రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్త లో ప్రక్షాళన అవసరం
రెవెన్యూ సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలి: పల్నాడు జిల్లా బిజెపి
*విషయం : భూ రీ–సర్వే, LPM, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ లింక్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి భూ యజమానులకు, రైతులకు న్యాయం చేయవలసిందిగా వినతి*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందుకు మేము స్వాగతిస్తున్నాము. రైతుల భూమి హక్కుల పరిరక్షణకు ఇది కీలకమైన కార్యక్రమం*
అయితే, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో భూ రీ–సర్వే పేరుతో తప్పుడు కొలతలు, సర్వే నంబర్ల మార్పులు, హద్దులు–విస్తీర్ణంలో అవకతవకలు, LPM లో పొరపాట్లు, టైటిల్ డీడ్ మరియు ఆధార్ లింక్ లో తప్పిదాలు జరిగి భూ రికార్డులు తారుమారయ్యాయి.
గత ప్రభుత్వం అవినీతి జరుగుతుందని VRO వ్యవస్థను రద్దు చేసి ప్రవేశపెట్టిన VRA–సచివాలయ వ్యవస్థ కూడా అవినీతి, అధికారుల అలసత్వం కొనసాగడంతో భూ యజమానులు ముఖ్యంగా రైతులు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు.
ప్రస్తుతం కొత్తగా మంజూరు చేస్తున్న పాస్‌బుక్‌లు కూడా గతంలో తారుమారైన రికార్డుల ఆధారంగా ఇవ్వబడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ – “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా చేస్తున్న పర్యటనలలో మరియు ప్రజల నుండి ప్రతి శుక్రవారం స్వీకరిస్తున్న ఫిర్యాదుల్లో
👉 60 శాతం పైగా LPM, సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దుల సమస్యలే ఉన్నాయి.
ఫిర్యాదుదారులు పలుమార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిష్కారం లభించడం లేదు అని వాపోతున్నారు.
కావున మా డిమాండ్లు :
గత ప్రభుత్వ కాలంలో జరిగిన భూ రీ–సర్వే & రెవెన్యూ అవకతవకలపై ప్రత్యేక విచారణ నిర్వహించాలి.
LPM, విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఆధార్ లింక్ లను గ్రౌండ్ లెవల్ లో పునఃపరిశీలన చేసి , తప్పు రికార్డుల ఆధారంగా జారీ చేసిన పాస్‌బుక్‌లను సరిదిద్ది అమలు చేయాలి.
భూ యజమానులు, రైతుల భూమి హక్కులకు భంగం కలిగించిన వారిపై బాధ్యత నిర్ణయించి తగిన చర్యలు తీసుకోవాలి
భూ యాజమాన్యం మరియు వ్యవసాయ భూమి వారి వారసత్వ హక్కు, ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తగిన న్యాయం చేయగలరని పల్నాడు జిల్లా బిజేపి కోరుకున్నది.
Post A Comment:
0 comments: