ఎడ్లపాడు మండలంలో ప్రజలకు సంబంధించిన భూములను వెంటనే ప్రజలకు స్వదినం చేయాలని కోరుతున్న ఎడ్లపాడు మండల బిజెపి పార్టీ
24.1.2026, నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్, ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ లో భాగంగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ గారికి ఎడ్లపాడు మండలంలోని 150 ఎకరాలు అసైన్డ్ భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనతావారధి కార్యక్రమంలో భాగంగా, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ, జనతా భారతి ఎడ్లపాడు మండలం కన్వీనర్ దాట్ల వెంకటేశ్వర రాజు గారి ఆదేశాల మేరకు కోకన్వీనర్ బందెల శ్రీనివాసరావు అర్జీ సమర్పించడం జరిగింది.
ఎడ్లపాడు మండలంలోని 150 ఎకరాలు 2009వ సంవత్సరంలో ఎస్సీ కమిషన్ సేకరించి తాసిల్దార్ గారి స్వాధీనంలో ఉంచటం జరిగింది. 150 ఎకరాలు భూమిని పంపిణీ చేయాలని 30-5 - 2010 తాసిల్దారు వారు పత్రిక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా పంపిణీ జరగలేదు. 27 డిసెంబర్ 2025 ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ అర్జీ కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఆర్డీవో నరసరావుపేట వారు, గారు వచ్చి క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించడం జరిగింది, ఇప్పటికి నెల అవుతుంది, ఈరోజు వరకు కూడా మా సమస్య పరిష్కారం కాలేదు అని, 24-1- 2026వ తేదీన జరిగిన ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ లో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ గారితో సవినయంగా మనవి చేయడం జరిగింది.
---------------
బందెల శ్రీనివాసరావు మాదిగ
(ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు.)
భారతీయ జనతా పార్టీ, ఎడ్లపాడు మండలం,
జనతా వారధి, కో కన్వీనర్
Post A Comment:
0 comments: