Total Pageviews

TRENDING NOW




*నరసరావుపేట జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *నరసరావుపేట జిల్లా కార్యాలయంలో ఈ శుక్రవారం అనగా మే 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటలవరకు జనతా వారది కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల నుండి భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త  అయినటువంటి ఉడత ప్రసాదరావు తన తండ్రి మిలటరీలో పని చేసిన సందర్భంగా  ప్రభుత్వం ద్వారా దుర్గి మండలం కోలగుట్ల గ్రామంలో సర్వే నెంబరు 989 లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వటం జరిగింది*

 *సదరు తనకిచ్చిన ఈ భూమి రెవెన్యూ వారు సర్వే చేసి తనకు అప్పగించవలసినదిగా కోరుతూ జనతా వారధి కార్యక్రమం లో  పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది*

 *సదరు విషయాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు రెవెన్యూ వారిని సంప్రదించగా సర్వే నిమిత్తం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు*

 *జనతా వారది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో నమోదు చేయడం జరిగింది*

 *ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జనతా వారి కార్యక్రమం ప్రతి గురువారం అన్ని మండలాలలో పార్టీ కార్యాలయం లో అలాగే ప్రతి శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది తెలియజేసిన పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అలాగే శుక్రవారం నరసరావుపేట జిల్లా కార్యాలయం వచ్చే ఫిర్యాదులను అన్నింటిని సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రభుత్వం వారికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు తెలియజేశారు*



*చిలకలూరిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో  జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

 రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్  గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని  చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ గాంధీ  ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ శాఖ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
 ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు చెందిన నేలటూరి ఏసురత్నం తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్సిపి నాయకులు తనకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు మార్పు చేయడంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . ఈ ఫిర్యాదుని బిజెపికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది.
 
సదరు ఈ విషయంపై ఆర్ ఓ ఆర్ యాక్ట్ ప్రకారము జనతా వారధి టీం ద్వారా ఆర్డిఓ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది.
 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ మాజీ పట్టణ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.



 
*విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు*

 *ప్రజల పక్షాన బీజేపీ - "జనతా వారధి" విజయపథం*
  
​ *విజయవాడలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, గౌరవనీయులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు అధ్యక్షతన నిర్వహించిన "జనతా వారధి" రివ్యూ సమావేశానికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు హాజరుకావడం జరిగింది*

 *సమీక్షా సమావేశంలో పలనాడు జిల్లాలో ఇప్పటివరకు జరిగిన జనతా వారిది కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు రాష్ట్ర జట్టుకు అందించడం జరిగింది . వాటిని పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ను సభాముఖంగా అభినందించడం జరిగింది*

   ​*ఈ సందర్భంగా మాధవ్ గారు "జనతా వారధి" కార్యక్రమ పురోగతిని సమీక్షించి, ప్రజల సమస్యలను మరింత వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించడానికి మాకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎలా పని చేయాలో ఆయన విలువైన మార్గదర్శకాలను అందించారు.
4000+ అర్జీల స్వీకరణ వేలాది మంది ప్రజలు మాపై నమ్మకంతో సమస్యలను విన్నవించారు*

​70% పరిష్కార దిశగా అందిన అర్జీలలో అత్యధిక శాతాన్ని సానుకూల పరిష్కారానికి తీసుకెళ్లగలిగాం.
​ప్రతి శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రజల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
​ప్రజల కన్నీళ్లు తుడిచే వరకు, వారి గొంతుకగా నిలిచే వరకు భారతీయ జనతా పార్టీ  కృషి చేస్తుంది. మీ సమస్యే మా బాధ్యత!

 
 
*పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా జనతా వారధి టీం*

 *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ గారి అనుమతితో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పలనాడు జిల్లా జనతా భారతి మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది*

 *ఈ విషయంపై స్పందించిన డిఆర్ఓ గారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సుభాని గారికి ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది*


*విషయం*
*రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులకు జారీ చేస్తున్న AP Labour Card / BOCW Card నమోదు, రెన్యువల్, క్లెయిమ్, అవగాహన, శాఖల సమన్వయం వంటి అంశాలను సరళీకృతం చేసి నిజమైన లబ్ధి అందించాలనే వినతి*

రాష్ట్ర అభివృద్ధికి పునాది వేసే నిర్మాణ కార్మికులు తమ చెమటతో రోడ్లు, ఇళ్లు, కార్యాలయాలు, భారీ భవనాలు నిర్మిస్తున్నారు. అయితే అదే కార్మికుడు తన హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరం. 

ఆంధ్రప్రదేశ్‌ లో ఆదర్శమైన అభివృద్ధి సంక్షేమం లక్ష్యసాధనతో సమిష్టిగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరాలి. పారదర్శకమైన పాలన అందాలి. అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గ్రామాలు, నగరాలను సందర్శిస్తూ ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తోంది. ప్రతి శుక్రవారం BJP కార్యాలయాల్లో ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రతి సోమవారం ఆయా అధికారుల ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి సూచనలు, సలహాలు అందిస్తోంది. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది.

ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికులు, పేద కూలీల నుంచి అనేక వినతిపత్రాలు అందాయి.

వారి సమస్యలను పరిశీలించినప్పుడు....,
గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేసింది. కార్మికుల కోట్ల రూపాయలు దారి మల్లించింది అని బాధపడుతున్నారు. 

లేబర్ కార్డు ప్రయోజనాలపై అవగాహన లేకపోవడం, అర్హులైన వారు కూడా లబ్ధి పొందకపోవడం, తమకు ఉన్న హక్కులపై స్పష్టత లేకపోవడం, మధ్యవర్తుల చేతుల్లో BOCW Card నలిగిపోవడం, పేదవాడి హక్కు చిరునామా లేకుండా తిరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఇది అత్యంత బాధాకరం.

ప్రభుత్వం 18 లక్షల మంది కార్మికులు BOCW Card / labour Card కోసం నమోదు అయ్యారు అని చెబుతోంది. అయితే, ఎంతమందికి కార్డు జారీ చేశారు? ఎంతమందికి నిజంగా లబ్ధి అందింది? ఏ పథకం ద్వారా ఎంతమందికి సహాయం అందింది? ఇందులో నిర్మాణ రంగంలో ఉన్న నిజమైన కార్మికులు ఎంతమంది? అనే విషయాల్లో స్పష్టత లేదు.

AP Labour Card / BOCW Card అంటే  Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board ద్వారా నిర్మాణ కార్మికులకు జారీ చేసే సంక్షేమ గుర్తింపు కార్డు. ఈ కార్డు ద్వారా కార్మికుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హత పొందుతాడు. 

వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. గత 12 నెలల్లో కనీసం 90 రోజులు నిర్మాణ పనిలో పనిచేసి ఉండాలి అనేది అర్హత. 

ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్, పని ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తదితర డాక్యుమెంట్స్ ఉండాలి. గ్రామ / వార్డు సచివాలయం, MeeSeva కేంద్రాలు, Labour Office, అధికారిక పోర్టల్ లలో నమోదు చేసుకోవాలి.

ప్రమాద మరణం / శాశ్వత వికలాంగత్వం జరిగితే ₹5,00,000 వరకు, సహజ మరణం కు ₹60,000 వరకు, అంత్యక్రియల సాయం గా ₹20,000 వరకు, ప్రసూతి సహకారం కోసం ₹20,000 వరకు, వివాహ సాయం  ₹40,000 వరకు, పిల్లల విద్యా సాయం / స్కాలర్‌షిప్, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ప్రయోజనాలు కార్డు ద్వారా పొందుతారు.

ప్రమాదం అయితే FIR / ఆసుపత్రి రికార్డు, మరణం అయితే Death సర్టిఫికెట్, ప్రసూతి కి ఆసుపత్రి ధృవీకరణ, వివాహం కోసం వివాహ ధృవీకరణ, విద్యా సాయం కోసం Bonafide / మార్కుల మెమో అవసరం అవుతాయి.

ఈ విధివిధానాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమమైన లేబర్ సంక్షేమ పథకాన్ని రూపొందించింది. పథకం గొప్పది కానీ ప్రచారం అమలు బలహీనంగా ఉంది. 

ఈ లేబర్ కార్డు హక్కులు సమర్థంగా అమలు కావాలంటే Labour Department , APBOCW Welfare Board, గ్రామ / వార్డు సచివాలయ శాఖ, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ / ఆసుపత్రులు, Revenue శాఖ, MeeSeva / IT శాఖ, విద్యాశాఖ లు సమన్వయం తో పని చేయాలి. కానీ వాస్తవంగా ఈ శాఖల మధ్య సమన్వయం కనిపించడం లేదు. నిర్లక్ష్యం మరియు నిర్లిప్తత కనిపిస్తోంది. 

రిజిస్ట్రేషన్ ఉంది. కానీ లబ్ధి తక్కువ, అవగాహన లేదు, సంఘాల పేరుతో మధ్యవర్తులు పెరిగారు, కార్మికుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు, Renewal విధానంలో లోపాలు వున్నాయి. ప్రతి సంవత్సరం 90 రోజుల పని ధృవీకరణ, పత్రాల సమర్పణ వల్ల కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు. చాలా చోట్ల యాజమాన్యం పని ధృవీకరణ ఇవ్వడం లేదు.

కేంద్ర ప్రభుత్వం Pradhan Mantri Suraksha Bima Yojana, Pradhan Mantri Shram Yogi Maandhan, Ayushman Bharath లాంటి సంక్షేమ పధకాలు ఇస్తుంది.

కేంద్ర ప్రభుత్వం నేరుగా చట్టం, డేటాబేస్, బీమా, నిధుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. e-Shram Portal ద్వారా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ఇస్తుంది. Building and Other Construction Workers Act, 1996, Building and Other Construction Workers Welfare Cess Act, 1996 ఈ చట్టాల ద్వారా రాష్ట్రాలు Welfare Board ఏర్పాటు చేయాలి. Welfare Board లకు Grants , loans ఇస్తున్నది. Chief Labour Commissioner పర్యవేక్షించాలి. మోడీ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ ఖర్చుపై 1% నుంచి 2% వరకు cess వసూలు పై కేంద్ర చట్టం చేసి ఆ నిధులు రాష్ట్రానికే అవకాశం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో 1% బిల్డింగ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఒక భవనం నిర్మాణ ఖర్చు ₹50 లక్షలు అయితే
సుమారు ₹50,000 Labour Cess ను Builders, కాంట్రాక్టర్స్, Apartment / Commercial నిర్మాణ యజమానులు కొన్ని సందర్భాల్లో ఇల్లు కట్టుకునే వ్యక్తులు కూడా చెల్లిస్తున్నారు.

ఈ డబ్బు నేరుగా కేంద్రానికి కాకుండా 
State Welfare Board Fund లోకి వెళ్లే ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేసింది. అందుకే ఈ నిధులన్నీ Andhra Pradesh Building and Other Construction Workers Welfare Board దగ్గరికి వెళ్తున్నాయి.

ఈ నిధుల నుంచి మరణ సాయం, ప్రమాద సాయం, ప్రసూతి విద్యా సాయం, స్కాలర్‌షిప్, నైపుణ్య శిక్షణ అందించాలి. 

“రాష్ట్రంలో కోట్ల రూపాయల Building Cess వసూలు అవుతోంది. ఆ మొత్తంలో ఎంత కార్మికుడికి చేరింది?”

అధికారుల్లో “Cess వసూలు చేయడంలో ఉన్న వేగం Claim సెటిల్ చేయడంలో ఎందుకు లేదు??

ఎంత cess వసూలు చేస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు ? ఎంత బ్యాలెన్స్ ఉంది? అనే విషయాల్లోకి వెళ్తే వేల కోట్ల బిల్డింగ్ సెస్ వాడకుండా పడిఉండటం లేదా ఇతర విషయాలకు వినియోగించడం జరిరుగుతుంది. గత ప్రభుత్వం ఈ నిధులు మల్లించి భవనకార్మికులకు తీరని అన్యాయం చేసింది. 

Aadhaar, e-Shram, PF/ESI, Secretariat Data ద్వారా Auto Renewal చేయాలి. Single Window Claim System అమలు చేయాలి. ఒక ప్రమాదం జరిగితే ఆసుపత్రి, పోలీస్, Labour Board, Secretariat , Approval  DBT ఈ మొత్తం ప్రక్రియ ఒకే సిస్టమ్‌లో జరగాలి అని మేము స్పష్టం చేస్తున్నాం.

ఈ క్రింది అంశాలు విన్నవిస్తున్నాము.
 
• Registration సరళీకృతం చేయాలి
• Auto Renewal అమలు చేయాలి
• Single Window Claim System తీసుకురావాలి
• శాఖల డేటా ఇంటిగ్రేషన్ చేయాలి
• గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి
• లబ్ధిదారుల డేటా పబ్లిక్ చేయాలి
• Doorstep సేవలు ఇవ్వాలి
• WhatsApp / App / Toll Free Claim సౌకర్యం కల్పించాలి
• మధ్యవర్తులను అరికట్టాలి
• నిర్మాణ రంగం మరియు ఇతర రంగాల యాజమాన్యాలు అసంఘటిత కార్మికుల వివరాలు సక్రమంగా ఇవ్వాలి
• ప్రతి నెల ప్రగతి నివేదిక విడుదల చేయాలి

కార్మికుని కష్టానికి విలువ ఉండాలి.
ఒక కూలీ తన హక్కు కోసం తిరగకూడదు.
ప్రభుత్వమే కార్మికుని దగ్గరకు వెళ్లాలి.

రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్డు ద్వారా ఇస్తున్న పథకాల ఉన్నత లక్ష్యాన్ని మేము అభినందిస్తున్నాము.
అయితే వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం విడిచి పనిచేయాలి అని భారతీయ జనతా పార్టీ విన్నావుస్తుంది.

జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు


 
 
శ్యావలాపురం మండలం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు,  శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శావల్యాపురం మండలంలోని చినకంచెర్ల గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో పిచికలపాలెం మీదుగా వినుకొండ వెళ్ళు రహదారి మంజూరయ్యి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించలేదని, త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని, అలాగే గ్రామం నుండి ఏనుగుపాలెం వెళ్ళు పొలం రహదారి అధ్వానంగా ఉన్నందున, గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టాలని ,అలాగే మరికొందరు కిసాన్ సమ్మన్ నిధి కి సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దావులూరి చిన్న పేరయ్య గారు, బిజెపి నేతలు దావులూరి వినోద్ కుమార్, కటారి శాంతిబాబు, పాల్గొన్నారు.

 
 
 
*పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

  *ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం కూడా జరిగింది. తదుపరి సంబంధిత ప్రభుత్వ అధికారులకు వాటిపై వివరణ అడిగి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి తెలియజేయడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో బిజెపి పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు*



*పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు  పల్నాడు జిల్లా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  ధార గుప్తా గారు పల్నాడు జిల్లా జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

 మహారాజశ్రీ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అధికారి గారి దివ్యసముఖమునకు వ్రాసుకున్న అర్జీ


విషయం: నైపుణ్యం పెంచండి… నిరుద్యోగం తగ్గించండి 

రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, స్థానిక ఉద్యోగాలు, చేతివృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయవలెనని వినతి

“మీ సమస్య… మా బాధ్యత” అనే భరోసా తో భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయాల్లో ప్రజల సమస్యలను స్వీకరిస్తూ, గ్రామాలు–నగరాల్లో పర్యటిస్తూ ప్రజల ఆకాంక్షలను తెలుసుకుంటున్నాము. ఇటీవల భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా యువతను కలసి వారి సమస్యలు, ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుంది. ఈ కార్యక్రమాల్లో SC, ST, OBC, మహిళలు, చేతివృత్తిదారులు, నైపుణ్య శిక్షణలో ఉన్నవారు, నిరుద్యోగులు, చిన్న చదువులతో సరైన జీవన మార్గం తెలియని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు “జిల్లాకో నైపుణ్య కేంద్రం” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఈ ప్రణాళికలు కేవలం సమావేశాలు, నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించేలా అమలు కావాల్సిన అవసరం ఉందని అధికారులు ఆ దిశగా ఆలోచించాలి అని మనవి చేస్తున్నాము. రాష్ట్రంలో యువత నుంచి వస్తున్న వినతుల్లో గణనీయమైన వాటా ఉద్యోగాల కోసమే ఉండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది; ఇది తక్షణ చర్యలు అవసరమని సూచిస్తోంది 

కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చి, Skill India Mission, PMKVY 4.0, PM-NAPS, Jan Shikshan Sansthan, PM Vishwakarma, Digital India, Startup India, Mudra, Stand Up India, PM-SETU వంటి అనేక పథకాల ద్వారా యువతకు, చేతివృత్తిదారులకు, స్వయం ఉపాధి ఆశావహులకు శిక్షణ, మద్దతు, రుణాలు, టూల్‌కిట్లు, పరిశ్రమల అనుసంధానం వంటి అవకాశాలు కల్పిస్తోంది. ఈ అవకాశాలు రాష్ట్రంలో సమర్థవంతంగా వినియోగించబడితే లక్షలాది కుటుంబాలకు ఉపయుక్తం అవుతాయి 

అయితే, యువత నుంచి మాకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం, పథకాలు ఉన్నప్పటికీ పరిశ్రమలకు సరిపోయే నైపుణ్యం కొరతగా ఉంది; శిక్షణ ఒకటి, పరిశ్రమల అవసరం మరోటి అన్న పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్ ఉన్నా ప్రాక్టికల్ స్కిల్ లేకపోవడం, ప్లేస్‌మెంట్‌పై తక్కువ దృష్టి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం పేరుతో ఉన్న నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, స్కూల్ స్థాయి నుంచే vocational education బలహీనంగా ఉండటం, తక్కువ జీతాలు, నైపుణ్యం ఉన్నవారి వలసలు, చేతివృత్తుల పట్ల నిర్లక్ష్యం, డేటా ట్రాకింగ్ లోపం వంటి సమస్యలు తీవ్రమైనవిగా గుర్తించాము. రాష్ట్రంలో ఇటీవల జిల్లాకో నైపుణ్య ప్రణాళిక, పరిశ్రమలకు అనుగుణ శిక్షణ, టెన్త్ విద్యార్థుల ట్రాకింగ్ వంటి అంశాలపై చర్యలు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చినప్పటికీ, అవి వేగంగా మరియు సమగ్రంగా అమలు కావాల్సిన అవసరం ఉంది 

కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కింది అంశాలను అత్యంత ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని మనవి చేస్తున్నాము

ప్రతి జిల్లాలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా Skill Map తయారు చేయాలి. పోర్టు, ఐటీ, షిప్పింగ్, ఆటోమొబైల్, సోలార్, మైనింగ్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఆయిల్ & గ్యాస్, అక్వా, ఫిషరీస్, పేపర్, అగ్రో రంగాలకు సరిపడే శిక్షణ మాడ్యూల్స్ రూపొందించాలి. మండల స్థాయిలో Skill Centers ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు సులభంగా చేరువ చేయాలి. SC, ST, BC, మహిళలు, డ్రాప్‌అవుట్స్, చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక స్కిల్ ప్యాకేజీలు అమలు చేయాలి. శిక్షణతో పాటు placement or loan అనే మోడల్‌ను పటిష్టంగా అమలు చేయాలి. ప్రతి MoUలో ఉద్యోగాల సంఖ్య, శిక్షణ లబ్ధిదారుల సంఖ్య, నియామకాల లక్ష్యాలు స్పష్టంగా ప్రకటించాలి. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగ, శిక్షణ సమాచారం నిరంతరం ప్రచారం చేయాలి. vocational education ను స్కూల్ స్థాయి నుంచే బలోపేతం చేయాలి. తక్కువ చదువు ఉన్న యువత, డ్రాప్‌అవుట్స్, సంప్రదాయ చేతివృత్తిదారుల కోసం ప్రత్యేక మార్గాలు  రూపొందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా డేటా ట్రాకింగ్, ఫలితాల మానిటరింగ్, ప్లేస్‌మెంట్ సమీక్ష వ్యవస్థను బలపరచాలి. చేతివృత్తులు కేవలం జీవనోపాధి కాదు; అవి సంస్కృతి, కుటుంబ గౌరవం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. అందువల్ల వాటికి ఆధునిక నైపుణ్య శిక్షణ, పరికరాలు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణం గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే స్థానికులకు ఉద్యోగాలు లభిస్తే వలసలు తగ్గి, కుటుంబాల ఆర్థిక భరోసా పెరుగుతుంది. 

యువతకు ఉద్యోగం కల్పించడం అంటే ఒక్క వ్యక్తికి ఉపాధి కల్పించడం కాదు అది ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం. నైపుణ్యాభివృద్ధి అంటే కేవలం శిక్షణ కాదు; అది రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే సమగ్ర అభివృద్ధి ఉద్యమం.
అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకొని, నిధులు, పథకాలు, సాంకేతిక సహాయం, పరిశ్రమల సమన్వయం, నియామక హామీలు కలిపి సమగ్ర కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనవి చేస్తున్నాము.

జనతా వారధి పల్నాడు జిల్లా జట్టు