శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండలం పరిధిలోని కారుమంచి గ్రామంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యల్ని మా దృష్టికి తేవడం జరిగింది ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకానికి ఫిల్టర్ బెడ్లు పాడైపోయినందున త్రాగునీరు ఒక కలుషితమైందని ఫిల్టర్ బెడ్స్ మంజూరు చేయాలని అలాగే గ్రామంలోని సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున మురుగునీరు నిల్వ ఉంటుందని సైడ్ డ్రైనేజీ వ్యవస్థని సరి చేయాలని అలాగే అన్ని వర్గాల స్మశాన వాటిక దగ్గర నీటి సౌకర్యం లేనందున నీటి బోర్లు వేయించాలని అలాగే కొంతమంది పెన్షన్ల కోసం అలాగే పిఎం కిసాన్ కోసం వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు రావడం జరిగింది. కార్యక్రమ కన్వీనర్ అయినటువంటి మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకి తెలియడం తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు నాదెళ్ల నరసింహారావు నార్ల సాంబశివరావు గారు పాల్గొన్నారు ధన్యవాదాలు
Post A Comment:
0 comments: