గురజాల పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనతో గురజాల అసెంబ్లీ గురజాల మండలం నందు జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షురాలు నాగమణి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల ఇన్చార్జి నాసరయ్య జి ముఖ్యఅతిథిగా పాల్గొనరు. ప్రతి గురువారం పార్టీ సూచనలతో నిర్వహించే జలతావారధి కార్యక్రమం నేడు పాతపాటేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించగా ఐదు రకాల సమస్యలు కమిటీ దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది వాటిలో రెండు సమస్యలను నిమిషాల వ్యవధిలో సదరు కార్యాలయాలతో పార్టీ నాయకులు మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది మిగిలిన సమస్యలు ఒకటి ఆర్డీవో కార్యాలయానికి రెండు కలెక్టర్ వారి కార్యాలయానికి పంపిన నిర్ణయం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జనతా వారధి కోకన్వీనర్ పిండి రామాంజనేయులు అమృత లింగేశ్వరరావు, రమేష్,కాశీ అమరయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: