January 2026




పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం

 పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబెర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు గారు బిజెపి సీనియర్ నాయకులు మైలవరపు సుబ్బారావు గారు బిజెపి సీనియర్ నాయకులు నాగసరాపు ఆంజనేయులు గారు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చిన ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
 
ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కు చెందిన తవ మల్లికార్జున్ రావు గారు బస్టాండ్ దగ్గరలో ఉన్న బిలాల్ హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయవలసినదిగా ఫిర్యాదు చేయడమైనది సదరు ఫిర్యాదు పరిష్కార నిమిత్తం ట్రాఫిక్కు పోలీస్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించగా త్వరలో సమస్యను పరిష్కారం చేస్తారని తెలియజేశారు.




పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు
 నరసరావుపేట 1వ పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 
ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డులలో సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వడం జరిగింది స్థానిక ప్రకాష్ నగర్ పార్క్ వద్ద ఆకతాయిలతో వచ్చిన ఇబ్బందులపై ఫిర్యాదులు రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వై సీతారాం జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు పల్నాడు బిజెపి సీనియర్ నాయకులు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 
 
 
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు
 సత్తెనపల్లి పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 
ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డులలో సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వడం జరిగింది 
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకరరావు,
 జనతా వారధి కార్యక్రమ పట్టణ కన్వీనర్ మరియు కో కన్వీనర్ లు  మాడ రమేష్ ,ఓరుగంటి హరిబాబు  ఈ కార్యక్రమ మరియొక కన్వీనర్, కో కన్వీనర్ గడ్డం శివశంకర్ రావు గారు సీనియర్ నాయకులు పులిపాటి వెంకటేశ్వర్లు గారు ఓరుగంటి హరిబాబు రచ్చ సాంబశివరావు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు





శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది


రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు  సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు  ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ అసెంబ్లీ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు సావల్యపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శావల్యాపురం మండల ఇన్చార్జి  శ్రీ జన్నాబట్ల ఆదిత్య గారు సీనియర్ నాయకులు శ్రీ పత్తి మణికంఠ నాయుడు గారు నిర్వహణలో జనతా వారధి కార్యక్రమాన్ని మండల కేంద్రం శావల్యపురంలో నిర్వహించడం జరిగింది గ్రామస్తులు తమ యొక్క సమస్యలని చెప్పారు తదుపరి ఆ యొక్క సమస్యని తెలియజేసిన తదుపరి స్వయంగా మేమే దరఖాస్తు రాసి సంబంధిత అధికారులకు ఇవ్వటం జరుగుతుందని మీయొక్క సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ పని చేస్తుంది అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో కళాకారుల పెన్షన్ కొరకు వితంతు పెన్షన్ కొరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు ఇంటి స్థలం కొరకు దరఖాస్తులు రావడం జరిగింది


 
 
క్రోసూరు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  క్రోసూరు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలకు  మేరకు ,జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి సూచనలు మేరకు, ఈరోజు పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పంట కాలువలో వేస్తున్నటువంటి డంపింగ్ ని తక్షణమే తీసివేసి ఆ పంట కాలవ మీద ఆధారపడి ఉన్న సుమారు 500 ఎకరాల సాగుభూమిని మరల సాగులోకి తేవాలని ఆ గ్రామానికి చెందిన రైతు పోసి పోగు చిన్న వెంకయ్య గారు ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో అర్జీ ఇవ్వడమైనది, ఈ  కార్యక్రమంలో మండల అధ్యక్షులు దమ్మాలపాటి  శ్రీనివాసరావు , వి బి జి రామ్ జి పల్నాడు జిల్లా కన్వీనర్ నారు శ్రీనివాసరెడ్డి,జనతా వారది కన్వీనర్ తుమ్మపూడి వెంకటేశ్వర రెడ్డి, కోకన్వీనర్ వెంకయ్య, మరొక కో కన్వీనర్ కంటూ సాయి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వీరంకి వీరబాబు, సీనియర్ నాయకులు , క్రోసూరు వేణుగోపాలరావు, రైతు వేణు డాక్టర్ నరసింహారాజు గారు పాల్గొన్నారు.



 
 
బెల్లంకొండ మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది


బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పల్నాడు జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి మెటల్ సూరత్నకుమార్ యాదవ్ అదేవిధంగా మండల అధ్యక్షులు ఓర్చు రాజుగారు అదే విధంగా సాంబశివరావు గారు బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా బెల్లంకొండ మండలం బిజెపి మండల స్థాయిలో రావాలని అందరికీ తెలపాలని అందరికీ తెలిసేలా చేయాలని తెలియజేయడం జరిగింది భారత్ మాతాకీ జై...




మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ

 మాచర్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించబడింది 

 ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఫిర్యాదులు రావడం జరిగింది. వాటిని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి నివేదించటం వారు త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేయడం  జరిగింది

 ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్  బొగ్గవరపు మస్తాన్ రావు గారు కొకన్వీనర్ శివకోటయ్య నాయక్ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి గారు, మాచర్ల పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ పాల్గొన్నారు.
 దేవల మణికంఠరాజు అనే వ్యక్తి 8వ వార్డు లోని రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం మరొకరు tidco ఇళ్లకు డబ్బు కట్టినారు కానీ వారి పేరు మీద ఆ ఇల్లు చూపించట్లేదు అని ఫిర్యాదుఅర్జీ అందజేశారు వీటిని త్వరలోనే మున్సిపల్ అధికారులు తెలియజేసి  త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.






పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పి వి ఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం,పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు  పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం లో జనతా వారధి ఇంచార్జీ శ్రీమతి గొడవర్తి సుజాత గారి ఆధ్వర్యం లో కార్యక్రమన్నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటి స్థలాలా దరఖాస్తులు, ఉజ్వల పథకం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమనికి పల్నాడు జిల్లా ఎస్టి మోర్చా  అధ్యక్షుడు చలంచర్ల విజయ్ కుమార్ గారు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు,మాజీ పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఆత్మకూరి కాశీవిశ్వనాథం గారు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.



 
 
నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆజ్ఞ అనుసారం మండల అధ్యక్షులు మున్వర్ బాజీ మరియు బీజేపీ నాయకులు అందరూ నకరికల్లు పీహెచ్‌సీని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే బీజేపీ నేతలు నకరికల్లు మండల  పీహెచ్‌సీ లొని ప్రజా సమస్యల పై జనతా వారధి కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలపై సమాచారం తెలుసుకున్నారు. చలి కారణంగా దగ్గు, జలుబు చికిత్సలు, కుక్కకాటు, పాముకాటు వైద్యం, రక్తపరీక్షలు, నెబ్యులైజేషన్ సేవలు ఉన్నాయని డా. హసీనా తెలిపారు. అనంతరం పలు సమస్యలను తెలియపరిచి చర్చించారు. ఈ కార్యక్రమంలో వారధి కమిటీ కన్వీనర్ కోటపాటి వీరాంజనేయులు, కో-కన్వీనర్ ఇర్ల నాగరాజు, మేరాజ్యోత్ అంజి నాయక్, రావుట్ల సాంబాచారి మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమం లో  పాల్గొన్నారు.

 






జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే

 చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం 


 భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ రోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో  పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు జనతా వారధి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి -- బిజెపి జనతా వారధి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది.  సంబందించిన సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం  అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై  మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ తెలపడం జరిగింది త్వరత గతిన  ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, జనతా వారధి కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు,  మీడియో ఇంచార్జ్ రావిక్రింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని, పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర, బిజెపి  నాయకురాలు ఎలిజిబెత్ రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.



 
 
 
 
ఎడ్లపాడు మండలంలో ప్రజలకు సంబంధించిన భూములను వెంటనే ప్రజలకు స్వదినం చేయాలని కోరుతున్న ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ


24.1.2026, నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్, ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ లో భాగంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ గారికి ఎడ్లపాడు మండలంలోని 150 ఎకరాలు అసైన్డ్ భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనతావారధి కార్యక్రమంలో భాగంగా, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ, జనతా భారతి ఎడ్లపాడు మండలం కన్వీనర్ దాట్ల వెంకటేశ్వర రాజు గారి ఆదేశాల మేరకు కోకన్వీనర్ బందెల శ్రీనివాసరావు అర్జీ సమర్పించడం జరిగింది.
 ఎడ్లపాడు మండలంలోని 150 ఎకరాలు 2009వ సంవత్సరంలో ఎస్సీ కమిషన్ సేకరించి తాసిల్దార్ గారి స్వాధీనంలో ఉంచటం జరిగింది. 150 ఎకరాలు భూమిని  పంపిణీ చేయాలని 30-5 - 2010 తాసిల్దారు వారు పత్రిక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా పంపిణీ జరగలేదు. 27 డిసెంబర్ 2025 ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ అర్జీ కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఆర్డీవో నరసరావుపేట వారు, గారు వచ్చి క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించడం జరిగింది, ఇప్పటికి నెల అవుతుంది, ఈరోజు వరకు కూడా మా సమస్య పరిష్కారం కాలేదు అని, 24-1- 2026వ తేదీన జరిగిన ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ లో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ గారితో సవినయంగా మనవి చేయడం జరిగింది.
              ---------------
 బందెల శ్రీనివాసరావు మాదిగ
 (ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు.)
 భారతీయ జనతా పార్టీ, ఎడ్లపాడు మండలం,
 జనతా వారధి, కో కన్వీనర్



 
 
 
 
*కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య  పరిష్కారం నిమిత్తం  స్థలం సందర్శించిన బిజెపి నాయకులు*


 *పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో  జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి పరిష్కార నిమిత్తం కొండవీడు గ్రామానికి విచ్చేసి కట్ట దాసు స్థలం పరిశీలించి న బీజేపీ నాయకులు  సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండలం సర్వేరు సురేంద్ర కి ఫోన్ చేసి మాట్లాడిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్  త్వరత గతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు,పట్టణ జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మీడియా ఇన్చార్జి రావికింధి రామకృష్ణ*




దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమ నిర్వహణ

 *తేది 22/01/2026 న దాచేపల్లి మండలం లో నిర్వహించిన జనతా వారిది కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ మరియు ఏలియం పేట కాలనీలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారం కొరకు AE గారిని పంపి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది*

 *జనతా వారిది కార్యక్రమం ద్వారా మనం చేసిన ఈ ప్రయత్నానికి ఇంత త్వరగా స్పందించి సమస్యలను*
*పరిష్కారం దిశగా నడిపిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.*

 *ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*



 
 
 
 
*దాచేపల్లి బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనతా భారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*

*భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 22/01/2026న దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ కు సంబంధించి నిన్న జరిగిన సందర్శనలో  గుర్తించిన పలు సమస్యల గురించి మరియు నిలియంపేట కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గురించి వివరించి సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వకమైన వినతి పత్రన్నీ దాచేపల్లి నగరపంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి బీజేపీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో బిజెపి దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు గారు, స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు, యువమోర్చా నాయకులు కొటారి సురేష్ గారు, సీనియర్ నాయకులు మల్లెమారపు నాగేశ్వరరావు గారు మిర్యాల పుల్లారావు గారు పాల్గొనడం జరిగింది*



 

 

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోట్లూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్థానిక ఎంపీపీ హెడ్మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి బోరు నీటి బోర్ ద్వారా వస్తున్నటువంటి నీరు అక్కడ ఉన్న విద్యార్థుల త్రాగునీటికి నిత్య అవసరాలకు సరిపోవటం లేదని బోరులోతు పెంచడం లేదా  గ్రామ రక్షిత మంచినీటి పథకం ద్వారా మరొక రెండు కలెక్షన్లు అందజేయాలని కోరడం జరిగింది ఇదే అంశాన్ని మేము సంబంధిత విద్యాశాఖ వారికి అలాగే  జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది




 
 
 
 
జనత వారిది కార్యక్రమంలో అమరావతి మండలం  నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు జిల్లా కలెక్టర్  కు బీజేపీ ఆధ్వర్యంలో  పిర్యాదు ఇవ్వడం జరిగింది

*పల్నాడు జిల్లా అమరావతి మండలం ప్రజలు అమరావతి చుట్టుపక్కల అనధికార లేఔట్ లు వేయటం పై ప్రజలు అభ్యంతరం చేస్తూ  బీజేపీ వారికి పిర్యాదు చేయగా బిజెపి తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో సదరు సమస్య పరిష్కార నిమిత్తం కలెక్టర్ గారు సి ఆర్ డి ఏ వారికి రిఫర్ చేయడం జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు దారులతో కలసి తమ సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*



 
 
 
దాచేపల్లి మండల బిజెపి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ను కలిసిన మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరావు

 *జనతా వారిది కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం లో భాగంగా లబ్ధిదారులకు పథకం ద్వారా వచ్చే లబ్దినిది జమ కాని కారణం చేత సమస్య పరిష్కారం కోసం l దాచేపల్లి మండల రైతులతో కలిసి దాచేపల్లి మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలిసి సమస్యను వివరించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల బిజెపి అధ్యక్షులు  నాగేశ్వరరావు కొప్పుల మరియు బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*




 
 
 
*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హా.*


*ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా నుంచి బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్.*

*ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు సమక్షంలో నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ.*

*45 సంవత్సరాల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయసు వ్యక్తిగా నితిన్ నబీన్ రికార్డ్.*

  *జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన  నితిన్ నాభిన్ గారికి పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్   మల్లెల శివ నాగేశ్వరరావు  శుభాకాంక్షలు తెలియజేశారు*


 
 
 
జనత వారిది కార్యక్రమంలో వెల్దుర్తి మండలం మందడి గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు పోలీస్ ఎస్పీ గారికి  బీజేపీ ఆధ్వర్యంలో  పిర్యాదు ఇవ్వడం జరిగింది*

*పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరాగాంధీ కాలనీ నివాసి వెంకటకోటేశ్వరి వెల్దుర్తి మండలం మందడి గ్రామ నివాసి మొగిలి వెంకటేశ్వర్లు కుమారుడు సిమోను తో వివాహం జరిగింది తదుపరి వివాహ సంబందించిన విషయం గురించి పల్నాడు జిల్లా ఎస్పీ గారికి  కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ గారు  కారంపూడి పోలీసు వారితో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*




 
 
 
*జనత వారిది కార్యక్రమంలో నరసరావుపేట మండలం నరసరావుపేట నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం నరసరావుపేట ఆర్డీవో  కు బీజేపీ ఆధ్వర్యంలో  పిర్యాదు ఇవ్వడం జరిగింది*

*పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట నివాసి గుంటకా నాగేశ్వరమ్మా భర్త రాఘవ రెడ్డి జగనన్న కాలనీ లో తనకు గత 5 సంవత్సరాలనుండి తన అధీనంలో ఉన్న 2సెంట్లు నివాసం భూమి పట్టా ను తనకు తెలియకుండా తన సొంత కొడుకు వేరేవాళ్లు కు అమ్మివేయడం తనకు సంబందించిన బంగారం అమ్మయిడం 80 సంవత్సరాల వయసులో ఉన్న తనను ఇబ్బందులు పెట్టడం పై పల్నాడు జిల్లా డిఆర్ఓ కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన డిఆర్ఓ గారు ఆర్డీవో గారికి కేసు ఇవ్వమని చెప్పగా నరసరావుపేట ఆర్డీవో గారికి ఫిర్యాదు దారునితో కలసి తన సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
 
 



 
జనత వారిది కార్యక్రమంలో దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం సహాయం చేస్తున్నా జనతా వారధి కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు

*పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి గ్రామం లో తనకు గత 20 సంవత్సరాలనుండి మల్లవరపు నాగేశ్వరావు తన అధీనంలో ఉన్న వ్యవసాయ భూమి డీకే పట్టా భూమి ని తన కూతురు పెళ్లి నిమిత్తం అలాగే తన కుటుంబ అవసరం నిమిత్తం అమ్ముకొనుటకు అవకాశం కలిపిస్తూ ఫామ్ 22-a నుండి తొలగించడం అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వవలసినదిగా కోరగా బీజేపీ ఆధ్వర్యంలో గురజాల ఆర్డీవో గారికి ఫిర్యాదు దారునితో కలసి తన సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*




జనత వారిది కార్యక్రమంలో దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం గురజాల ఆర్డీవో  కు బీజేపీ ఆధ్వర్యంలో  పిర్యాదు ఇవ్వడం జరిగింది

*పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి గ్రామం లో మల్లవరపు నాగేశ్వరావు తనకు గత 20 సంవత్సరాలనుండి తన అధీనంలో ఉన్న వ్యవసాయ భూమి డీకే పట్టా భూమి ని తన కూతురు పెళ్లి నిమిత్తం అలాగే తన కుటుంబ అవసరం నిమిత్తం అమ్ముకొనుటకు అవకాశం కలిపిస్తూ ఫామ్ 22-a నుండి తొలగించడం అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వవలసినదిగా కోరగా బీజేపీ ఆధ్వర్యంలో గురజాల ఆర్డీవో గారికి ఫిర్యాదు దారునితో కలసి తన సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
 
 





 
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్  ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది

*ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్  గారి ఆధ్వర్యంలో   "జనతా వారధి" కార్యక్రమం 3 వ సోమవారం ప్రజల నుండి వినతులు స్వీకరించటం తదుపరి సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించడం జరిగింది*

*పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను స్వీకరించిన సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది*

 *అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు రెవెన్యూ సమస్యలపై రీ సర్వే తదితర సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది*

*ఈ కార్యక్రమం లో ముందుగా మీడియాతో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్  గారు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని  తెలిపారు.అలాగే జిల్లా లో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నిటిని బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు అని అన్నారు.గత రెండు వారాలుగా స్వీకరించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు తిరిగి వారి నుండి రిప్లై కూడా వచ్చింది అని అన్నారు. ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం వినతులు స్వీకరిస్తారు అని అన్నారు*

జనతావారధి ప్రారంభించి ఇది 3 వ సోమవారం కూడా వినతులు స్వీకరించాము అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ గారికి సుమారుగా 20 సమస్యలు దరఖాస్తు సమర్పించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్  గారు, జనతావారధి జిల్లా కమిటీ కన్వినర్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు గారు, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గట్ట హేమకుమార్ పల్నాడు జిల్లా ప్రోగ్రాం కో కన్వీనర్ గంజార్ల అది లక్ష్మి గారు జిల్లా ఉపాధ్యక్షుడు  ఇత్తడి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





 
 
 
 
 
జనత వారిది కార్యక్రమంలో అమరావతి మండలం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు జిల్లా కలెక్టర్ కు బీజేపీ నుండి పిర్యాదు ఇవ్వడం జరిగింది

*అమరావతి మండలం ఏండ్రాయి గ్రామం లో పెద్దెఎత్తున‌ మైనింగ్*

*ప్ర‌భుత్వాదాయానికి భారీ గండి*

*కొండ‌ల‌ను పిండి చేస్తున్న వైనం*
 
*గూడ్స్ రైళ్ళ‌ను త‌ల‌పిస్తున్న లారీలు*

*అమ్మో ఆ మైనింగ్ వైపు చూడా ల‌న్నా భ‌య‌మే*
 
*కూట‌మి ఆశ‌యాల‌కు తూట్లు*
 
*అమరావతి మండలం ఏండ్రాయి గ్రామ పరిసరాల సి ఆర్ డి ఏ ల్యాండ్ పుల్లింగ్ లొ ఉన్న భూములు లోయ‌లౌతున్న కొండ‌లు*

*ముడుపుల మ‌త్తులో మైనింగ్.... నిద్రావ‌స్ధ‌లొ రెవిన్యూ శాఖ‌*

*క‌బ్జాకు గుర‌వుతున్న అట‌వీ, అస్సైన్డ్ భూములు.... దొపిడీ అవుతున్న ప్ర‌కృతి సంప‌ద‌*

*ప్ర‌జాప్ర‌తినిధుల అండ‌తో జ‌రుగుతున్న దొపిడీని ఆపేవారెవ‌రు*

అమ‌రావ‌తి నిర్మాణం కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రులు అహ‌ర్నిస‌లు శ్ర‌మిస్తున్నారు. రాష్ట్ర‌నికి నిధులు రాబ‌ట్టి సుంద‌రంగా తీర్చిదిద్ది దేశంలోనే ఆంద్ర‌ప్ర‌దేశ్‌ను అగ్ర‌గామిగా నిల‌పాల్న ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శ్ర‌మిస్తున్నారు. ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ ప్ర‌భుత్వ ఖ‌జానాను నింపాల్సిన ప్ర‌జాప్ర‌తినిధులే అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతూ ప్ర‌భుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. స్వార్ధ రాజ‌కీయాల‌ను ప్ర‌క్క‌న పెట్టి వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌ను చూడ‌కండా వ్య‌వ‌స్ధ కోసం పాటు ప‌డాల‌ని అనేక సంద‌ర్భాల‌లో ముఖ్య‌మంత్రి వ‌ర్యులు చెబుతున్నారు. అయినా కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌ను సైతం పెడ‌చెవిన పెడుతున్నారు.సదరు విషయం పై స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోని వైనం అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలొ ఫిర్యాదు చేసిన బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ. వెంటనే ప్రభుత్వ అధికారులు ఈ సమస్య పరిష్కార నిమిత్తం  వెంటనే మైనింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తున్న పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ.




 
 
 
 
పల్నాడు జిల్లా బిజెపి ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం రేపు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించబడును 

 *తేదీ: జనవరి19,2026 (సోమవారం)*
*సమయం: ఉ 10:00 గం.లకు*

స్థలం:జిల్లా కలెక్టర్ వారి 
కార్యాలయం-నరసరావుపేట

👉*విషయం: గత ప్రభుత్వ హయాంలో అసంబద్ధమైన నిబంధనలు సడలించి రీ సర్వేలో జరిగిన అవకతవకలపై తగు విచారణ చేయాలని  కోరుతూ జిల్లా కలెక్టర్ వారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత*

 *భారతీయ జనతా పార్టీ, ప.గో. జిల్లా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జనతా-వారధి కార్యక్రమంలో భాగంగా సదరు పై సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి*

*అపేక్షితులు: అర్హులైన లబ్ధిదారులను గుర్తించి,పల్నాడు బిజెపి నాయకులు వారిని వెంటపెట్టుకొని రావాలి*

    *పల్నాడు టీమ్ జనతా వారధ*    *పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ*




 
 
 
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్త లో ప్రక్షాళన అవసరం

రెవెన్యూ సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలి: పల్నాడు జిల్లా బిజెపి

*విషయం : భూ రీ–సర్వే, LPM, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ లింక్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి భూ యజమానులకు, రైతులకు న్యాయం చేయవలసిందిగా వినతి*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందుకు మేము స్వాగతిస్తున్నాము. రైతుల భూమి హక్కుల పరిరక్షణకు ఇది కీలకమైన కార్యక్రమం*

అయితే, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో భూ రీ–సర్వే పేరుతో తప్పుడు కొలతలు, సర్వే నంబర్ల మార్పులు, హద్దులు–విస్తీర్ణంలో అవకతవకలు, LPM లో పొరపాట్లు, టైటిల్ డీడ్ మరియు ఆధార్ లింక్ లో తప్పిదాలు జరిగి భూ రికార్డులు తారుమారయ్యాయి.

గత ప్రభుత్వం అవినీతి జరుగుతుందని VRO వ్యవస్థను రద్దు చేసి ప్రవేశపెట్టిన VRA–సచివాలయ వ్యవస్థ కూడా అవినీతి, అధికారుల అలసత్వం కొనసాగడంతో భూ యజమానులు ముఖ్యంగా రైతులు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. 

ప్రస్తుతం కొత్తగా మంజూరు చేస్తున్న పాస్‌బుక్‌లు కూడా గతంలో తారుమారైన రికార్డుల ఆధారంగా ఇవ్వబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ – “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా చేస్తున్న పర్యటనలలో మరియు ప్రజల నుండి ప్రతి శుక్రవారం స్వీకరిస్తున్న ఫిర్యాదుల్లో

👉 60 శాతం పైగా LPM, సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దుల సమస్యలే ఉన్నాయి.

ఫిర్యాదుదారులు పలుమార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిష్కారం లభించడం లేదు అని వాపోతున్నారు.

కావున మా డిమాండ్లు :

గత ప్రభుత్వ కాలంలో జరిగిన భూ రీ–సర్వే & రెవెన్యూ అవకతవకలపై ప్రత్యేక విచారణ నిర్వహించాలి.

LPM, విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఆధార్ లింక్ లను గ్రౌండ్ లెవల్ లో పునఃపరిశీలన చేసి , తప్పు రికార్డుల ఆధారంగా జారీ చేసిన పాస్‌బుక్‌లను సరిదిద్ది అమలు చేయాలి.

భూ యజమానులు, రైతుల భూమి హక్కులకు భంగం కలిగించిన వారిపై బాధ్యత నిర్ణయించి తగిన చర్యలు తీసుకోవాలి 

భూ యాజమాన్యం మరియు వ్యవసాయ భూమి వారి వారసత్వ హక్కు, ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తగిన న్యాయం చేయగలరని పల్నాడు జిల్లా బిజేపి కోరుకున్నది.



 
 
 
విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో జనతా వారధి రాష్ట్ర కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా జనత వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు  మల్లెల శివ నాగేశ్వరరావు

 *విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జనతా వారధి రాష్ట్ర కార్యశాల కార్యక్రమంలో పల్నాడు జిల్లా నుంచి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావుపాల్గొని పల్నాడు జిల్లా లొ జరిగిన జనత వారధి ప్రారంభోత్సవం కార్యక్రమం గురించి రాష్ట్ర అధ్యక్షులు వారికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా నుండి కో కన్వినర్ గంజార్ల  అది లక్ష్మి గారు పాల్గొనడం జరిగింది*

*ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కోస్తా జిల్లాల జోనల్ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగోల గోపి శ్రీనివాస్ గారు రాష్ట్ర  కార్యదర్శి లక్ష్మి ప్రసన్న గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా హాజరైన జనతా వారధి కన్వీనర్ కో కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు తదుపరి జరగవలసిన కార్యక్రమాల గురించి వివరించారు*


 
 
 
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో ప్రారంభమైన పల్నాడు జనతా వారిది కార్యక్రమం


రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, *ప్రజలకు ప్రభుత్వానికి వారధి- బిజెపి జనతా వారధి* 
కార్యక్రమాన్ని శావల్యపురం మండలం, వేల్పూరు పంచాయతీ పరిధిలోని, వెలమవారిపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. 
ఈ సందర్భంగా గ్రామస్తులు కొన్ని సమస్యల్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ద్రుష్టికి తేవడం జరిగింది,  ముఖ్యంగా  దశాబ్దాలుగా పరిష్కారం కాని 45 ఎకరాల   ఇనాం భూమిలకు సంబంధించి పాస్ పుస్తకాలు మంజూరు మరియు, రామాలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో, వీధుల్లో సైడ్ డ్రైనేజీ  నిర్మాణం చేపట్టాలని, అలాగే  పెన్షన్లకు సంబంధించి అలాగే మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, 
 ఈ దరఖాస్తులను   పరిష్కార పరిధని బట్టి ఆయా శాఖల  పంచాయతీ, మండల, జిల్లా, రాష్ట్ర అధికారులకు ఇవ్వడం జరుగుతుంది, ఈ కార్యక్రమం ప్రతి గురువారం మండలంలోని ఒక గ్రామంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








 
 
పల్నాడు జిల్లా.... జనతా వారిది కార్యక్రమంలో  సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని   పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం  జరిగింది

జనతా వారిది కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులలో పరిష్కార దిశగా ఫిర్యాదుదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి ఆర్ ఓ గారిని అమరావతిలో అక్రమ వైనింగ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే శిశు సంక్షేమ శాఖ అధికారులతో బాధితులు తో కలసి కలవడం  జరిగింది త్వరలో సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా గోగినేని వెంకటరమణ మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.




 
 
 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ గారు ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లా పార్టీ చేపట్టిన

జనతా వారధి ప్రారంభోత్సవ కార్యాక్రమం లొ భాగంగా

మొదటి రోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో

*ముఖ్య అతిదులు గా నెల్లూరు రీజినల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు* 
*రాష్ట్ర కార్యదర్శి మేకల హనుమంతరావు గారు నేషనల్ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు గారు జిల్లా ఇన్చార్జ్ కొక్కెర శ్రీనివాసరావు గారు ఒంగోలు ఇన్చార్జి పునుగుళ్ల రవిశంకర్ గారు* 
*జనత వారధి ప్రోగ్రాం కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు తదితరులు హాజరై పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయం లొ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది*

*తదుపరి అందరూ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూ వెళ్లి పల్నాడు జిల్లా లోని సమస్యలు గురించి కలెక్టర్ గారికి ఈ క్రింది సమస్యల వినతి పత్రాలు అందించడం జరిగింది*

1.*పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనితీరుపై ఒక వినతి పత్రం అందించడం జరిగింది*

2. *తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లో గత 90 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లొ నివాసముంటున్న తమిళనాడు వాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఒక వినతి పత్రం అందించడం జరిగింది*

3. *పల్నాడు జిల్లా అమరావతిలో అనధికార లేఔట్ లపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగింది*

4. *కోళ్ల ఫారాల లో చనిపోయిన కోళ్లను రోడ్ల పక్కన వేయటం గురించి ఒక వినతి పత్రం అందించడం జరిగింది*

*పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి*వినతి పత్రలు ఇవ్వడం జరిగినది* *జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది*

*త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తాము అని భారతీయ జనతా పార్టీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మండల అధ్యక్షులు జనతా వారధి కో కన్వీనర్లు జిల్లా పదాధికారులు మండల ఇన్చార్జులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది*