June 2026



* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డిఆర్ఓ గారికి  డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై  జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు  పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు కలెక్టర్ కార్యాలయం లో  ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత మరియు Serp, Mepma ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టవలెనని వినతిపత్రం  సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇంచార్జ్ మరియు జనతా వారిది రాష్ట్ర టీమ్ నెంబర్ కేతనబోయన హనుమంతరావు  గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు   పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు   బీజేపీ నాయకులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*




జిల్లా కలెక్టర్ గారికి,
పల్నాడు జిల్లా.


విషయం : ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత మరియు Serp, Mepma ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టవలెనని వినతిపత్రం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ఏర్పాటైన DWCRA / Self Help Group వ్యవస్థ లక్షలాది మహిళలను సంఘటితం చేసి ఆర్థిక చైతన్యం కల్పించిన విషయం అందరికి తెలిసిందే,  గ్రామీణ ప్రాంతాల్లో  (SERP), పట్టణ ప్రాంతాల్లో  (MEPMA) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ కొనసాగుతోంది.

అయితే క్రింది స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా మహిళలను, డ్వాక్రా సంఘాలను కలుస్తున్నపుడు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. డ్వాక్రా సంఘాల అసలు బలం అయిన పొదుపు క్రమంగా తగ్గిపోతూ, రుణాల పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయి. స్వయం ఉపాధి, ఆదాయ సృష్టి కోసం ఇవ్వాల్సిన రుణాలు చాలావరకు వైద్య ఖర్చులు విద్య ఖర్చులు పెళ్లిళ్లు పాత అప్పుల చెల్లింపులు వంటి వ్యక్తిగత అవసరాలకు వినియోగించబడుతున్నాయి, ఈ మూలంగా బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ అప్పులు కలిసి మహిళలను అప్పుల చక్రంలోకి నెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రుణ మంజూరులో ఆలస్యం, అనవసర పత్రాలు, బలవంతపు భీమాలు, అదనపు డిపాజిట్లపై ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పొదుపులు, వడ్డీలు, అంతర్గత రుణాల లెక్కలపై సభ్యులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అవకతవకలు జరుగుచున్నాయి. Resource Persons పై అధిక workload ఉండటం వల్ల పర్యవేక్షణ బలహీనమవుతోంది. చిన్న వ్యాపారాలు, వస్తు తయారీ యూనిట్లు ప్రారంభమైనప్పటికీ మార్కెట్, బ్రాండింగ్, మార్కెటింగ్ లోపంతో అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. మహిళలకు బ్యాంకింగ్ యాక్సెస్ పెరిగినా, స్వతంత్ర నిర్ణయాధికారం మరియు స్థిర ఆదాయం ఇంకా పరిమితంగానే ఉంది.

కావున, రాష్ట్రవ్యాప్తంగా DWCRA సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించాలి. ప్రతి సంఘానికి డిజిటల్ అకౌంటింగ్ & పారదర్శక డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలి. Loan sanction సమయంలో అన్ని deductions, insurance, charges లిఖితపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి చేయాలి. బలవంతపు భీమాలు, అనధికార కమిషన్లు, శాతం వసూళ్లపై విచారణ జరపాలి. Savings ఆధారిత వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాలి. SHGలను welfare dependency నుంచి enterprise ecosystem వైపు మార్చాలి. ఉత్పత్తులకు market linkage, branding, e-commerce support కల్పించాలి. మహిళలకు entrepreneurship, digital literacy, financial literacy పై ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలి. రుణాలు మంజూరు సమయంలో ఆర్పీల ద్వారా పర్సంటేజ్ లు వసూళ్లు నిరోధించాలి.

అందువల్ల, కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ద్యేయంతో మహిళా సాధకారత స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున తక్కువ వడ్డీకే రుణలిస్తున్నది. కానీ డ్వాక్రా వ్యవస్థను కేవలం రుణాల పంపిణీ వ్యవస్థగా మర్చివేస్తున్నారు. 

సెర్ప్, మెప్మా లు సరైన పర్యవేక్షణ ఆడిట్ మరియు నిజమైన మహిళా సాధికారత వైపు పని చేయాలి అని వినతిస్తూ భారతీయ జనతా పార్టీ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వ లక్ష్యాలపై అవగాహనా కార్యక్రమాలు చేస్తూ మహిళా సాధాకరత సాధనకు పని చేస్తుందని తెలియచేస్తున్నాము


*ది.26-06-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో  ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది*

 *ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గుడిపల్లి కృష్ణమోహన్ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది*

*వచ్చిన పిర్యాదులు*

 *చిలకలూరిపేట మండలం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఫిర్యాదులు రావడం జరిగింది*

*పాల్గొన్న నాయకులు:*

 *ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శిగుడిపల్లి కృష్ణమోహన్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ గారు   పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

*ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, 'జనతా వారధి' ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గుడపల్లి కృష్ణమోహన్ గారు   తెలిపారు*


* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డిఆర్ఓ గారికి  ఫుడ్ సేఫ్టీ విషయం పై చర్యలు తీసుకోవాలని జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు  పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్లో ఆహార భద్రత వ్యవస్థ బలోపేతం కల్తీ ఆహార నియంత్రణ మాంసం వికారాల పర్యవేక్షణ ఫుడ్ టెస్టింగ్ మౌలిక వసతుల విస్తరణ పై తగు చర్యల కోసం ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు   పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు   నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులుమరియు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*




జిల్లా కలెక్టర్ గారికి,
పల్నాడు జిల్లా.

విషయం: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార భద్రత (Food Safety) వ్యవస్థ బలోపేతం, కల్తీ ఆహార నియంత్రణ, మాంసం దుకాణాల పర్యవేక్షణ, ఫుడ్ టెస్టింగ్ మౌలిక వసతుల విస్తరణపై తక్షణ చర్యలు తీసుకోవలెనని వినతి.

మహోదయులకు,

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదుల్లో అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటి — కల్తీ ఆహారం మరియు ఆహార భద్రత సంక్షోభం.

ప్రజలు తీసుకునే ఆహారం సురక్షితం కాకపోతే అది కేవలం ఆరోగ్యానికే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వైద్య ఖర్చులు పెరిగి సాధారణ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ పాలు, నకిలీ మసాలాలు, నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్, అపరిశుభ్ర మాంసం విక్రయాలు, నాణ్యతలేని ప్యాకేజ్డ్ వాటర్ వంటి సమస్యలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారాయి.

ఆహార భద్రత అమలులో సిబ్బంది కొరత కూడా తీవ్రమైన సమస్యగా ఉంది. రాష్ట్రంలో అవసరమైన Food Safety Officers సంఖ్యతో పోలిస్తే పెద్దఎత్తున ఖాళీలు ఉండటం వల్ల సమర్థవంతమైన పర్యవేక్షణ జరగడం లేదు. పరీక్షించిన ఆహార నమూనాల్లో కల్తీ కేసులు గుర్తించబడుతున్న పరిస్థితి ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన పలు ఆహార భద్రత సంబంధిత ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి. కలుషిత పాలు, తాగునీటి కాలుష్యం, ఆహార విషబాధలు, నాణ్యత లేని మాంసం విక్రయాలు వంటి అంశాలు తక్షణ చర్యలను అవసరం చేస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా గుర్తిస్తున్న ప్రధాన సమస్యలు:
• పాలలో కల్తీ పదార్థాల వినియోగం
• ప్యాకేజ్డ్ వాటర్‌లో నాణ్యత లోపాలు
• గడువు ముగిసిన ఆహార పదార్థాల మళ్లీ లేబులింగ్
• Cold Storage లేకుండా మాంసం విక్రయం
• స్వీట్లు, Street Food‌లో నాసిరకం రంగుల వినియోగం
• వాడిన నూనెను పదేపదే వినియోగించడం
• అపరిశుభ్ర వంటశాలలు, పారిశుధ్య లోపాలు
• లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాల నిర్వహణ

అందువల్ల మా వినతులు క్రింది విధంగా ఉన్నాయి:

1. రాష్ట్రంలోని అన్ని Food Safety Officer ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి.
2. ప్రతి జిల్లాలో కనీసం ఒక Mini Food Testing Laboratory ఏర్పాటు చేయాలి.
3. అన్ని ఆహార వ్యాపార సంస్థల్లో QR ఆధారిత Food License Display తప్పనిసరి చేయాలి.
4. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో క్రమానుగత పరిశుభ్రత తనిఖీలు నిర్వహించాలి.
5. అక్రమ slaughter points గుర్తించి వెంటనే మూసివేయాలి.
6. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలలో ప్రత్యేక ఆహార తనిఖీలు చేపట్టాలి.
7. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
8. ప్రజల ఫిర్యాదుల కోసం 24×7 Food Safety Helpline ఏర్పాటు చేయాలి.
9. రాష్ట్రవ్యాప్తంగా శుభ్రమైన మరియు నాణ్యమైన ఆహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ప్రజల ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. కాబట్టి ఈ అత్యంత కీలక అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నాము.



శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం విజయవంతం

కేంద్ర, రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, శావల్యాపురం మండల అధ్యక్షులు శ్రీ గట్టుపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వారపు జనతా వారధి కార్యక్రమం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను ఈ విధంగా తెలియజేశారు:

  1. ఎస్టీ, బీసీ కాలనీలలో మురుగు నీరు గన్నేరు వాగులో కలుస్తున్నందున ఉపాధి హామీ పథకం కింద కాలువ నిర్మించాలని కోరారు.

  2. ఆంజనేయస్వామి ఆలయం నుండి శివాలయం వరకు వెళ్లే రహదారిపై నీరు నిల్వ ఉండటం, సైడ్ డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు.

  3. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కోట్లాది రూపాయలతో పనులు పూర్తయినప్పటికీ, సరఫరా అవుతున్న తాగునీరు కలుషితంగా ఉందని, శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని అందించాలని కోరారు.

  4. మార్కుల జాబితా ఆధారంగా ఆధార్ కార్డులో జన్మతేదీ మార్పులు చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

  5. ప్రభుత్వం అందించబోయే అన్ని రకాల పెన్షన్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలని కోరారు.

  6. మరుగుదొడ్డి నిర్మించకపోయినా నిర్మించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిధులు మంజూరైనట్లు చూపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  7. ఒక మహిళ మరణించి ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ చంద్రన్న బీమా ఇప్పటివరకు మంజూరు కాలేదని, వెంటనే మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు.

ఈ సందర్భంగా వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ తమ వంతు కృషి చేస్తుందని నాయకులు దరఖాస్తుదారులకు హామీ ఇచ్చారు.

ప్రజలకు – ప్రభుత్వానికి వారధిగా
జనతా వారధి

భారతీయ జనతా పార్టీ – పల్నాడు జిల్లా




*ది.12-06-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో  ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది*

 *ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్   గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది*

*వచ్చిన పిర్యాదులు*

 *అచంపేట్ మండలం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఫిర్యాదులు రావడం జరిగింది*

*పాల్గొన్న నాయకులు:*

 *ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్  గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి కో కన్వీనర్ గంజార్ల ఆదిలక్ష్మి గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ గారు  ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు పల్నాడు జిల్లా కార్యదర్శి జెవిశెట్టి బ్రహ్మయ్య గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

*ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, 'జనతా వారధి' ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు   తెలిపారు*






* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డిఆర్ఓ గారికి  గీత కులాల గౌరవం పర్యావరణ పరిరక్షణ స్వాలంబన కోసం  జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గీత గీత కులాలు గౌరవం పర్యావరణ పరిరక్షణ స్వాలంబన కోసం ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ గారు పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు   నరసరావుపేట టూ టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పవరపు సంపత్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

 * *ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు లో బిజెపి నాయకులు బందెల శ్రీనివాసరావు గారు తాను నివసిస్తున్న హరిజనవాడకు కరెంటు కోసం ఫిర్యాదు తీసుకురాగా  పల్నాడు జిల్లా కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది . తదుపరి వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను  సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది*

*జనతా వారధి*
ది. 08.06.2026 సోమవారం


విషయం : గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం వినతి

తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తూ, తాటి చెట్టును ఆధారంగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత తదితర గీత కులాల ఆకాంక్షలను మీ ముందుకు వినమ్రంగా తీసుకువస్తున్నాము.

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గీత కులాల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. అలాగే గీత కులాల సంఘాలు, సొసైటీలు, పెద్దలు, మేధావులు మరియు వృత్తిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షల ఆధారంగా ఈ వినతిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నాము.

భారతదేశ సనాతన జీవన విధానంలో తాటి చెట్టు ఒక సాధారణ వృక్షం కాదు. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, పర్యావరణ పరిరక్షణకు సహజ రక్షకుడు, వేలాది కుటుంబాల జీవనాధారం. తాటి చెట్టు మన సంస్కృతికి, మన గ్రామీణ జీవన విధానానికి ప్రతీక.

అయితే నేడు గీత వృత్తి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తన ఉనికిని కాపాడుకునే పరిస్థితికి చేరుకుంది. తాటి చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం, వృత్తికి తగిన ప్రోత్సాహం లేకపోవడం, యువత ఈ వృత్తికి దూరమవడం, ఎక్సైజ్ చట్టాల కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులు, గీత వృత్తిదారుల పట్ల సమాజంలో ఉన్న అపోహలు వారి కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
ముఖ్యంగా మద్యం దుకాణాల రిజర్వేషన్ విధానంలో అసలు లబ్ధిదారులకు ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందకపోవడం, రాజకీయంగా బలమైన వర్గాలు అవకాశాలను వినియోగించుకోవడం వల్ల గీత వృత్తిదారులు నష్టపోతున్నారు. గీత వర్గాల పేరుతో కల్పించిన అవకాశాలు కూడా చాలాసార్లు వారికి అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గీత కులాల సంఘాలు, సొసైటీలు, పెద్దలు, మేధావులు సమాజంపై బాధ్యతతో అనేక విలువైన సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని క్రింది అంశాలపై తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము.

మా ప్రధాన విజ్ఞప్తులు
• తాడి చెట్లకు సంబంధించిన ఎక్సైజ్ చట్టాలను పునఃసమీక్షించి, తాటి చెట్టు సంరక్షణ మరియు గీత వృత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంస్కరణలు చేపట్టాలి.

• గీత వృత్తిని గౌరవప్రదమైన సంప్రదాయ వృత్తిగా గుర్తించి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి.

• నీరా పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, నీరా ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్, బ్రాండింగ్ మరియు ప్రోత్సాహం కల్పించాలి.

• రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో తాటి మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టాలి.

• ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతాలలో "పామ్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్" అమలు చేసి పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సముద్రతీర ప్రాంత పరిశ్రమలు, కర్మాగారాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి.

• తాటి ఆధారిత బయోడీజిల్, హార్టికల్చర్, ఆయుష్, ఫుడ్ ప్రాసెసింగ్, హస్తకళలు మరియు ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులపై పరిశోధన, పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి.

• నీరా కాంపౌండ్లు, సంప్రదాయ కల్లు విక్రయ కేంద్రాలను ఆధునికీకరించి పరిశుభ్రమైన, గౌరవప్రదమైన మరియు వృత్తిపరమైన నిర్వహణకు అవకాశాలు కల్పించాలి.

• గీత వృత్తిదారుల పిల్లలకు విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి.

• గీత వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు; అది మన సంస్కృతి, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వమనే విషయాన్ని సమాజానికి తెలియజేసే కార్యక్రమాలు చేపట్టాలి.

• గీత కులాల ఆదిపురుషుడిగా భావించే కౌండిన్య మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించి రాష్ట్రస్థాయి గుర్తింపు ఇవ్వాలి.

తాటి చెట్టును కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం. గీత కులాలను ఆదుకోవడం అంటే గ్రామీణ భారత ఆత్మను బలోపేతం చేయడం. తాటి చెట్టు నీడలో పెరిగిన తరాలు, భవిష్యత్ తరాలకు కూడా అదే గౌరవం, అదే జీవనాధారం అందాలని మేము కోరుకుంటున్నాము.

ఈ సంకల్పంతోనే భారతీయ జనతా పార్టీ "సంకల్పం" పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తక్కువ సమయంలో పెరిగే తాటి మరియు పామ్ జాతి మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీనికి అధికారులు సహకరించాలి. 

ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి  గారు గీత వృత్తిదారుల కుటుంబాలను సందర్శించి వారి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గీత కులాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశాభావం సమాజంలో ఉంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని వినమ్రంగా కోరుతున్నాము.

గీత కులాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ స్వావలంబన మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్




శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశానిర్దేశం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు,ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూరు పంచాయతీ పరిధిలోని వెలమ వారి పాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత వంగ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈనాం భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని గ్రామంలోని సైడ్ డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని నిర్మించిన సైడ్ డ్రైనేజీల్లో పూడికతీత తీయాలని,రెండు సంవత్సరాల క్రితం పూర్తిచేసిన గ్రామీణ రక్షిత మంచినీటి పథకం  నిరుపయోగంగా పడఉందని  కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ యొక్క పథకం ట్రయల్ట్రయల్ రన్ తరువాత  ఇంతవరకు త్రాగునీటి సరఫరా చేయలేదని త్రాగునీటి సరఫరా చేయాలని,వేల్పూరునుండి వెలమవారిపాలెం  వెళ్లేటువంటి రహదారి మంజూరుచేసి నెలలు గడుస్తున్న ప్రారంభించలేదని త్వరగా ప్రారంభించాలని, అలాగే వివిధ రకాల పెన్షన్ల కొరకు దరఖాస్తులు వచ్చాయి వీటి పరిష్కారానికి బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేశాం .



*ది.05-06-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో  ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది*

 *ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ  గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది*

*వచ్చిన పిర్యాదులు*

 *నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం నుంచి చాట్టు ఏడుకొండలు అనే రైతు తనకు సంబంధించిన 50 సెంట్లు భూమిని ప్రభుత్వ అధికారులు తన 10-1 అడంగల్ నుంచి తొలగించడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది*

*పాల్గొన్న నాయకులు:*

 *ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు నరసరావుపేట పార్లమెంటు సంయోజిక్ శ్రీ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

 *కార్యక్రమనికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ  గారి చేతుల మీదుగా జనతా వారధికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, 'జనతా వారధి' ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్లమెంటు సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ గారు  తెలిపారు*





* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి ఎల్నినో పరిస్థితులు ప్రభావం  పై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు  పల్నాడు జిల్లా కార్యదర్శి బట్టరుశెట్టి సులోచన పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు చిలకలూరిపేట మాజీ మండల అధ్యక్షులు దడబడ పుల్లయ్య నరసరావుపేట బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

 *వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది*

*జనతా వారధి*
ది. 01.02.2026 సోమవారం 

విషయం : ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ – నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

రాష్ట్రంలో 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వాతావరణ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భారీ వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు కోసం చర్యలు చేపడుతోంది.

ఈ రెండు అంశాలు రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్న చర్యలే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు స్పష్టమైన అవగాహన లేకపోతే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు భాగస్వామ్యంతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయవలసిన అవసరం ఉంది.

భారతీయ జనతా పార్టీ *జనతా వారధి* కార్యక్రమం ద్వారా రైతులను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటుంది. వారి నుంచి వచ్చిన సందేశాలు దృష్ట్యా మరియు నిపుణులతో మేము చర్చించిన దృష్ట్యా ఎల్నినో పరిస్థితుల్లో వర్షాభావం లేదా భారీ వర్షాలు రెండూ సంభవించే అవకాశం ఉన్నందున, "పంట ప్రణాళికలో జాగ్రత్త – నీటి నిర్వహణలో ముందుచూపు" అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగాలి. స్పష్టమైన లక్ష్యం, సమన్వయంతో కూడిన కార్యాచరణ, క్షేత్రస్థాయి అవగాహన ద్వారా మాత్రమే రైతులను నష్టాల నుండి కాపాడగలం.

అందువల్ల ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము.

మా వినతులు:
• రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎల్నినో ప్రభావంపై ఏకీకృత మార్గదర్శకాలను విడుదల చేయాలి.
• జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
• రైతులకు పంటల ఎంపిక, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలి.
• జిల్లాకు ప్రత్యేక వాతావరణ-వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
• చెరువులు, కాలువలు, వాగులు, నీటి వనరుల పునరుద్ధరణను వేగవంతం చేసి వర్షపు నీటి నిల్వకు సిద్ధం చేయాలి.
• వ్యవసాయ, జలవనరుల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
• రైతులకు వారానికొకసారి వాతావరణ సూచనలు, పంటల సలహాలు అందించే ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
• గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
• ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి "రైతు రక్షణ – నీటి భద్రత కార్యాచరణ ప్రణాళిక" ప్రకటించాలి.

"ఎల్నినో సవాళ్లను అవకాశాలుగా మార్చుకుందాం – రైతు రక్షణ, నీటి భద్రతకు సమగ్ర కార్యాచరణ అవసరం" 
అని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా పిలుపునిస్తున్నది.

 పల్నాడు జిల్లా జనతా వారధి టీం