August 2026



జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా ఎస్పీ  కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు సోషల్ మీడియా యు మోర్చా నాయకులు వంకాయలపాటి వంశీధర్ నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్ అధ్యక్షులు నరసరావుపేట బిజెపి నాయకులు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసురత్నం  నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని

భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 

 పల్నాడు జిల్లా అడిషనల్  ఎస్పీ గారికి
 నరసరావుపేట పల్నాడు జిల్లా 


విషయం : *సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* 

YSRCP కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి, ఇతనికి సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* 

పోలీసులు ఇటువంటి కేసులను ప్రేమ ఆర్థిక అంశంగా చూడటం వల్లే పోలీస్ స్టేషన్లకు బాధితులు వెళ్లడం లేదు. సాధారణంగా ఫిర్యాదు సమయంలో బాధితురాలి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం వలన ఫిర్యాదులకు ముందుకు రావడం లేదు. ఫిర్యాదుదారులు పదేపదే పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వస్తుంది. కేసులు పెట్టకుండా కఠినంగా వ్యవహరించకుండా కౌన్సిలింగ్ పేరుతో తిరిగి పంపేస్తున్నారు. రాష్ట్రంలో గో హత్యలు నిరోధించమని అడుగుతున్న గోరక్షణ రక్షకులపై కేసులు పెడుతున్నారు. లవ్ జిహాది కోసం మాట్లాడుతున్న వారిపై ఆంక్షలు పెడుతున్నారు. హిందూ సమాజానికి పోలీసు వ్యవస్థపై విశ్వాసం కలిగించలేకపోతున్నారు.

ఈ లవ్ జిహాది సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఒక్క సంఘటన కూడా లేదు. అందుకే ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. ఇదే లవ్ జిహాది ముఠాకు అవకాశంగా మారుతున్నది.

మొదట స్నేహం చేయడం, నమ్మకంగా ఉండటం,  కుటుంబం మొత్తం పరిచయం చేసుకోవడం, కుటుంబం విశ్వాసం పొందడం, ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం, ఇంట్లో మహిళలను వంచించడం, ఆ మహిళ ప్రైవేట్ ఫొటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బెదిరించడం, కుటుంబంలో బలమైన వారిని హత్య చేయడం, చివరగా ఆస్తులన్నీ స్వాధీనం చేసి ఇస్లాం మతంకు మారాలని ఒత్తిడి తీసుకురావడం ఇదే "లవ్ జిహాద్"

హిందూ మహిళలకు బాలికలకు రక్షణ లేకుండాపోయింది. జిమ్ములు, జుంబా డాన్సులు, సెలూన్ / బ్యూటీ పార్లర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలుగా లవ్ జహాజీ లు పనిచేస్తున్నారు.

వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీరికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణ ఇస్తున్నాయి? అనే విషయం పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. సరికాదా యువత లో అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదు.

ఆల్ ఉమా ఉగ్రవాదుల కార్యకర్తలు కాకినాడలో దొరికారు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు పెద్దాపురంలో దొరికారు, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహది బయటకు వచ్చింది.

ఏఈ నూకరాజు గారి కుటుంబం యొక్క సంఘటన చాలా తీవ్రమైనది, విచారకరమైనది. ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే ఆందోళన కలుగుతున్నది.

రైఫిల్ ట్రైనర్ గా ఉన్న సాజిద్ ఖాన్ వద్దకు చదువుకుంటున్న స్కూల్ ద్వారా శిక్షణ కోసం వచ్చిన ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి. తరచూ శిక్షణకు  తీసుకొని వెళ్తున్న సందర్భంలో తల్లి సౌజన్యను వంచించి ఆమె ప్రైవేటు ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్.  కొన్ని కోట్ల రూపాయల నగదు,బంగారం తీసుకొని మళ్ళీమళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషయం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్. చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదఆస్తిని తన పేరు రాసి ఏఈ నూకరాజు, తను భార్య మనవడు కార్తికేయ ,సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్, లేనిపక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటికి ప్రపంచానికి చెప్పడమే కాకుండా, తన భర్తను హతంచేసినట్టు కుమారుణ్ణి కూడా హతమారుస్తానని బెదిరింపులు.

ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగ చెంది AE నూకరాజు కుటుంబం ఈ విషయాలన్నీ ఒక ఉత్తరంగా రాసి  గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మనవడు కార్తికేయకి ఈత రావడం 12 సంవత్సరాల లోపుఉన్న బాలుడు బ్రతికాడు. ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి

ఈ సంఘటన తర్వాత పారిపోయిన సాదిక్ ఖాన్ ఢిల్లీలో దొరికాడు. ఆ దొరికిన స్థలంలో ఉండేటువంటి వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని బయట సమాచారం నడుస్తుంది. ఈ విషయాలన్ని పత్రికల్లో రావడం ప్రజలందరికి తెలియడం జరిగింది.

ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. లవ్ జిహాదీ సాదీక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి అని కోరుచున్నది. అంతేకాకుండా, పోలీస్ లు లవ్ జిహాదీపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్నటువంటి కేసులు ఏమిటి? చేస్తున్న సమీక్ష ఏమిటి? ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? దీనిపై తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? FIR అయిన కేసులపై రిఫర్ చేసిన సంఘటనలు ఎన్ని? పూర్తి వివరాలుతో రాష్ట్ర డిజిపి మరియు హోం శాఖ మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం.


ధన్యవాదములతో,

భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా



జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు 


విషయం: రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలపై తక్షణ చర్యలు చేపట్టి, ఇంకుడుగుంటల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని, ప్రజలతో కలసి మేము మీ దృష్టికి తీసుకొస్తున్న సమస్యలపై చిత్తశుద్ధి కనపరచాలని విజ్ఞప్తి.

ప్రతి శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న “మీ సమస్య – మా బాధ్యత” జనతా వారధి కార్యక్రమంలో ప్రజలతో నిరంతరం చర్చలు జరుపుతున్న సమయంలో భూగర్భ జలాల పరిస్థితిపై అనేక ఆందోళనలు మా దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో 11.05.2026న భూగర్భ జలాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువచ్చాము. అయితే ఇప్పటివరకు తగిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి వాతావరణ ప్రభావాలు కూడా వర్షపాతం మరియు నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు అత్యవసరం. జిల్లాలో కనీసం 15 వేల నుంచి 20 వేల ఇంకుడుగుంటలకు Groundwater Recharge Action Plan చేయవలసి ఉన్నది అని తెలుస్తున్నది.

భూగర్భ జలాలు ఒక్కరోజులో ఏర్పడేవి కావు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం, సహజ నీటి వనరులను పరిరక్షించడం, భూగర్భ జలాల వినియోగాన్ని శాస్త్రీయంగా నియంత్రించడం ద్వారా మాత్రమే వాటిని కాపాడుకోగలం.

కావున ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలని కోరుతున్నాము:
1. జిల్లాల లో భూగర్భ జలాలపై సమగ్ర సర్వే నిర్వహించాలి. అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
2. జిల్లాలో విస్తృతంగా ఇంకుడుగుంటలు ఏర్పాటు చేయాలి. వర్షపు నీటిని వృథాగా కాలువల్లోకి వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున ఇంకుడుగుంటలు తవ్వించాలి.
3. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్మెంట్లు, కమ్యూనిటీ బిల్డింగ్స్, భారీ భవనాల్లో ఇంకుడుగుంటలను తప్పనిసరి చేయాలి. కొత్త భవనాలకు అనుమతులు ఇచ్చే సమయంలోనే వర్షపు నీటి సంరక్షణ, రీచార్జ్ వ్యవస్థలు తప్పనిసరి చేయాలి.
4. పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవనాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంకుడుగుంటలు ఏర్పాటు చేయాలి. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వమే సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించాలి.
5. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు మరియు ఇతర సహజ నీటి వనరులను పునరుద్ధరించాలి. ఆక్రమణలను తొలగించి వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
6. చెక్‌డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, రీచార్జ్ పిట్స్ వంటి నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలి.
7. అధికంగా భూగర్భ జలాలను వినియోగించే ప్రాంతాల్లో శాస్త్రీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలి. రైతులకు మైక్రో ఇరిగేషన్, తక్కువ నీటితో సాగయ్యే పంటలు మరియు నీటి పొదుపు పద్ధతులపై అవగాహన కల్పించాలి.

దీనిని ఒక ప్రజా ఉద్యమంగా స్వీకరించాలి. భూగర్భ జలాల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా స్వీకరించి, ప్రజలు, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్ సంఘాలు మరియు సామాజిక సంస్థలను భాగస్వాములను చేయాలి.

భారతీయ జనతా పార్టీ ప్రజా సేవనే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ పనిచేస్తోంది. భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం మరియు అధికారులు చేపట్టే ప్రతి సానుకూల కార్యక్రమానికి మా వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మరియు నిపుణుల సహకారాన్ని కూడా సమన్వయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.

ఇది రాజకీయ అంశం కాదు — ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన జీవన సమస్య. ఇప్పుడే చర్యలు తీసుకుంటే రేపటి నీటి సంక్షోభాన్ని నివారించగలం. ఆలస్యం చేస్తే భూగర్భ జలాల పునరుద్ధరణ మరింత కష్టతరమవుతుంది.
మా వినతి 

కావున జిల్లా అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, మండలాల వారీగా తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పెద్ద ఎత్తున ఇంకుడుగుంటల నిర్మాణ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.
ధన్యవాదములతో,

భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా


పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు జనతా వారధి కోస్టల్ ఇంచార్జ్ షేక్ బాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఫిర్యాదులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు  ఏలూరి శశి కుమార్ గారు  జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు  గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు   మైనారిటీ మోర్చా ఈసీ నెంబర్ అమ్మ జిలాని  గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ రెడ్డి గారు నరసరావుపేట టూ టౌన్ అధ్యక్షులు నరసరావుపేట రూరల్ అధ్యక్షులు నరసరావుపేట బిజెపి నాయకులు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు






పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు మరియు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ మరియు చేనేత కుటుంబాలకు సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 

వినతిపత్రం

గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి,
పల్నాడు జిల్లా, నరసరావుపేట.

విషయం: చేనేత సహకార సంఘాల ప్రక్షాళన, పారదర్శక ఎన్నికలు, APCOలో ప్రజాస్వామ్య పాలన, నేతన్నల బకాయిల పరిష్కారం, మగ్గం వద్దే నేరుగా కొనుగోళ్లు, ప్రతి జిల్లాలో మగ్గం బజార్లు–చేనేత కాంప్లెక్స్‌ల ఏర్పాటు, కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హత కలిగిన నేతన్నకు అందించుట – సంబంధించి వినతి.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం జిల్లా కార్యాలయంలో ప్రజలతో నిర్వహిస్తున్న చర్చలు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలతో విజయవాడలో నిర్వహించిన “చేనేత సమ్మేళనం”లో వచ్చిన సూచనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాము.

చేనేత రంగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, సంప్రదాయ సంస్కృతికి, వేలాది కుటుంబాల జీవనోపాధికి ముఖ్యమైన ఆధారం. 4వ అఖిల భారత చేనేత గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,27,662 మంది చేనేత కార్మికులు, 49,785 మంది అనుబంధ కార్మికులు కలిపి మొత్తం 1,77,447 మంది చేనేత రంగంపై ఆధారపడి ఉన్నారు.  

రాష్ట్రంలో సుమారు 1,282 చేనేత సహకార సంఘాలు ఉన్నప్పటికీ, వాటిలో అనేక సంఘాలు క్రియాశీలత కోల్పోయి, నిజంగా మగ్గం నడిపే నేతన్నలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే అభిప్రాయం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న National Handloom Development Programme, Raw Material Supply Scheme, Weavers’ MUDRA, బీమా, SAMARTH తదితర పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి సహాయం అందుతోంది. 22 చిన్న చేనేత క్లస్టర్ల ద్వారా సుమారు 4,000 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది; ధర్మవరంలో ఒక మెగా చేనేత క్లస్టర్‌కు ఆమోదం లభించింది. అలాగే 14 మార్కెటింగ్ కార్యక్రమాలు, 40 చేనేత ఉత్పత్తిదారుల కంపెనీలు, 5,987 ముద్ర రుణాలు, 9,408 బీమా లబ్ధిదారులు, 22.34 లక్షల కిలోల నూలు 15%సబ్సిడీతో సరఫరా వంటి చర్యలు నమోదయ్యాయి. 

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల పూర్తి ప్రయోజనం ప్రతి అర్హత ఉన్న నేతన్నకు చేరాలంటే సంఘాల వ్యవస్థలో పారదర్శకత, సమర్థవంతమైన మార్కెటింగ్, సకాలంలో బకాయిల చెల్లింపు, మధ్యవర్తుల నియంత్రణ అత్యవసరం.

కాబట్టి క్రింది అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము:

మా ప్రధాన విజ్ఞప్తులు

1. చేనేత సంఘాల సమగ్ర పరిశీలన: అన్ని చేనేత సహకార సంఘాలపై జిల్లా వారీగా ప్రత్యేక సమీక్ష నిర్వహించి, నిజంగా మగ్గం నడిపే నేతన్నలు, చేనేత కార్మికులు, అనుబంధ కార్మికుల సభ్యత్వాన్ని ధృవీకరించాలి. క్రియాశీలంగా లేని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సంఘాలను పునర్వ్యవస్థీకరించాలి.
2. సభ్యత్వంలో పారదర్శకత: ప్రతి సంఘంలో సభ్యుల జాబితాను నవీకరించి, అర్హులైన నేతన్నల పేర్లు, సభ్యత్వ వివరాలు, ఓటర్ల జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలి. నకిలీ లేదా క్రియాశీలత లేని సభ్యత్వాలను తొలగించి, నిజమైన నేతన్నలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
3. నిష్పక్షపాత ఎన్నికలు: అర్హత కలిగిన అన్ని చేనేత సహకార సంఘాలకు నిర్ణీత కాలపరిమితిలో పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియను స్వతంత్ర అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి.
4. APCOలో ప్రజాస్వామ్య పాలన: APCO చైర్మన్, మేనేజింగ్ కమిటీ, జనరల్ బాడీ, ప్రాథమిక చేనేత సంఘాల ప్రతినిధిత్వం తదితర అంశాల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. ఎన్నికైన నిజమైన నేతన్నల ప్రతినిధులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
5. బకాయిల పరిష్కారం: చేనేత సంఘాలకు, నేతన్నలకు రావాల్సిన ఉత్పత్తి చెల్లింపులు, కొనుగోలు బకాయిలు, ఇతర ఆర్థిక బకాయిలను జిల్లా వారీగా గుర్తించి, బహిరంగ జాబితా రూపొందించాలి. ప్రతి బకాయికి గడువు నిర్ణయించి, కాలపరిమితిలో చెల్లించే విధానం ఏర్పాటు చేయాలి. బకాయిల కోసం నేతన్నలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని తొలగించాలి.
6. మగ్గం వద్దే నేరుగా కొనుగోళ్లు: “Direct from Loom – Direct to Consumer” విధానాన్ని ప్రోత్సహించాలి. మగ్గం వద్ద ఉత్పత్తి చేసిన వస్త్రాలను సహకార సంఘాలు, APCO, ప్రభుత్వ సంస్థలు, డిజిటల్ మార్కెట్ వేదికల ద్వారా నేరుగా కొనుగోలు చేసి, చెల్లింపులను నేతన్న బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలి.
7. ప్రతి జిల్లాలో మగ్గం బజార్: ప్రతి జిల్లాలో “మగ్గం బజార్” లేదా సమగ్ర చేనేత కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. మగ్గం, ఉత్పత్తి, ప్రదర్శన, విక్రయం ఒకే ప్రాంగణంలో జరిగేలా లైవ్ హ్యాండ్లూమ్ మార్కెట్లను అభివృద్ధి చేయాలి. వీటిని పర్యాటక కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వారాంతపు మార్కెట్లతో అనుసంధానం చేయాలి.
8. జిల్లా స్థాయి Facilitation Centre: కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన, దరఖాస్తులు, బ్యాంకు రుణాలు, బీమా, పహచాన్ కార్డులు, నూలు రాయితీ, శిక్షణ, క్లస్టర్ సౌకర్యాలు, డిజిటల్ విక్రయాల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక చేనేత సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
9. కేంద్ర పథకాల విస్తరణ: జిల్లాకు మరిన్ని చేనేత క్లస్టర్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి. జిల్లాలోని చేనేత ప్రాంతాలను గుర్తించి, అవసరమైన మౌలిక వసతులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు, డిజైన్ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
10. కొత్త తరం మార్కెట్ అభివృద్ధి: పిల్లల దుస్తులు, ఆధునిక డిజైన్లు, యువత అభిరుచులకు అనుగుణమైన వస్త్రాలు, గృహ అలంకరణ ఉత్పత్తులు అభివృద్ధి చేయాలి. డిజైనర్లు, స్టార్టప్‌లు, ఫ్యాషన్ సంస్థలు, ఈ-కామర్స్ సంస్థలను చేనేత సంఘాలతో అనుసంధానం చేయాలి.
11. డిజిటల్ విక్రయాలు మరియు ప్రభుత్వ కొనుగోళ్లు: చేనేత ఉత్పత్తులను ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్, Indiahandmade వంటి ఆన్‌లైన్ వేదికలపై విక్రయించేందుకు సంఘాలు, నేతన్నలకు శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా సంస్థల అవసరాల్లో చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 
12. నేతన్న సేవలో పథకం: నేతన్న సేవలో పథకం ద్వారా నేతన్నలకు అందిస్తున్న ₹25,000 ఆర్థిక సహాయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ సహాయం అర్హులైన ప్రతి నేతన్నకు పారదర్శకంగా, ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలి.

ప్రత్యేకంగా కోరేది పై అంశాలపై జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన చేనేత శాఖ అధికారులు, APCO ప్రతినిధులు, సహకార సంఘాల సభ్యులు, నిజమైన నేతన్నలు, చేనేత నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కార్యాచరణ ప్రణాళిక, బాధ్యత వహించే అధికారులు, అమలు గడువు ప్రకటించాలి.

నేతన్నకు శాశ్వతమైన మార్కెట్ కావాలి. చేనేత సంఘాలకు ప్రజాస్వామ్య పాలన కావాలి. APCOలో పారదర్శకత కావాలి. మగ్గానికి గౌరవం, ఉత్పత్తికి సరైన ధర, నేతన్నకు స్థిరమైన ఆదాయం రావాలి. కాబట్టి ఈ వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి జిల్లాలో తక్షణమే తగిన చర్యలు చేపట్టి, తీసుకున్న నిర్ణయాలను మాకు తెలియజేయవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాము.





పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ నెంబర్ వల్లెపు కృపారావు  గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పార్లమెంటు సంయోజిక్ చిరుమామిళ్ల ఆదినారాయణ  గారు మైనారిటీ మోర్చా జిల్లా ఇంచార్జ్ షేక్ బిలాల్ గారు మైనారిటీ మోర్చా ఈసీ నెంబర్ అమ్మ జిలాని  గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయభాస్కర్ రెడ్డి గారు నరసరావుపేట వన్ టౌన్ అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు





జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 


గౌరవ జిల్లా కలెక్టర్ గారికి,
పల్నాడు జిల్లా.

విషయం:
ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడం మరియు TTDతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికకు పారదర్శక విధానం రూపొందించవలెనని వినతి.

సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆలయాలు కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆధ్యాత్మిక విలువలను భావితరాలకు అందించే కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.

భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న "జనతా వారధి" కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక మంది సాంప్రదాయ సాంస్కృతిక కళాకారులు, భజన సంఘాలు, కోలాట బృందాలు, హరికథకులు, జానపద,కూచిపూడి నృత్యం, భరతనాట్యం, ఆంధ్ర నృత్యం, హరికథ, బుర్రకథ, భజన మండలి, చెక్క భజన, డప్పు నృత్యం, ధింసా నృత్యం, ఒగ్గు కథ, వీధి భాగవతం, యక్షగానం, తోలుబొమ్మలాట, కీలుబొమ్మలాట, పులివేషం, గరగ నృత్యం, పోతురాజు వేషం, గంగిరెద్దుల ఆట, చిందు భాగవతం, గొబ్బి నృత్యం, నాగస్వరం–మంగళ వాయిద్య ప్రదర్శన, డోలు, డప్పు, సన్నాయి వాద్య బృందాలు, వేద పారాయణం, అన్నమాచార్య సంకీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, రామదాసు కీర్తనలు, లలిత, శివ, దేవి భక్తి గాన కళాకారులు తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారు. వారి అభిప్రాయాలను పరిశీలించిన తరువాత రెండు ప్రధాన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాము.

1. *ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి* 
ప్రస్తుతం అనేక మంది కళాకారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆలయాల్లో అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియజేస్తున్నారు. దాంతో వారు ప్రైవేట్ హాళ్లు లేదా అద్దె భవనాల్లో శిక్షణ నిర్వహించాల్సి వస్తోంది. పెరుగుతున్న అద్దెల కారణంగా శిక్షణకు రుసుము వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు, యువత ఈ కళలకు దూరమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.

• దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో దశలవారీగా ఉచిత సాంస్కృతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
• ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక గంట శిక్షణ నిర్వహించాలి.
• భజన, కోలాటం, చెక్కభజన, హరికథ, యక్షగానం, పురాణ ప్రవచనం, నాదస్వర సంగీతం తదితర పైన సూచించిన సాంప్రదాయ కళలకు శిక్షణ ఇవ్వాలి.
• స్థానిక అర్హత కలిగిన కళాకారులను పార్ట్‌టైమ్ శిక్షకులుగా నియమించి వారికి గౌరవప్రదమైన పారితోషికం అందించాలి.
• స్థానిక ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఏ కళారూపాలకు శిక్షణ ఇవ్వాలనే అంశాన్ని నిర్ణయించే అవకాశం కల్పించాలి.
• శిక్షణ పూర్తిచేసిన వారికి ధ్రువపత్రాలు, ఆలయ ఉత్సవాల్లో ప్రదర్శన అవకాశాలు కల్పించాలి.

సనాతన ధర్మానికి సంబంధించిన సంప్రదాయ కళలు పరిరక్షించబడతాయి. యువతలో సృజనాత్మకత, క్రమశిక్షణ, సాంస్కృతిక అవగాహన పెరుగుతుంది. స్థానిక కళాకారులకు గౌరవప్రదమైన ఉపాధి లభిస్తుంది. ఆలయాలు పూజా కేంద్రాలతో పాటు సాంస్కృతిక విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి. అంతరించిపోతున్న సంప్రదాయ కళలకు కొత్త తరం సిద్ధమవుతుంది.

2. *ఆలయ ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు పారదర్శక విధానం రూపొందించాలి* 

రాష్ట్రంలోని అనేక మంది కళాకారులు ఆలయ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశాల కోసం స్పష్టమైన విధానం అవసరమని కోరుతున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రధాన ఆలయాల వార్షిక ఉత్సవాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల ఎంపికకు ఒకే విధమైన పారదర్శక వ్యవస్థ అవసరం.
• ఈ నేపథ్యంలో క్రింది విధానం అమలు చేయవలసిందిగా వినతిచేస్తున్నాము.
• రాష్ట్రవ్యాప్తంగా భజన సంఘాలు, కోలాట బృందాలు, హరికథకులు, జానపద కళాకారులు మరియు ఇతర సాంప్రదాయ కళాకారుల నమోదు చేపట్టాలి.
• జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లేదా జిల్లా స్థాయి కమిటీ ద్వారా కళాకారుల అర్హత పరిశీలన చేసి జిల్లా వారీగా డిజిటల్ డేటాబేస్ రూపొందించాలి.
• TTD, ప్రముఖ దేవాలయాలు మరియు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు ఈ నమోదిత జాబితా నుంచే అవసరానికి అనుగుణంగా కళాకారులను ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయాలి.
• ఎంపిక ప్రమాణాలు, ఎంపికైన కళాకారుల జాబితా, ప్రదర్శనల వివరాలు, పారితోషిక వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
• ప్రతి జిల్లాకు తగిన ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని రూపొందించాలి.
• కళాకారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

కళాకారులకు సమాన అవకాశాలు లభిస్తాయి. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. వ్యక్తిగత సిఫారసులు లేదా పరిచయాలపై ఆధారపడే పరిస్థితి తగ్గే అవకాశం ఉంటుంది. కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంప్రదాయ కళలకు సముచిత ప్రాతినిధ్యం లభిస్తుంది. కళాకారుల గౌరవం, విశ్వాసం పెరుగుతుంది.

జిల్లాలో ఆలయాలను సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల పరిరక్షణకు జీవంతమైన కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి పై రెండు అంశాలపై సమగ్ర విధానం రూపొందించి అమలు చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుచున్నాము.

ధన్యవాదములతో,

భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా