగా మార్చాలి. “ ప్రతి వర్షపు చుక్క భూమిలోకి చేరాలి—ప్రతి గ్రామం నీటి భద్రత కలిగిన గ్రామంగా మారాలి .”
ప్రభుత్వం ఈ మహత్తర లక్ష్యంతో బలమైన కార్యాచరణ చేపడుతుందని ఆశిస్తూ, ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాము.
జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని భాస్కర్ నగర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మంచినీటి పథకం కు మరమ్మత్తులు చేసి త్రాగునీరు సరఫరా చేయాలని, గ్రామం నుండి స్మశానానికి వెళ్లే రహదారి గోతులు మయంగా వర్షాకాలంలో బురదమయంగా మారిందని ఈ రహదారికి మరమ్మత్తులు చేయాలని, అలాగే గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి మాలపాటి లక్ష్మారెడ్డి అనే యువకుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తులు రావడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు అన్నవరపు శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.
*నరసరావుపేట జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
*నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ శుక్రవారం అనగా మే 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటలవరకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల నుండి భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త అయినటువంటి ఉడత ప్రసాదరావు తన తండ్రి మిలటరీలో పని చేసిన సందర్భంగా ప్రభుత్వం ద్వారా దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో సర్వే నెంబరు 989 లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగింది*
*సదరు తనకిచ్చిన ఈ భూమి రెవెన్యూ వారు సర్వే చేసి తనకు అప్పగించవలసినదిగా కోరుతూ జనతా వారధి కార్యక్రమం లో పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది*
*సదరు విషయాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు రెవెన్యూ వారిని సంప్రదించగా సర్వే నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు*
*జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది*
*ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయం లో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*
*మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు*
*చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ శాఖ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు చెందిన నేలటూరి ఏసురత్నం తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్సిపి నాయకులు తనకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు మార్పు చేయడంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . ఈ ఫిర్యాదుని బిజెపికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది.
సదరు ఈ విషయంపై ఆర్ ఓ ఆర్ యాక్ట్ ప్రకారము జనతా వారధి టీం ద్వారా ఆర్డిఓ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ మాజీ పట్టణ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
*విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*
*ప్రజల పక్షాన బీజేపీ - "జనతా వారధి" విజయపథం*
*విజయవాడలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, గౌరవనీయులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు అధ్యక్షతన నిర్వహించిన "జనతా వారధి" రివ్యూ సమావేశానికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు హాజరుకావడం జరిగింది*
*సమీక్షా సమావేశంలో పలనాడు జిల్లాలో ఇప్పటివరకు జరిగిన జనతా వారిది కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు రాష్ట్ర జట్టుకు అందించడం జరిగింది . వాటిని పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ను సభాముఖంగా అభినందించడం జరిగింది*
*ఈ సందర్భంగా మాధవ్ గారు "జనతా వారధి" కార్యక్రమ పురోగతిని సమీక్షించి, ప్రజల సమస్యలను మరింత వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించడానికి మాకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎలా పని చేయాలో ఆయన విలువైన మార్గదర్శకాలను అందించారు.
4000+ అర్జీల స్వీకరణ వేలాది మంది ప్రజలు మాపై నమ్మకంతో సమస్యలను విన్నవించారు*
70% పరిష్కార దిశగా అందిన అర్జీలలో అత్యధిక శాతాన్ని సానుకూల పరిష్కారానికి తీసుకెళ్లగలిగాం.
ప్రతి శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రజల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
ప్రజల కన్నీళ్లు తుడిచే వరకు, వారి గొంతుకగా నిలిచే వరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. మీ సమస్యే మా బాధ్యత!
*పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా జనతా వారధి టీం*
*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారి అనుమతితో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పలనాడు జిల్లా జనతా భారతి మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది*
*ఈ విషయంపై స్పందించిన డిఆర్ఓ గారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సుభాని గారికి ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది*
*విషయం*
*రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులకు జారీ చేస్తున్న AP Labour Card / BOCW Card నమోదు, రెన్యువల్, క్లెయిమ్, అవగాహన, శాఖల సమన్వయం వంటి అంశాలను సరళీకృతం చేసి నిజమైన లబ్ధి అందించాలనే వినతి*
రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసే నిర్మాణ కార్మికులు తమ చెమటతో రోడ్లు, ఇళ్లు, కార్యాలయాలు, భారీ భవనాలు నిర్మిస్తున్నారు. అయితే అదే కార్మికుడు తన హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరం.
ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శమైన అభివృద్ధి సంక్షేమం లక్ష్యసాధనతో సమిష్టిగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరాలి. పారదర్శకమైన పాలన అందాలి. అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గ్రామాలు, నగరాలను సందర్శిస్తూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తోంది. ప్రతి శుక్రవారం BJP కార్యాలయాల్లో ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రతి సోమవారం ఆయా అధికారుల ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి సూచనలు, సలహాలు అందిస్తోంది. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది.
ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికులు, పేద కూలీల నుంచి అనేక వినతిపత్రాలు అందాయి.
వారి సమస్యలను పరిశీలించినప్పుడు....,
గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేసింది. కార్మికుల కోట్ల రూపాయలు దారి మల్లించింది అని బాధపడుతున్నారు.
లేబర్ కార్డు ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం, అర్హులైన వారు కూడా లబ్ధి పొందకపోవడం, తమకు ఉన్న హక్కులపై స్పష్టత లేకపోవడం, మధ్యవర్తుల చేతుల్లో BOCW Card నలిగిపోవడం, పేదవాడి హక్కు చిరునామా లేకుండా తిరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఇది అత్యంత బాధాకరం.
ప్రభుత్వం 18 లక్షల మంది కార్మికులు BOCW Card / labour Card కోసం నమోదు అయ్యారు అని చెబుతోంది. అయితే, ఎంతమందికి కార్డు జారీ చేశారు? ఎంతమందికి నిజంగా లబ్ధి అందింది? ఏ పథకం ద్వారా ఎంతమందికి సహాయం అందింది? ఇందులో నిర్మాణ రంగంలో ఉన్న నిజమైన కార్మికులు ఎంతమంది? అనే విషయాల్లో స్పష్టత లేదు.
AP Labour Card / BOCW Card అంటే Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board ద్వారా నిర్మాణ కార్మికులకు జారీ చేసే సంక్షేమ గుర్తింపు కార్డు. ఈ కార్డు ద్వారా కార్మికుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హత పొందుతాడు.
వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. గత 12 నెలల్లో కనీసం 90 రోజులు నిర్మాణ పనిలో పనిచేసి ఉండాలి అనేది అర్హత.
ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్, పని ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తదితర డాక్యుమెంట్స్ ఉండాలి. గ్రామ / వార్డు సచివాలయం, MeeSeva కేంద్రాలు, Labour Office, అధికారిక పోర్టల్ లలో నమోదు చేసుకోవాలి.
ప్రమాద మరణం / శాశ్వత వికలాంగత్వం జరిగితే ₹5,00,000 వరకు, సహజ మరణం కు ₹60,000 వరకు, అంత్యక్రియల సాయం గా ₹20,000 వరకు, ప్రసూతి సహకారం కోసం ₹20,000 వరకు, వివాహ సాయం ₹40,000 వరకు, పిల్లల విద్యా సాయం / స్కాలర్‌షిప్, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ప్రయోజనాలు కార్డు ద్వారా పొందుతారు.
ప్రమాదం అయితే FIR / ఆసుపత్రి రికార్డు, మరణం అయితే Death సర్టిఫికెట్, ప్రసూతి కి ఆసుపత్రి ధృవీకరణ, వివాహం కోసం వివాహ ధృవీకరణ, విద్యా సాయం కోసం Bonafide / మార్కుల మెమో అవసరం అవుతాయి.
ఈ విధివిధానాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమమైన లేబర్ సంక్షేమ పథకాన్ని రూపొందించింది. పథకం గొప్పది కానీ ప్రచారం అమలు బలహీనంగా ఉంది.
ఈ లేబర్ కార్డు హక్కులు సమర్థంగా అమలు కావాలంటే Labour Department , APBOCW Welfare Board, గ్రామ / వార్డు సచివాలయ శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ / ఆసుపత్రులు, Revenue శాఖ, MeeSeva / IT శాఖ, విద్యాశాఖ లు సమన్వయం తో పని చేయాలి. కానీ వాస్తవంగా ఈ శాఖల మధ్య సమన్వయం కనిపించడం లేదు. నిర్లక్ష్యం మరియు నిర్లిప్తత కనిపిస్తోంది.
రిజిస్ట్రేషన్ ఉంది. కానీ లబ్ధి తక్కువ, అవగాహన లేదు, సంఘాల పేరుతో మధ్యవర్తులు పెరిగారు, కార్మికుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు, Renewal విధానంలో లోపాలు వున్నాయి. ప్రతి సంవత్సరం 90 రోజుల పని ధృవీకరణ, పత్రాల సమర్పణ వల్ల కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు. చాలా చోట్ల యాజమాన్యం పని ధృవీకరణ ఇవ్వడం లేదు.
కేంద్ర ప్రభుత్వం Pradhan Mantri Suraksha Bima Yojana, Pradhan Mantri Shram Yogi Maandhan, Ayushman Bharath లాంటి సంక్షేమ పధకాలు ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నేరుగా చట్టం, డేటాబేస్, బీమా, నిధుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. e-Shram Portal ద్వారా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ఇస్తుంది. Building and Other Construction Workers Act, 1996, Building and Other Construction Workers Welfare Cess Act, 1996 ఈ చట్టాల ద్వారా రాష్ట్రాలు Welfare Board ఏర్పాటు చేయాలి. Welfare Board లకు Grants , loans ఇస్తున్నది. Chief Labour Commissioner పర్యవేక్షించాలి. మోడీ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ ఖర్చుపై 1% నుంచి 2% వరకు cess వసూలు పై కేంద్ర చట్టం చేసి ఆ నిధులు రాష్ట్రానికే అవకాశం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 1% బిల్డింగ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఒక భవనం నిర్మాణ ఖర్చు ₹50 లక్షలు అయితే
సుమారు ₹50,000 Labour Cess ను Builders, కాంట్రాక్టర్స్, Apartment / Commercial నిర్మాణ యజమానులు కొన్ని సందర్భాల్లో ఇల్లు కట్టుకునే వ్యక్తులు కూడా చెల్లిస్తున్నారు.
ఈ డబ్బు నేరుగా కేంద్రానికి కాకుండా
State Welfare Board Fund లోకి వెళ్లే ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేసింది. అందుకే ఈ నిధులన్నీ Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board దగ్గరికి వెళ్తున్నాయి.
ఈ నిధుల నుంచి మరణ సాయం, ప్రమాద సాయం, ప్రసూతి విద్యా సాయం, స్కాలర్‌షిప్, నైపుణ్య శిక్షణ అందించాలి.
“రాష్ట్రంలో కోట్ల రూపాయల Building Cess వసూలు అవుతోంది. ఆ మొత్తంలో ఎంత కార్మికుడికి చేరింది?”
అధికారుల్లో “Cess వసూలు చేయడంలో ఉన్న వేగం Claim సెటిల్ చేయడంలో ఎందుకు లేదు??
ఎంత cess వసూలు చేస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు ? ఎంత బ్యాలెన్స్ ఉంది? అనే విషయాల్లోకి వెళ్తే వేల కోట్ల బిల్డింగ్ సెస్ వాడకుండా పడిఉండటం లేదా ఇతర విషయాలకు వినియోగించడం జరిరుగుతుంది. గత ప్రభుత్వం ఈ నిధులు మల్లించి భవనకార్మికులకు తీరని అన్యాయం చేసింది.
Aadhaar, e-Shram, PF/ESI, Secretariat Data ద్వారా Auto Renewal చేయాలి. Single Window Claim System అమలు చేయాలి. ఒక ప్రమాదం జరిగితే ఆసుపత్రి, పోలీస్, Labour Board, Secretariat , Approval DBT ఈ మొత్తం ప్రక్రియ ఒకే సిస్టమ్‌లో జరగాలి అని మేము స్పష్టం చేస్తున్నాం.
ఈ క్రింది అంశాలు విన్నవిస్తున్నాము.
• Registration సరళీకృతం చేయాలి
• Auto Renewal అమలు చేయాలి
• Single Window Claim System తీసుకురావాలి
• శాఖల డేటా ఇంటిగ్రేషన్ చేయాలి
• గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి
• లబ్ధిదారుల డేటా పబ్లిక్ చేయాలి
• Doorstep సేవలు ఇవ్వాలి
• WhatsApp / App / Toll Free Claim సౌకర్యం కల్పించాలి
• మధ్యవర్తులను అరికట్టాలి
• నిర్మాణ రంగం మరియు ఇతర రంగాల యాజమాన్యాలు అసంఘటిత కార్మికుల వివరాలు సక్రమంగా ఇవ్వాలి
• ప్రతి నెల ప్రగతి నివేదిక విడుదల చేయాలి
కార్మికుని కష్టానికి విలువ ఉండాలి.
ఒక కూలీ తన హక్కు కోసం తిరగకూడదు.
ప్రభుత్వమే కార్మికుని దగ్గరకు వెళ్లాలి.
రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్డు ద్వారా ఇస్తున్న పథకాల ఉన్నత లక్ష్యాన్ని మేము అభినందిస్తున్నాము.
అయితే వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం విడిచి పనిచేయాలి అని భారతీయ జనతా పార్టీ విన్నావుస్తుంది.
జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు
శ్యావలాపురం మండలం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శావల్యాపురం మండలంలోని చినకంచెర్ల గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో పిచికలపాలెం మీదుగా వినుకొండ వెళ్ళు రహదారి మంజూరయ్యి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించలేదని, త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని, అలాగే గ్రామం నుండి ఏనుగుపాలెం వెళ్ళు పొలం రహదారి అధ్వానంగా ఉన్నందున, గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టాలని ,అలాగే మరికొందరు కిసాన్ సమ్మన్ నిధి కి సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దావులూరి చిన్న పేరయ్య గారు, బిజెపి నేతలు దావులూరి వినోద్ కుమార్, కటారి శాంతిబాబు, పాల్గొన్నారు.
*పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
*ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం కూడా జరిగింది. తదుపరి సంబంధిత ప్రభుత్వ అధికారులకు వాటిపై వివరణ అడిగి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి తెలియజేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో బిజెపి పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు*
Subscribe to:
Posts (Atom)