February 2026



జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన

మాచర్లలో దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం

మాచర్ల పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తక్షణమే స్పందించి దోమల నివారణ చర్యలను ప్రారంభించారు.
ప్రతి గురువారం బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణ రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య పట్టణంలో దోమల తీవ్రత పెరిగిందని, ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా అందజేశారు. వెంటనే స్పందించిన కమిషనర్ శనివారం స్వయంగా పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బందితో ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రోజుకు కొన్ని వార్డుల చొప్పున మొత్తం మాచర్ల పట్టణం అంతటా ఫాగింగ్ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన కమిషనర్ వేణుబాబుకు బీజేపీ నాయకులు మరియు శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.



మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


మాచర్ల పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నాయని వాటి నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని కోరుతూ ఒక ఫిర్యాదు అందింది. గురువారం మాచర్ల బిజెపి పట్టణ ఆఫీస్ లో నిర్వహించిన జనతా వారధి ప్రోగ్రాం లో రెండో వార్డుకు చెందిన శేషగిరి పానయ్య ఈ ఫిర్యాదు ఇచ్చారు. పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ అధ్యక్షతన జనతా వారధి కో కన్వీనర్లు ఏచూరి సురేష్, శివ కోటయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. వచ్చిన ఫిర్యాదును మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య వివరిస్తామని ఫిర్యాదు దారుడికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎస్సీ మోర్చా ఇంచార్జ్ సజ్జన్ పాల్గొన్నారు.



శ్యావల్యాపురం  మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

,కేంద్ర రాష్ట్ర బిజెపి దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు pvn మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ,ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని మండలంలోని ఇర్లపాడు గ్రామంలో స్థానిక బిజెపి నేత వెనిగండ్ల ఆంజనేయులు గారి నిర్వహణలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు ఆరు అర్జీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ రక్షిత మంచినీటి గత 15 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని దీనికి జల్ జీవన్ మిషన్ (jjm)పథకం మంజూరు చేయాలని, అలాగే గ్రామంలో పూర్తిస్థాయిలో  సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని, అలాగే పాత కరెంటు స్తంభాల వల్ల ప్రమాదం పొంచి ఉందని వాటి స్థానంలో కొత్త కరెంటు స్తంభాలు నిర్మించాలని, శుభ కార్యాలు వివిధ రకాల ఫంక్షన్లో నిర్వహించినందుకు ఏ విధమైన మండపాలు లేనందున  కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, అలాగే nregs కింద పొలాలకు వెళ్లి రహదారులు నిర్మించాలని, ఈర్ల రాజా అనే వ్యక్తి నాకు కనీసం నివసించడానికి అడుగు జాగా కూడా లేదని నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని నివసించేందుకు గ్రామంలో ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని దరఖాస్తు ద్వారా ప్రభుత్వాన్ని కోరారు, కార్యక్రమంలో టిడిపి నాయకులు కంచేటి రామయ్య గారు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.


దాచేపల్లి మండలం లో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

  దాచేపల్లి మండలంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో పలువురికి సమస్యల్ని దాచేపల్లి మునిసిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు దాచేపల్లి మండల ఎమ్మార్వో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.


పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారధి ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్నం కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశానుసారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది
 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ఇద్దరు దగ్గర అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీ వివరాలు ఒకటి ఇంటి నివేశ స్థలం కొరకు రెండవది రేషన్ కార్డు కొరకు అర్జీలు సేకరించి పిడుగురాళ్ల పట్టణ ఎమ్మార్వో గారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.



పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి తరపున పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించడం జరిగింది


గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఫిర్యాదు 


హిందు సంస్కృతి మూలాలు ధ్వంసం చేయడమే జగన్ లక్ష్యం, హిందు సమాజాన్ని అవమానిస్తూ ఆనందం పొందుతున్నారు

జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ సమాజం పై దాడి జరిగింది. తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేయకుండా దర్శనానికి వెళ్లి హిందు విశ్వాశాలపై నమ్మకం లేదని తెలిపాడు. ఈ చర్య ద్వారా హిందూ దేవతలు ఆరాధనలపై విశ్వాసం లేదని అర్ధం అయ్యింది. కెమికల్ నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసి తీవ్ర  అపచారం చేయడమే కాకుండా శాసనమండలి సాక్షిగా చెప్పులు ధరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వాము చిత్ర పఠంతో నినాదాలు చేసి తధనంతరం ఆ ఫోటోలను అక్కడే విసిరేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన చాలా బాధాకరం.

వైఎస్సార్సీపి ప్రభుత్వంలో హిందూ సంస్కృతి మూలాల్లో కొట్టాలనే కుట్ర జరిగింది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందూ ఆలయాల ధ్వంసం హిందూ దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం ఆలయ రథాల దగ్ధం మరియు ధ్వంసం జరిగినది

ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో  హిందూ సంస్కృతి మూలాలను నాశనం చేయాలనే ప్రయత్నంలో జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేయాలి అని ప్రజలు కోరుచున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు YSRCP ప్రభుత్వ కాలంలో హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథాలపై జరిగిన అనేక దాడులు ధ్వంసాలు గమనార్హం. ఈ ఘటనల్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య చర్యలు సమాజంలో భయాన్ని పెంచాయి. అంతే కాకుండా ఫిర్యాదు చేసినవారిపైనే తిరిగి కేసులు పెట్టి అమాయక హిందువులను వేధించారు. ఒక మత ఛాందశవాది ఇతర మత విశ్వాసాలపై గౌరవం లేనివాడు ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో ప్రజలకి అర్ధం అయ్యింది. 

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న "జనతా వారధి" కార్యక్రమంలో భాగంగా మేము ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారి నుంచి వస్తున్న విన్నపం "మా హిందూ ఆలయాల ధ్వంసం విగ్రహాల ధ్వంసం దగ్ధం పై చర్యలు తీసుకోవాలని ఇది కచ్చితంగా కుట్రపూరితంగా అప్పటి పాలకుల ప్రోత్సాహంతో చేశారని వారందరిపై చర్యలు తీసుకొని నేరస్తులు ఎవరో తెలియచేసి ప్రజాస్వామ్యానికి నమ్మకం కలిగించాలి" అని కోరుచున్నారు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కుట్రలు దాడులు జరిగాయి. 2020 నెల్లూరులో కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి రధం ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. 2024 సెప్టెంబర్ లో అనంతపురం రామాలయం రధాన్ని దగ్ధం చేశారు. 2019 మార్చిలో కాకినాడ రూరల్ లో ఒక చర్చి పాస్టర్ రెండు హిందూ ఆలయాలు ధ్వంసం చేసి అందులో విగ్రహాలను తీసుకువెళ్లిపోయారు. 2020 జనవరిలో పిఠాపురం లో పేరుగాంచిన ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. 2020 సెప్టెంబర్ లో చిత్తూరులో నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2021 లో రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చేతులు నరికారు. 2021 లో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థం పుణ్యక్షేత్రం శ్రీరాముని విగ్రహ శిరస్సు ధ్వంసం చేశారు ఇంకా ఎన్నో దారుణాలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు హిందూ మూలాలను నాశనం చేసే రచన జరిగింది. ఇప్పటికి కూడా అదే ఆలోచనలతో వున్నారు అని అర్ధం అవుతుంది. ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగింది. ఇది భరించలేని జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గపు అనుచరులతో కలసి సమాజన్ని కించపరుస్తున్నారు.

క్షమించరాని తప్పులు చేసి కూడా భగవంతుణ్ణి అవమానపరుస్తూ శాసనమండలిలో నిరసన పేరుతో ప్రవర్తించిన తీరుని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2019 నుంచి 2024 వరకు హిందూ ఆలయాల ధ్వంసం, దేవత మూర్తుల విగ్రహాలు ధ్వంసం, రధాలు దగ్ధం రధాలు ధ్వంసం అన్ని సంఘటనలపై నిజమైన నేరస్తులను ప్రజల ముందు ఉంచి, లడ్డు ప్రసాదంలో కెమికల్ నెయ్యి నిందుతులు సహకరించిన  వ్యక్తులను శిక్షించాలి. శాసనమండలిలో కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానించిన సభ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.
ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



విజయవాడ జోన్ కి సంబంధించి జనతా వారది శుక్రవారం విజయవాడ బిజెపి కార్యాలయంలో  జరిగింది

*ప్రజల నుండి జనతా వారధి కార్యక్రమం పట్ల స్పందన రావడం బావుంది. ప్రతి శుక్రవారం విజయవాడ జోన్ లొ ఇస్తున్న  ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయిఅని ఇంచార్జ్ జనతా వారధి కిలారు దిలీప్ అన్నారు*

 *పల్నాడు జిల్లా నుంచి హాజరైన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు కో కన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొని పల్నాడు జిల్లా మరియు ఐదు రాష్ట్రాల్లో జరిగిన 15 వేల కోట్ల రూపాయల అవినీతిని పై ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి గారికి బాధితులతో కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారు వెంటనే పల్నాడు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది ఈ విషయంపై రాష్ట్ర హోం మినిస్టర్ అనిత గారితో కూడా మాట్లాడతానని బాధితుల కు హామీ ఇవ్వడం జరిగింది*

*చాలామంది వచ్చి తమ సమస్యలు పరిష్కారం అయినందుకు బిజెపి పార్టీకి కృతజ్ఞతలు చెప్పడం బాగుంది. అధికారులకు కూడా చలనం వచ్చింది. బిజెపి నుంచి ఏ సమస్య చెప్పిన తక్షణమే స్పందిస్తున్నారు.  బిజెపి నాయకత్వం దృష్టికి వెళ్లే సమస్యలు పట్ల అధికారులు  ఆలోచన చేస్తున్నారు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధి లాగా జనతా వారధి కార్యక్రమం జరుగుతుందని అని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి గారు అన్నారు*

 *శుక్రవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లో  జోనల్ ఇన్చార్జి మరియు మీడియా రాష్ట్ర ఇంచార్జి కిలారు దిలీప్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కోకన్వీనర్ గంజర్ల ఆదిలక్ష్మి గుంటూరు జిల్లా జనతా వారిది కన్వీనర్ బాపట్ల జిల్లా జనతా వారి కన్వీనర్ ఒంగోలు జనతా వారిది కన్వీనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*


అమరావతి మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 యండ్రాయి  గ్రామం అమరావతి మండలం బూత్ నెంబర్ 250 మరియు 251 లో బూత్ అధ్యక్షుడు వాసిరాజు సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వెంకటరమణ హాజరైనారు మరియు బెజ్జంకి భూలక్ష్మి గారు పాల్గొన్నారు  జనతా వారధి కార్యక్రమంలో స్థలం ఉండి పీఎం ఆవాస్ యోజన పథకంలో ఇల్లు మంజూరు చేయించవలసినదిగా ఒకరు అప్లికేషన్ ఇచ్చినారు


మాచర్ల పట్టణంలో జనతా వాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 మాచర్ల పట్టణంలోని పట్టణ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం పట్టణ అధ్యక్షులు ఓర్సు క్రాంతికుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణంలో ఇచ్చినటువంటి టీడ్ కొ ఇళ్లఅవకతవకల గురించి అర్జీలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వారిది కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కోకన్వీనర్ అమర్ సురేష్ బాబు గారు సీనియర్ నాయకులుపోకూరి కాశీపతి గారు జిల్లా నాయకులు ఆలేటి సజ్జనీలు గారు పాల్గొన్నారు


నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని భావంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రవేశపెట్టిన జనతా వారిది కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆదేశానుసారం    నకిరేకల్లు మండలంలో గొల్లపల్లి గ్రామంలో జరిగిన జనతా వారిది కార్యక్రమంలో పాల్గొని చికిలి నాగుల మీరా గారు కులం సర్టిఫికెట్ తప్పుగా నమోదయిందని మా వద్దకు రావటం జరిగింది. దీని యొక్క సర్టిఫికెట్ ని తీసుకొని పి జి ఆర్ ఎస్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ ఇన్చార్జిగా నేను (జవిశెట్టి బ్రహ్మయ్య), నకరికల్లు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు  మున్వర్ బాజీ  గారు, సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

దాచేపల్లి పట్టణంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
 
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి నగర పంచాయతీలోని సచివాలయం -1 పరిధిలో వృద్ధాప్య పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి శ్రీమతి గుండా హనీఫా గారి సమస్యను పరిష్కారం కోసం దాచేపల్లి నగర పంచాయతీ సచివాలయం -1 కి వెళ్లి సచివాలయ సిబ్బందితో సమస్య గురించి వివరించి చెప్పడం జరిగింది.
 ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కారం చేస్తామని జనతా వారిది టీం కి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.


గురజాల పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు  జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనతో గురజాల అసెంబ్లీ గురజాల మండలం నందు జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షురాలు నాగమణి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ఇన్చార్జి నాసరయ్య జి ముఖ్యఅతిథిగా పాల్గొనరు. ప్రతి గురువారం పార్టీ సూచనలతో నిర్వహించే జలతావారధి కార్యక్రమం నేడు పాతపాటేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించగా ఐదు రకాల సమస్యలు కమిటీ దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది వాటిలో రెండు సమస్యలను నిమిషాల వ్యవధిలో సదరు కార్యాలయాలతో పార్టీ నాయకులు మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది మిగిలిన సమస్యలు ఒకటి ఆర్డీవో కార్యాలయానికి రెండు కలెక్టర్ వారి కార్యాలయానికి పంపిన నిర్ణయం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జనతా వారధి కోకన్వీనర్ పిండి రామాంజనేయులు అమృత లింగేశ్వరరావు, రమేష్,కాశీ అమరయ్య  తదితరులు పాల్గొన్నారు


శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గంటావారిపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత విడుదల శ్రీదేవి గారి నిర్వహణలో కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలను మండల అధ్యక్షుడు దృష్టికి తేవడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా గంటవారిపాలెం నుండి వేల్పూర్ వెళ్లే రహదారి అధ్వానంగా ఉన్నందున మంజూరైన రోడ్డు వేయించాలని ఉజ్వల యోజన పథకం మంజూరు చేయించాలని పెన్షన్లు కొరకు పిఎం కిసాన్ నిధులు జమ కొరకు గోకులం షెడ్డు మంజూరు కొరకు మొత్తం 11 దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని తెలిపాము కార్యక్రమంలో స్థానిక బిజెపి నేత విడుదల శ్రీదేవి కార్యకర్తలు పాల్గొన్నారు


పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి నేతృత్వంలో 17-02-2026 వ తేది మంగళవారం రోజున నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం లొ dpro గారికి పల్నాడు జిల్లా లొ గత వైఎస్ఆర్సిపి  ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై నివేదికను ప్రభుత్వం వారికి మరియు ముఖ్య మంత్రినారా చంద్రబాబు నాయుడు గారికి సమస్యపై నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  జనతా వారధి   జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు  మరియు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

*పల్నాడు జనతా వారధి టీమ్*
సత్తెనపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి పట్టణ బీజేపీ కార్యాలయం నందు అర్జీల స్వీకరణ జరిగింది 
ఈ కార్యక్రమంలో వై అనిల్ కుమార్, శ్రీనివాసరావు గార్లు వారి సమస్యలపై అర్జీలు ఇచ్చారు 
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకర రావు, సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కట్టా శంకరరావు మరియు ఓరుగంటి హరిబాబు రచ్చ సాంబశివరావు గారు పాల్గొన్నారు

శావల్యాపురం  మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండలం సీనియర్ నాయకులు  అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండలం పరిధిలోని కారుమంచి గ్రామంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యల్ని మా దృష్టికి తేవడం జరిగింది ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకానికి ఫిల్టర్ బెడ్లు పాడైపోయినందున త్రాగునీరు ఒక కలుషితమైందని  ఫిల్టర్ బెడ్స్ మంజూరు చేయాలని అలాగే గ్రామంలోని సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున మురుగునీరు నిల్వ ఉంటుందని సైడ్ డ్రైనేజీ వ్యవస్థని సరి చేయాలని అలాగే అన్ని వర్గాల స్మశాన వాటిక దగ్గర నీటి సౌకర్యం లేనందున నీటి బోర్లు వేయించాలని అలాగే కొంతమంది పెన్షన్ల కోసం అలాగే పిఎం కిసాన్ కోసం వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు రావడం జరిగింది. కార్యక్రమ కన్వీనర్ అయినటువంటి మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకి తెలియడం తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు నాదెళ్ల నరసింహారావు నార్ల సాంబశివరావు గారు పాల్గొన్నారు ధన్యవాదాలు

సత్తెనపల్లి రూరల్ లో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 


సత్తనపల్లి మండలం బట్లూరు రెవిన్యూ గ్రామంలో రైతులు నెల్లూరు వీరయ్య చౌదరి మరియు మేకల హనుమంతు  పీఎం కిసాన్ అమౌంట్  గతంలో వచ్చాయి ఇప్పుడు రావడం లేదని అర్జీనీ కన్వీనర్ సురేష్ కో కన్వీనర్ జవాజి రమణ గారు  వారి వద్ద నుండి  సేకరించడం జరిగింది అలాగే స్థానిక సిఎస్సి సెంటర్లో దేనివల్ల వీరికి ఈ కేవైసీ వలన ఆగిపోయినా ఈ అని వివరించి వారికి ఈ కేవైసీ కూడా దగ్గరుండి చేయించడం జరిగింది అర్జీని సేకరించటమే కాకుండా వారికి పరిష్కారం కూడా చూపించడం జరిగింది ఈ కార్యక్రమం వారు మనకి మన పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే జిల్లా అధ్యక్షులు శశి కుమార్ ఆదేశాలు ప్రకారం జనతా వారిది కార్యక్రమం బట్లూరు గ్రామంలో నిర్వహించినాము, పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము




క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు,  క్రోసూరు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద జనతా వారధి కార్యక్రమం చేయటం జరిగినది, క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన కోటారు శ్రీనివాసమూర్తి ,గోపాలరావు రామాంజనేయులు, అనే రైతులు వారికి పొలానికి సంబంధించిన ఆన్లైన్ సమస్య ఉన్నదని ఆన్లైన్లో 1.04 సెంట్లు నమోదయి ఉన్నదని కానీ భూమి మీద మాత్రం 0.94 సెంట్లు మాత్రమే ఉన్నదని పలుమార్లు ఎమ్మార్వో గారికి అర్జీ పెట్టినా గాని ఏమాత్రం స్పందించడం లేదని అర్జీదారులు చెప్పియున్నారు, ఈ యొక్క అర్జీని వచ్చే సోమవారం క్రోసూరు మండల తహసిల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండల అధ్యక్షులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధూ కామేశ్వర చారి ,జనతా వారది కన్వీనర్ తుమ్మపూడి వెంకటేశ్వర రెడ్డి, కోకన్వీనర్ రావెళ్ల సౌజన్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కంటూ సాయిరాం, సీనియర్ నాయకులు రౌతు వేణుబాబు జపాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


దాచేపల్లి పట్టణం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


 12/02/2026 తేదిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర్లు గారికి అర్జీ ఇవ్వడం  జరిగింది.

 ఈ కార్యక్రమంలో భారతి జనతా పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు గారు స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు యువమోర్చా నాయకులు కొఠారి సురేష్ గారు, నారాయణ రెడ్డి గారు మరియు పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది.



పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  గురువారంజరిగిన జనతా వారధి కార్యక్రమ సందర్బంగా దూర్గి మండలం పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 12-02-2026 వ తేది గురువారం రోజున దుర్గి మండలం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించి ప్రజల వద్ద నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి త్వరతాగతిన పరిష్కారం చేయాలని బీజేపీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ జనతా వారధి కో కన్వినర్ మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు గంజార్ల ఆదిలక్ష్మి మరియు బీజేపీ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు*

ప్రజల వద్ద నుంచి అక్రమంగా నగదు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
మల్లెల శివ నాగేశ్వరరావు, బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కన్వీనర్ జనతా వారిది పల్నాడు జిల్లా 
చప్పిడి బాలస్వామి.
చిలకలూరిపేట/ ఫిబ్రవరి 10.
మండలంలోని గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగాండ్ల వెంకటరావు, నాగండ్ల వంశీ రాకెట్ ల్యాబ్  అనే ప్రాజెక్టు పేరు తో ప్రజల్ని తప్పుదారి పట్టించి కోకోనట్ అనే పేరుతో కార్యాలయాన్ని పెట్టి కేరళలో వంద ఎకరాలు తోట ఉందని,అక్కడి నుంచి లోడ్ తెచ్చి టాన్స్పోర్ట్ చేస్తున్నామని, ఒక డూప్లికేట్ లైసెన్స్ తయారుచేసి నందిపాడు రోడ్డులో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ఎదురు ఉన్న కార్యాలయంలో  కొబ్బరిబొండాల అమ్ముతున్నట్టు బిల్లులు తయారుచేసి ప్రజల దగ్గర సంతకాలు తీసుకున్నారు. వెంకటరావు అతని పిఏ నిరజా వీళ్ళు కొబ్బరి బోండాల షాపులు పెట్టి క్రయ విక్రయాలు జరుపుతున్నారని, డూప్లికేట్ లైసెన్స్ తయారు చేయించి ప్రజల వద్ద నుంచి విస్తృతంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఈ విషయమై సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీకి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, చప్పిడి బాలస్వామి తో పాటు పలువురు బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన వాటిపై సమగ్రమైన దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ గ్రామీణ సి.ఐకు బాధితుల ఫిర్యాదును పంపించి న్యాయం చేయాలని ఆదేశించారు.


 
పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలిస్ అధికారులకు భాదితులతో కలిసి sp గారికి పిర్యాదు ఇచ్చిన మల్లెల శివ నాగేశ్వరావు

*జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోలీస్  జిల్లా కార్యాలయం వద్ద  నాగండ్ల వెంకట్రావు భాదితులు నుండి అర్జీలు స్వీకరించడం అలాగే వారి సమస్య ను పోలీస్ వారికీ పిర్యాదు ఇవ్వడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు నాగెండ్ల వెంకటరావు బాధితులు తలపల ప్రసాద్ చప్పిడి బాలస్వామి పఠాన్ రజాక్ తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*

పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 06-02-2026 వ తేది శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం లొ ఏంటో చరిత్ర కలిగిన కొండవీటి కోట పై శ్రీకృష్ణ దేవరాయులు కాంశ్య విగ్రహం ఏర్పాటు గురించి అలాగే చిలకలూరిపేట నియోజకవర్గం లొ ఏంటో కాలంగా పెండింగ్ లొ ఉన్న ఫార్మ్ 22-a లొ ఉన్న స్థలాలు రెగ్యులర్ అయ్యేలాగా ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని జనతా వారధి రాష్ట్ర టీమ్ లీడర్ కిలారు దిలీప్  బీజేపీ రాష్ట్ర లీడర్ ఎమ్మెల్సీ పోతుల సునీత గారి ద్వారా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రెండు సమస్యలు పై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశం లొ ప్రయత్నం చేస్తావని హామీ ఇవ్వడం జరిగింది   ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు నల్లూరి రాంబాబు మైనారిటీ మోర్చా చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*




పల్నాడు జిల్లా నరసరావుపేట కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా కార్యాలయం వద్ద అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది.
కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లేపు కృపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య, నరసరావుపేట రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్, నరసరావుపేట రూరల్ మండలం అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు, నరసరావుపేట రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి ముప్పవరపు సంపత్, కిసాన్ మోర్చా నాయకులు మైలవరపు సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు అదృఫ్, తెడ్డు వెంకటేశ్వర్లు, B వెంకటేశ్వర్లు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.



మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పలు సిసి రోడ్ల గురించి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్ రావు గారు కో కన్వీనర్ సురేష్ బాబు శివ కోటయ్య నాయక్ బిజెపి సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి పట్టణ ఉపాధ్యక్షుడు మారం వంశీకృష్ణ బిజెపి నాయకులు మొగిలి అద్దయ్య పాల్గొన్నారు







నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 


భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారధి కార్యక్రమంలో నకరికల్ మండల ఇన్చార్జిగా పాల్గొని మండల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది.

              ఈ కార్యక్రమంలో నకిరకల్లు బీజేపీ మండల 
అధ్యక్షులు మున్వర్ బాజీ గారు,మండల సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు,మండల ప్రధాన కార్యదర్శి మోహన కృష్ణ గారు,కోటపాటి వీరాంజనేయులు గారు, ఎర్ల నాగరాజు గారు తదితర నాయకులు,అభిమానులు పాల్గొన్నారు


శ్యావల్యాపురం  మండలం వేల్పూరు గ్రామంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం  మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వేల్పూరు గ్రామంలో ఇంటర్ ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ టు ని రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు లెక్చరర్స్ ని  లేడీస్ హాస్టల్ మంజూరు చేయలేదని వచ్చే విద్యా సంవత్సరానికైనా లెక్చరర్స్ ని లేడీస్ హాస్టల్ మంజూరు చేయాలని హెడ్మాస్టర్ సుభాని గారు విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే కార్యక్రమంలో భాగంగా భాగంగా ఎస్సీ కాలనీ మాదికి పల్లెవాసులు ఆ యొక్క కాలనీలో రక్షిత మంచినీటి సరఫరా అసలుకు రావటం లేదని రెండు మూడు బిందెలు మాత్రమే వస్తున్నాయని కొన్ని కలెక్షన్లకు అసలు నీరు  రావడంలేదని వచ్చేటువంటి నీరు కలుషితంగా ఉందని త్రాగటానికి పనికిరాదని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మాదిగ పల్లెలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ కి ప్రహరీ గోడ నిర్మాణం కోసం అలాగే వంటగది కోసం అలాగే నీటికి మోటార్ కోసం ప్రభుత్వం వారు మంజూరు చేయాలని అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మాదిగ పల్లె వాసులు రెండు ప్రక్కల సైడ్ డ్రైనేజీ నీరు నిలువ ఉండటం వల్ల అంటువ్యాధులు వచ్చేటువంటి ఇబ్బందుందని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కాకుమను నాగేశ్వరరావు గారు మైనారిటీ నాయకుడు మక్తుమ్ సాహెబ్ కాలనీవాసులు పాల్గొనడం జరిగింది




జనతా వారిది కార్యక్రమంలో భాగంగా  కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం  కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది


జనతా వారిది కార్యక్రమంలో భాగంగా  కట్టమూరు గ్రామంలో రైతు కల్లూరి నరసింహారావు తన సమస్యను సత్తెనపల్లి మండలం  కో కన్వీనర్ జవాజి రమణకు అర్జీ ఇవ్వడం జరిగింది తక్షణమే మేము తాసిల్దారు గారికి సమస్యలను వారి వద్దకు తీసుకెళ్లగా  కల్లూరు నరసింహారావు భూమిని ఆన్లైన్ అడంగల్ వెబ్ నందు తప్పు సర్వే నెంబర్ నమోదు అవ్వటం వల్ల మిగిలిన రైతులు కూడా ఇబ్బంది పడటం జరిగింది. దానిని ఎమ్మార్వో గారి  దృష్టికి కన్వీనర్ సురేష్ గారు కోకన్వీనర్ జవాజీ రమణ మరియు బిజెపి కార్యకర్తలు  తోటపాలెం ఏలియా, నెల్లూరి నరేంద్రబాబు, ప్రసాదు గ్రామతీసుకెళ్లి పక్కన రైతులు సమస్యను వివరంగా చెప్పడం జరిగింది తక్షణమే తాసిల్దారు గారు సర్వేయర్ మరియు విఆర్ఓ రోవర్ తో కొలతలు తీసి కల్లూరు నరసింహారావు యొక్క భూమిని కొలిపించడం జరిగింది సదరు రైతు సంతోషం వ్యక్తం చేయటమే గాక పార్టీ యొక్క కార్యక్రమాన్ని మెచ్చుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమము మా ద్వారా చేపించిన జిల్లా అధ్యక్షులు శశి కుమార్ గారికి మరియు కట్టా శంకర్రావు గారికి మరియు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము


పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  గురువారం గురజాల లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 05-02-2026 వ తేది గురువారం గరజాల పాత పాట అమ్మవారు గుడి సెంటర్ లో జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించరు. ఈ కార్యక్రమం లొ గురజాల మండల బిజెపి జనతా వారిది కన్వీనర్ పిండి రామాంజనేయులు మండల అధ్యక్షురాలు నాగమణి సీనియర్ నాయకులు కో కన్వీనర్ తవిటి రమేష్ కంచుకోటయ్య గారు ఇమిటి శెట్టి శ్రీనివాసరావు గారు .ఫిర్యాదులు. పాగళ్ళు క్రాంతి పసుపులేటి వేణుగోపాల్ ఫిర్యాదులు ఇచ్చారు  సదరు ఈ విషయం పై ప్రభుత్వ అధికారులు తో మాట్లాడడం జరిగింది వారు త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గురజాల మండల కమిటీ మరియు గురజాల జనతా వారధి టీమ్ ప్రజల కు ప్రతి గురువారం జరిగే జనతా వారధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు*


పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  ప్రధానమైనటువంటి సమస్య  "దివ్యాంగుల సర్టిఫికెట్లు" విషయం పై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో  ఈ సోమవారం జనత వారధి లో దివ్యాంగుల సర్టిఫికెట్లు సమస్యల పైన వినతి పత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఇవ్వటం జరిగింది*

 *తదుపరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రేషన్ డీలర్ షిప్ సమస్యలు రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులకు జనత భారతి టీం కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే వాటి సమస్యను త్వరితగారి దిన పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయటం సదరు విషయాలపై ప్రభుత్వ అధికారులు త్వరితగతిన మీరు ఫిర్యాదు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని పల్నాడు జిల్లా జనతా వారిది టీం కి చెప్పడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా భారతి కన్వీనర్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు మైలవరపు సుబ్బారావు యూవ మౌర్చ మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడిశెట్టి అమరేంద్ర నరసరావుపేట 2 టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పావరపు సంపత్ కుమార్ శావల్యాపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్ఛార్జ్ కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*