March 2026


పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న జనతా వారిధి కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు శ్రీ PVN మాధవ్ గారి పిలుపు మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాలతో, పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డి ఆర్ ఓ  గారికి హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ, శిధిలావస్థలో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు , పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి వినుకొండ బిజెపి నాయకులు  ఎడ్లపాడు మండల బిజెపి నాయకులు చిలకలూరిపేట బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

*విషయం: హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై  వినతిపత్రం*


భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మాకం గా నిర్వహిస్తున్న కార్యక్రమం "జనతా వారధి" ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్న గ్రామ నగర పర్యటనల్లో హిందు ఆలయాలు ధర్మకర్తలు మరియు భక్తులలో ఆందోళనలు కనిపించాయి. 

హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ మధ్య ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం కొందరికి తీవ్రమైన గాయాలు పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది. ఇటువంటి అల్లర్లు ప్రోత్సహించే సూత్రదారులపై చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాము.

సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునఃనిర్మించాలి.

హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి, అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి  మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి.

దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి

33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.

హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు.
హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలి. 

ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము.

దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 

భారతీయ జనతా పార్టీ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది...

• దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
• దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
• దీర్ఘకాళిక లీజుల కాకుండా స్వల్పకాలిక లీజులపై దృష్టి పెట్టాలి..
• ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం పునఃపరిశీలించాలి.
• అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.
• దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.
• ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.
• CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరుద్దరించాలి.
• అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.
• హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.

ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది హిందూ 

హిందూ దేవాలయ భూముల మరియు రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం  మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలన ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని హిందువులపై జరుగుతున్న డాడులను నిరోధించాలని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కోరుచున్నది.

ఇట్లు 
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్


శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు ,వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు,  పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ఈ వారం "జనతా వారధి" కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామంలో స్థానిక బిజెపి నేత శ్రీ దివ్యకోలు నాగేశ్వరావు గారి నిర్వహణలో చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. గ్రామ రైతులకు ప్రజానీకానికి అత్యంత ముఖ్యమైన కొత్తలూరు గ్రామం నుండి అంగులూరు వెళ్లేటువంటి లింకు రోడ్డు, గుర్రంవారిపాలెం వెళ్లేటువంటి రహదారి, బోడిశంభునివారిపాలెం వెళ్లేటువంటి రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, ఈ యొక్క రహదారి మార్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రైతులకు సుమారు 2000 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నారని, ఎరువులు పొలాలకు తీసుకువెళ్లాలన్న, పంటను ఇంటికి తీసుకొచ్చుకోవాలన్న మోకాలు లోతు గుంతలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కూటమి ప్రభుత్వం మంజూరు చేయాలని దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అలాగే శావల్యాపురం వెళ్ళేటువంటి రహదారి నిర్మాణం చేపట్టినప్పటికీ ఇంకా ఒక కిలోమీటర్లు నిర్మాణం చేపట్టనందున అది కూడా నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం క్రింద మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం తీసివేసిన వృద్ధాప్య పెన్షన్లను తిరిగి మంజూరు చేయాలని మొత్తం ఆరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేత తిరువీధుల శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.


పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్

 పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గారికి రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన సంచార జాతుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం క్రోసూరు మండలంలో ప్రధాన సమస్య అయినటువంటి మరుగుదొడ్లు మరియు పంట కాలవల మెయింటినెన్స్ గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు క్రోసూరు మండల బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల 
జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,
పల్నాడు జిల్లా 

విషయం: రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కల్పించవలెనని వినతి.

అమ్మ..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా గుర్తించకపోవడం, కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వీరికి అందకపోవడం దురదృష్టకరం.

కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ డీనోటిఫైడ్, నామాడిక్ & సెమీ-నామాడిక్ తెగల కమిషన్ సిఫార్సులు మరియు దేశవ్యాప్తంగా ఈ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలు (ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఆలస్యం) దృష్టిలో ఉంచుకుని, ఈ విషయం తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, ఈ తెగల వారిని గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను వర్తింపజేయవలసిందిగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవపూర్వకంగా కోరుతున్నాం.

                        ఇట్లు
           ఏలూరి శశి కుమార్ 
            పల్నాడు జిల్లా అధ్యక్షులు
      భారతీయ జనతా పార్టీ



పల్నాడు జిల్లా జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు పల్నాడు జిల్లా జనతా వారధి టీం  సభ్యులకు విజ్ఞప్తి

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనతా వారిది కార్యక్రమాన్ని ఇప్పటినుంచి మీ మండలాల్లో జరిగిన అన్ని జనతా వారధి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను www.bjpvaaradhi.com వెబ్సైట్ లొ ఆన్లైన్లో అప్లోడ్ చేయబడును. కావున పల్నాడు జిల్లా జనతా వారధి టీం మండల అధ్యక్షులు మండల ఇంచార్జి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా జనతా వారధి కార్యక్రమాన్ని మీ మండలాల్లో నిర్వహించాలని నిర్వహించిన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను జనతా వారధి వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

 

*మల్లెల శివ నాగేశ్వరరావు* 
 *పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు*
 *జనతా వారధి పల్నాడు జిల్లా కన్వీనర్*
 


శావల్యాపురం మండలంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈ వారం జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముండ్రువారిపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత గుంజా వెంకటేశ్వర్లు నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు గ్రామీణ రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి శుద్ధి చేసిన నీరు సరఫరా కొరకై ,అలాగే గ్రామంలోని సైడ్ డ్రైనేజ్ పూర్తిస్థాయిలో పూడిక పూడికతీత కొరకై ,అలాగే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు కొరకై, సైడ్ డ్రైనేజీలు నిర్మాణం కొరకై, నూతన సిసి రోడ్లు ఏర్పాటు కొరకై వంటి అంశాలపై 5 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది.



పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది

 *రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సనాతన హిందూ సాంప్రదాయ పండుగలకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా యువ నాయకులు ఇంగ్గుటూరి రాజశేఖర్ రెడ్డి చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

*రాష్ట్ర కంటెంట్ – జనతా వారధి*

*విషయం: వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి – ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలి – భారతీయ జనతా పార్టీ వినతి*

*భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా “జనతా వారధి” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం, శనివారం మరియు ఆదివారం రోజులలో బిజెపి ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు మండల స్థాయిలో గ్రామాలు, పట్టణాలు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, అక్కడికక్కడే పరిష్కరించగల సమస్యలను పరిష్కరిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన అంశాలను ప్రతి సోమవారం PGRS ద్వారా ప్రభుత్వానికి వినతుల రూపంలో తెలియజేస్తున్నారు*

*ఈ విధంగా బిజెపి నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తోంది*

*ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన జనతా వారధి పర్యటనలలో ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు మరియు భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందాయి. త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కోరారు*

*భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన మరియు ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుంది. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు మరియు అనంతరం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలు భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పర్వదినాలు. ఈ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, హోమాలు, సీతారామ కల్యాణాలు, భజనలు, హరికథలు వంటి కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతాయి*

*అదే సమయంలో వసంత నవరాత్రులు అమ్మవారికి కూడా అత్యంత ప్రియమైన పర్వదినాలుగా భావించబడుతాయి. అందువల్ల గ్రామాలలో ఉన్న అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం*

*ఈ ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సంస్కృతి మరియు సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి*

*అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాలు మరియు పట్టణాల్లో ఉన్న రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల ఆలయ కమిటీలు మరియు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని జనతా వారధి పర్యటనలో వెల్లడైంది*

*కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఆలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము*

ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ముఖ్యమైన ఏర్పాట్లు:
• ఆలయ ప్రాంగణాల శుభ్రపరిచే పనులు
• విద్యుత్ దీపాలంకరణలు మరియు ఆలయాల అలంకరణ
• వసంత నవరాత్రుల ప్రత్యేక పూజలు మరియు హోమాల నిర్వహణ
• శ్రీ సీతారామ కల్యాణం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు
• భక్తులకు ప్రసాదం మరియు అన్నదానం కార్యక్రమాలు
• హరికథలు, భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు
• భక్తులకు తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలు
• భక్తులకు కూర్చునే సదుపాయాలు మరియు తాత్కాలిక పందిళ్లు
• భక్తుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు
• ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత నిర్వహణ

*అలాగే ఉగాది సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉగాది పచ్చడి కోసం అవసరమైన పదార్థాలు, పండ్లు, పూలు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేసే మార్కెట్ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది*

అందుకోసం:
• మార్కెట్ ప్రాంతాల్లో శుభ్రత నిర్వహణ
• తాగునీటి సదుపాయం
• ట్రాఫిక్ నియంత్రణ
• తాత్కాలిక షెడ్లు మరియు ప్రజలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు
• భద్రత మరియు ప్రజా సౌకర్యాల ఏర్పాటు

ఇలాంటి ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించబడటమే కాకుండా భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
-కాబట్టి రాష్ట్రంలోని అన్ని రామాలయాలు, అమ్మవారి ఆలయాలు మరియు గ్రామ దేవతల దేవాలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారిని వినమ్రంగా కోరుతున్నాము


*భారతీయ జనతా పార్టీ*
*పల్నాడు . జిల్లా*


శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది


 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు ,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు, పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ,ఈ వారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం  బిజెపి మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, మండలంలోని పిచికలపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా, గ్రామస్తులు రక్షిత మంచినీటి పథకం గత మూడు సంవత్సరాలుగా మరుగును పడిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని అందులో భాగంగా జేజేఎం స్కీం మంజూరు చేయాలని  అలాగే గ్రామంలో నుండి శావల్యాపురం వెళ్ళేటటువంటి రహదారిలో రాకపోకలకు కొంకేరువాగుపై ఎటువంటి నిర్మాణం లేనందున బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ,అలాగే మరొక రెండు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చాయి వీటి యొక్క పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి గ్రామస్తులకు దరఖాస్తుదారులకు తెలిపాము


కారంపూడి మండలం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

జనతా వారిది కార్యక్రమం కారంపొడి  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్ మాధవ గారి పిలుపుమేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు కారంపూడి మండలం లో మండల అధ్యక్షులు కొత్తపల్లి గిరిధర్ అధ్యక్షతన జనత వారధి కార్యక్రమం జరిగింది సదరు కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చిట్టి హనుమంతరావు గారు జిల్లా కోశాధికారి కజం ఆంజనేయులు గారు పువ్వాడ శ్రీనివాసరావు గారు మండల ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు బొంకూరి రఘు గారు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఈదకోటి రెడ్డి గారు మండల ఇన్చార్జ్ డాక్టర్ వడ్లమూడివెంకయ్య గారు పాల్గొన్నారు ప్రజల నుండి ప్రజా విన్నత పత్రం స్వీకరించాము



పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన పల్నాడు జిల్లా జనతా వారిది టీం

 *భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలుషితమైన నీటి సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

 *గత ప్రభుత్వంలో వివక్షతకు గురైన కలుషిత నీటి సమస్యపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నబాట్ల ఆదిత్య పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నార్స్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర యువ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ వంకాయలపాటి వంశీధర్ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వారికూటి రాజేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ చిలకలూరిపేట ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది*

 *సదరు ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే బిజెపి ఆధ్వర్యంలో ఇచ్చిన ఫిర్యాదును పలనాడు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి ఆర్ డబ్ల్యు ఎస్ డిపార్ట్మెంట్ వారికి పంపించడం జరిగింది*

విషయం : *కలుషిత తాగునీటి వల్ల వ్యాధుల వ్యాప్తి, రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలి* 
.....భారతీయ జనతా పార్టీ డిమాండ్ 

రాష్ట్రంలో *కలుషిత తాగునీటి కారణంగా వ్యాధుల వ్యాప్తి* పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి వినతి.

 *భారతీయ జనతా పార్టీ* ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం *జనతా వారధి* ద్వారా గ్రామాలు నగరాల్లో పర్యటనలు చేయగా త్రాగు నీరు ద్వారా వ్యాధుల వ్యాప్తి పై ప్రజల నుంచి ఆందోళన కనిపిస్తుంది. ప్రజలు పెద్దఎత్తున మాకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి కలుషితం కారణంగా డయేరియా, కలరా, సీజనల్ జ్వరాలు వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు పలుచోట్ల నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల శ్రీకాకుళం  జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కలుషిత తాగునీటి కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం మరియు మరణాలు కూడా చోటు చేసుకోవడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం.

అధికారిక నివేదికలు మరియు ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2019 నుంచు 2024 వరకు కలుషితం త్రాగు నీరు ద్వారా వచ్చే వ్యాధుల పెరగడమే కాకుండా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి ద్వారా వ్యాధి వ్యాప్తి ఘటనలు సుమారు 59 వరకు నమోదయ్యాయి. 2025 సంవత్సరంలో ఇటువంటి ఘటనలు 21 నమోదు అయ్యాయి, వీటిలో వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు మరియు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. 2026 సంవత్సరంలో కూడా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇటువంటి ఘటనలు నమోదవుతున్నాయి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దఎత్తున డయేరియా వ్యాప్తి జరిగింది. ఈ ఘటనలో 70 నుంచి 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారు. ఒక మరణం నమోదైంది. సుమారు 20 జిల్లాల్లో త్రాగునీరు ద్వారా వ్యాధులు గుర్తించబడ్డాయి. అంతే కాదు అధికారిక ఘనాంకాలలో 10% మాత్రమే నమోదవుతున్నాయి. త్రాగునీటి ద్వారా వచ్చే వ్యాధిని ఎదుర్కున్న వ్యక్తిగత ఘటనలు నమోదు అవ్వడం లేదు 

ఇలాంటి ఘటనలు ప్రధానంగా ఈ క్రింది కారణాల వల్ల జరుగుతున్నట్లు కనిపిస్తోంది అని మా బిజెపి నాయకుల " *జనతా వారధి"* పర్యటనలలో గమనించాము.

• పాత మున్సిపల్ తాగునీటి పైపులైన్లు లీక్ అవడం
• డ్రైనేజ్ నీరు తాగునీటి పైపుల్లో కలవడం
• పట్టణాలు మరియు గ్రామాల్లో శుభ్రం చేయని ఓవర్ హెడ్ ట్యాంకులు
• సరైన నియంత్రణ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ RO ప్లాంట్లు
• గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేయని బోర్‌వెల్ నీటి వినియోగం
• గృహాల్లో శుభ్రం చేయని వాటర్ ట్యాంక్ లు మరియు అవగాహన లోపం.

ఈ సమస్యల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రజలు ఆరోగ్యపరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నమోదవుతున్న వివిధ వ్యాధులకు కల్తీ ఆహారం ఒక సమస్య అయితే రెండవ అతిపెద్ద సమస్య శుద్ధిలేని త్రాగునీరు 

తాగునీటి భద్రత అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులిస్తుంది. ప్రతి గ్రామీణ ఇంటికి Functional Household Tap Connection (FHTC) ద్వారా శుద్ధమైన తాగునీరు అందించడం లక్ష్యంగా *జల్ జీవన్ మిషన్*, పట్టణ ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీటి సరఫరా మరియు డ్రైనేజ్ వ్యవస్థలు మెరుగుపరచడం కోసం *అమృత్ 2.o*  , పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థల అభివృద్ధి ద్వారా నీటి కలుషితాన్ని తగ్గించడం ధ్యేయంగా *స్వచ్ఛ భరత్ మిషన్* , భూగర్భ జలాల నిర్వహణ మరియు నీటి వనరుల సంరక్షణ కోసం *అటల్ భూ జల్ యోజన*,  తదితర పధకాలతో నేరుగా ఆర్థిక సహాయం, నీటి సరఫరా, ప్రాజెక్టులకు నిధులు , నీటి నాణ్యత పరీక్ష ల్యాబ్‌లు, నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మాణం, టెక్నికల్ మార్గదర్శకాలను కేంద్రంలో *నరేంద్ర మోడీ* గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నది. 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. కలుషిత త్రాగునీరు వ్యాధులు వ్యాపించడం లో పై స్థాయి అధికారుల జవాబుదారీతనం లేకపోవడం మరియు క్రింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తున్నది.

కాబట్టి ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తక్షణ చర్యలు చేపట్టడం అవసరం.

అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ క్రింది చర్యలు తక్షణమే చేపట్టాలని వినమ్రంగా కోరుతున్నాము

• రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
• పాత మరియు లీకేజీ ఉన్న పైపులైన్లను తక్షణమే మరమ్మతు చేయాలి లేదా మార్చాలి.
• అన్ని పట్టణాలు మరియు గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రతను నియమితంగా నిర్వహించే విధానం అమలు చేయాలి.
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ RO ప్లాంట్లపై కఠిన తనిఖీలు చేసి నాణ్యత ప్రమాణాలు అమలు చేయాలి.
• గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి.
• ప్రతి జిల్లాలో నీటి శుద్ధి మరియు అవగాహన కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి.
• ప్రజలకు తాగునీటి భద్రతపై ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని నీటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గిపోవడంతో మలినాలు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. తర్వాత వర్షాల సమయానికి త్రాగు నీరు వలన వచ్చే వ్యాధులు మరింత పెరుగుతాయి 

రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి *రాష్ట్రవ్యాప్తంగా నీటి శుద్ధి కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి* అని వినమ్రంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.


మాచర్ల లో జరిగిన జనతా వారధి కార్యక్రమం లో ఒక ఫిర్యాదు స్వీకరించడం జరిగింది

మార్చి నెలలోనే ఎండలు తీవ్రత పెరిగిన నేపథ్యంలో మాచర్ల పట్టణం ప్రధాన రహదారిపై పలుచోట్ల మున్సిపల్ అధికారులు చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొత్తపల్లి గ్రామానికి చెందిన బి వెంకట్రావు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్న నేపథ్యంలో ఈ చలివేంద్రాల్లో ఆ వాటర్ వాడాలని ఆయన కోరారు.బిజెపి మాచర్ల పట్టణ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కార్యక్రమం గురువారం జరిగింది. ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ లు కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఫిర్యాదురుడికి బిజెపి శ్రేణులు వివరించారు.


దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

దాచేపల్లి మండలంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జనతా వారిది కార్యక్రమం నిర్వహించాము. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం 2026 - 27 కు సంబంధించి RTE ద్వారా 1వ తరగతి ప్రవేశానికి అప్లై చేస్తుండగా వెబ్ ఆప్షన్స్ లో పలు టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల సంబంధించి దాచేపల్లి మండల విద్యాశాఖ వారి కార్యాలయ అధికారులకు వివరించి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఈ RTE పాలసీకి కి సంబంధించిన సమస్యను అవకాశం ఉన్నంత  త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. ఈనెల 10వ తారీకు తో ఆన్లైన్ అప్లికేషన్ గడువు కూడా ముగుస్తుంది.  అప్లికేషన్ పెట్టుకోవడంలో సమస్యలు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది అవకాశం ఉండి కలిసిన సత్వరం పరిష్కరించుకుండ సంబంధిత వారికి ఇన్ఫామ్ చేస్తాము అంటున్నారు. సత్వర సమస్యలను పరిష్కరిస్తూ ఈ అవకాశం అందరూ వినియోగించుకునేలా చేయాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, మాజీ అసెంబ్లీ కన్వీనర్ ఆర్య వెంకటేశ్వర్లు గారు పలువురు విద్యార్థి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమాన్ని  భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు నకిరేకల్లు మండలంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో మండల ఇన్చార్జిగా పాల్గొని నకిరేకల్లు మండల చల్లగుల్ల గ్రామం నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్లు మండల అధ్యక్షులు మున్వర్ బాజీ గారు, సీనియర్ నాయకులు మరియు ట్రెజర్ ఇర్లా నాగరాజు గారు, తదితర పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు  పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని గుంటుపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత అన్నవరపు శ్రీనివాసరావు గారి నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఐదు అర్జీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇంటింటికి త్రాగునీరు పథకం జేజేఎం స్కీం ప్రారంభించిన పది రోజులకే మరుగున పడిపోయిందని మరల పథకాన్ని పునరుద్ధరించాలని అలాగే గ్రామం లోని పొలాలకు వెళ్లేటువంటి రహదారులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రహదారులు గ్రావెల్ రోడ్లు వేయించాలని అలాగే గ్రామంలో శుభకార్యాలకు వివిధ కార్యక్రమాలకు ఎటువంటి మండపాలు గాని ఫంక్షన్ హాల్ లేనందున బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించాలని అలాగే పిట్టంబండ మేజర్ పైన కల్వర్టు మంజూరు చేయాలని కోరారు గ్రామస్తుులు పాల్గొన్నారు ు


పిడుగురాళ్ళ పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారిది ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశాల తోజరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు కేతావత్తు శ్రీనివాస నాయక్ పట్టణ ఉపాధ్యక్షురాలు సూర్య పల్లి అంజమ్మ పట్టణ కోశాధికారి వృధా ప్రసాద్ రావు అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీలు వివరాలు పిడుగురాళ్ల పట్నంలో గల సీతారాంపురం తండ నివాసులైన పడితే దుర్గమ్మ పడితే తిరుపతమ్మ గిరిజన మహిళలు ఇంటి స్థలం కొరకు అర్జీలు ఇవ్వడం జరిగినది
పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతి తో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు


*బిగ్ బాస్ ని అరెస్ట్ చేయండి* 

ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయం కోరుకుంటోంది. 

విషయం: 2019-2024 లిక్కర్ పాలసీలో భారీ ఆర్థిక కుంభకోణం - 'బిగ్ బాస్' (గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి)ని అరెస్టు చేసి పూర్తి దర్యాప్తు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్

భారతీయ జనతా పార్టీ ' *జనతా వారధి* ' కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో పర్యటించినప్పుడు ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో లిక్కర్ పాలసీలో జరిగిన భారీ అవకతవకల గురించి వెల్లడి చేశారు. మద్యం విక్రయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, అనుకూల కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చి, నాణ్యత లేని కల్తీ మద్యాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల వేలాది కుటుంబాలు నాశనం అయ్యాయి, యువత భవిష్యత్తు చీకటిలో మునిగింది, లివర్ సంబంధిత మరణాలు పెరిగాయి.

ఎక్సైజ్ ఆదాయం 2019-20లో ₹17,000 కోట్లకు పైగా ఉండగా, 2022-23కి ₹23,000 కోట్లు, 2024-25లో ₹28,000 కోట్లకు చేరింది. ఈ వ్యత్యాసం మొత్తం ఎక్కడికి వెళ్ళింది.

అంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా మొత్తం కొనుగోళ్లు, సరఫరా, విక్రయాలు కేంద్రీకరించి, ఔట్‌సోర్సింగ్ పేరుతో అనుకూలులను నియమించి అవినీతి చేశారు. నగదు అమ్మకాలు, డిజిటల్ లావాదేవీలు నివారించి బ్లాక్ మనీ మల్లించారు. అధికారం ఉపయోగించి డిస్టిల్లరీలు స్వాదీనం చేసుకుని NDP రా మెటీరియల్ కొనుగోలు చేసి సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మారు.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దాఖలు చేసిన 305 పేజీల ఛార్జ్ షీట్‌లో ₹3,200-3,500 కోట్ల కుంభకోణంలో 'బిగ్ బాస్' (జగన్ రెడ్డి) పాత్ర కీలకమని, 90% బిగ్ బాస్ కి చేరాయని అంటే సుమారు ₹2970 కోట్లు బిగ్ బాస్ కు అందాయని, ప్రతి నెల ₹50-60 కోట్ల ముడుపులు వారికి చేరాయని స్పష్టం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలు కాల్ డేటా, గూగుల్ టేక్‌ అవుట్‌ల ద్వారా రుజువైంది. విజయవాడ ACB కోర్టు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది.  (GO 111, 126 మేరకు) 48 మంది పై కేసులు, 16 అరెస్టులు జరిగాయి, ₹62.86 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. ఇది అతిపెద్ద లిక్కర్ *ఆర్ధిక కుంభకోణం*  వేల కోట్ల రూపాయల అవినీతి చేసి నేరుగా వారి జేబుల్లోకి డబ్బు చేరింది. అతి తక్కువ ఆస్తులు సీజ్ చేయడం వలన నిందితులకు వచ్చిన నష్టం ఏమి లేదు.

పై అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, 

నిందితులు చెప్పిన *బిగ్ బాస్* ని అరెస్ట్ చేసి 2019-2024 లిక్కర్ పాలసీ పై మరింత విచారణ ఆదేశించాలి. చేసిన అవినీతికి తగిన ఆస్తులు గుర్తించి సీజ్ చేయాలి. పూర్తి వైట్ పేపర్ విడుదల చేయాలి - అమ్మకాలు, టర్నోవర్, టాక్స్,డిస్టిల్లరీ ఒప్పందాల వివరాలు ప్రజలకు తెలియాలి.

ముందుగా అసలు సూత్రాధికారి 'బిగ్ బాస్'ని అరెస్టు చేసి విచారించాలి.

ప్రజల డబ్బుకు జవాబుదారీతనం ఉండాలి. నిజం బయటకు రావాలి. మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నది.