* *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డిఆర్ఓ గారికి డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు కలెక్టర్ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత మరియు Serp, Mepma ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టవలెనని వినతిపత్రం సమర్పించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇంచార్జ్ మరియు జనతా వారిది రాష్ట్ర టీమ్ నెంబర్ కేతనబోయన హనుమంతరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
జిల్లా కలెక్టర్ గారికి,
పల్నాడు జిల్లా.
విషయం : ఆంధ్రప్రదేశ్‌లో DWCRA / SHG సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత మరియు Serp, Mepma ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టవలెనని వినతిపత్రం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ఏర్పాటైన DWCRA / Self Help Group వ్యవస్థ లక్షలాది మహిళలను సంఘటితం చేసి ఆర్థిక చైతన్యం కల్పించిన విషయం అందరికి తెలిసిందే, గ్రామీణ ప్రాంతాల్లో (SERP), పట్టణ ప్రాంతాల్లో (MEPMA) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ కొనసాగుతోంది.
అయితే క్రింది స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా మహిళలను, డ్వాక్రా సంఘాలను కలుస్తున్నపుడు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. డ్వాక్రా సంఘాల అసలు బలం అయిన పొదుపు క్రమంగా తగ్గిపోతూ, రుణాల పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయి. స్వయం ఉపాధి, ఆదాయ సృష్టి కోసం ఇవ్వాల్సిన రుణాలు చాలావరకు వైద్య ఖర్చులు విద్య ఖర్చులు పెళ్లిళ్లు పాత అప్పుల చెల్లింపులు వంటి వ్యక్తిగత అవసరాలకు వినియోగించబడుతున్నాయి, ఈ మూలంగా బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ అప్పులు కలిసి మహిళలను అప్పుల చక్రంలోకి నెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రుణ మంజూరులో ఆలస్యం, అనవసర పత్రాలు, బలవంతపు భీమాలు, అదనపు డిపాజిట్లపై ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పొదుపులు, వడ్డీలు, అంతర్గత రుణాల లెక్కలపై సభ్యులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అవకతవకలు జరుగుచున్నాయి. Resource Persons పై అధిక workload ఉండటం వల్ల పర్యవేక్షణ బలహీనమవుతోంది. చిన్న వ్యాపారాలు, వస్తు తయారీ యూనిట్లు ప్రారంభమైనప్పటికీ మార్కెట్, బ్రాండింగ్, మార్కెటింగ్ లోపంతో అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు. మహిళలకు బ్యాంకింగ్ యాక్సెస్ పెరిగినా, స్వతంత్ర నిర్ణయాధికారం మరియు స్థిర ఆదాయం ఇంకా పరిమితంగానే ఉంది.
కావున, రాష్ట్రవ్యాప్తంగా DWCRA సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించాలి. ప్రతి సంఘానికి డిజిటల్ అకౌంటింగ్ & పారదర్శక డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలి. Loan sanction సమయంలో అన్ని deductions, insurance, charges లిఖితపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి చేయాలి. బలవంతపు భీమాలు, అనధికార కమిషన్లు, శాతం వసూళ్లపై విచారణ జరపాలి. Savings ఆధారిత వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాలి. SHGలను welfare dependency నుంచి enterprise ecosystem వైపు మార్చాలి. ఉత్పత్తులకు market linkage, branding, e-commerce support కల్పించాలి. మహిళలకు entrepreneurship, digital literacy, financial literacy పై ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలి. రుణాలు మంజూరు సమయంలో ఆర్పీల ద్వారా పర్సంటేజ్ లు వసూళ్లు నిరోధించాలి.
అందువల్ల, కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ద్యేయంతో మహిళా సాధకారత స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున తక్కువ వడ్డీకే రుణలిస్తున్నది. కానీ డ్వాక్రా వ్యవస్థను కేవలం రుణాల పంపిణీ వ్యవస్థగా మర్చివేస్తున్నారు.
సెర్ప్, మెప్మా లు సరైన పర్యవేక్షణ ఆడిట్ మరియు నిజమైన మహిళా సాధికారత వైపు పని చేయాలి అని వినతిస్తూ భారతీయ జనతా పార్టీ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వ లక్ష్యాలపై అవగాహనా కార్యక్రమాలు చేస్తూ మహిళా సాధాకరత సాధనకు పని చేస్తుందని తెలియచేస్తున్నాము
Post A Comment:
0 comments: