September 2026



జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా కలెక్టర్  కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం  జిల్లా బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి,
పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్.
విషయం:  జిల్లాలో 22-A నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా పునఃపరిశీలించి, అర్హత ఉన్న ప్రైవేట్/పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి, భూ యజమానుల సమస్యలను పరిష్కరించవలసిందిగా వినతి.
సంబంధిత చట్టం: Registration Act, 1908 లోని Section 22-A.
సూచన: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా G.O.Ms.No.444, Revenue (Registration-I) Department, dated 22-07-2026, అలాగే 22-A భూములపై గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు మరియు మార్గదర్శకాలు.
మహోదయులకు,
 జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలలో అనేక భూములు Section 22-A కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండటం వలన భూ యజమానులు, రైతులు మరియు సాధారణ ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
22-A జాబితాలో భూమి ఉన్న కారణంగా సంబంధిత భూములను విక్రయించడం, బదలాయించడం, రిజిస్ట్రేషన్ చేయడం మరియు కొన్ని సందర్భాల్లో బ్యాంకు రుణాలు పొందడం వంటి చట్టబద్ధమైన వ్యవహారాల్లో ప్రజలకు సమస్యలు ఏర్పడుతున్నాయి.
అదేవిధంగా, కొన్ని భూములు వాటి వాస్తవ రికార్డులు, భూమి స్వభావం, హక్కులు మరియు సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా నిషేధిత జాబితాలో కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు కూడా ప్రజల నుండి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22-A నిషేధిత ఆస్తుల జాబితా నిర్వహణలో ఏకరీతి, పారదర్శకత మరియు ఖచ్చితత్వం కోసం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో, అన్ని జిల్లాలో కూడా సమగ్ర పునఃపరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉంది.
మా ప్రధాన విజ్ఞప్తులు:
1. మండలాల వారీగా సమగ్ర సమీక్ష రాష్ట్రము లోని అన్ని మండలాల్లో 22-A కింద ఉన్న భూముల పూర్తి వివరాలను మండలాల వారీగా సేకరించి సమీక్షించాలి.
2. భూమి వర్గీకరణను పునఃపరిశీలించాలి
ప్రతి భూమి 22-Aలో ఏ క్లాజ్ కింద ఉందో — 22-A(1)(a), (b), (c), (d) లేదా (e) — స్పష్టంగా గుర్తించి, సంబంధిత రికార్డులతో సరిపోల్చాలి.
3. అర్హత ఉన్న ప్రైవేట్ భూములను పరిశీలించాలి
చట్టబద్ధమైన పట్టా/ప్రైవేట్ భూములు పొరపాటున నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే, సంబంధిత రికార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం వాటిని జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.
4. పాత పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
22-A నుంచి భూమిని తొలగించేందుకు ప్రజలు గతంలో సమర్పించిన దరఖాస్తులు, అభ్యంతరాలు మరియు Representationలను గుర్తించి, వాటిని కాలపరిమితిలో పరిష్కరించాలి.
5. ప్రత్యేక 22-A గ్రీవెన్స్ కార్యక్రమం
ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేక 22-A grievance hearing నిర్వహించి, భూ యజమానుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించాలి.
6. RDO/Revenue అధికారులతో పరిశీలన
భూమి రికార్డులు, Adangal, 1-B/ROR, పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డాక్యుమెంట్లు, FMB/సర్వే రికార్డులు మరియు ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలి.
7. 22-Aలో చేర్చిన కారణాన్ని ప్రజలకు తెలియజేయాలి
ప్రతి భూమి ఏ కారణంతో మరియు ఏ ప్రభుత్వ రికార్డు ఆధారంగా 22-Aలో చేర్చబడిందో సంబంధిత భూ యజమానికి స్పష్టంగా తెలియజేసే విధానం ఏర్పాటు చేయాలి.
8. అర్హత ఉన్న భూముల తొలగింపునకు సిఫారసు
పరిశీలనలో 22-A నిషేధానికి చట్టబద్ధమైన కారణం లేదని తేలిన భూముల విషయంలో సంబంధిత అధికారుల ద్వారా నిబంధనల ప్రకారం deletion/de-notification ప్రక్రియ చేపట్టాలి.
9. 22-A(1)(e) భూముల ప్రత్యేక పరిశీలన
22-A(1)(e) కింద ఉన్న భూముల విషయంలో సంబంధిత ప్రభుత్వ నోటిఫికేషన్, Gazette మరియు భూమి రికార్డులను పరిశీలించి, ప్రస్తుతం నిషేధం కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై సమగ్ర నివేదిక తయారు చేయాలి.
10. ప్రజలకు పారదర్శకమైన విధానం
22-A దరఖాస్తుల స్వీకరణ, విచారణ, నిర్ణయం మరియు అప్పీల్/తదుపరి చర్యల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ముఖ్యమైన చట్టపరమైన అంశం
తాజా G.O.Ms.No.444, dated 22-07-2026 ప్రకారం Section 22-A కింద నిషేధిత ఆస్తుల డేటాబేస్ నిర్వహణకు రాష్ట్రస్థాయిలో IGRSకు కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. అలాగే 22-A(1)(a) నుంచి (d) వరకు ఉన్న భూముల విషయంలో చేర్పు/తొలగింపు అధికారాన్ని సంబంధిత RDO/Sub-Collector స్థాయిలో వినియోగించే విధానం నిర్దేశించబడింది. 22-A(1)(e) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం Gazette notification ద్వారా చర్య తీసుకోవాల్సిన విధానం ఉంది.
అందువల్ల బాపట్ల జిల్లాలో 22-A సమస్యలను కేవలం వ్యక్తిగత ఫిర్యాదులుగా కాకుండా జిల్లా స్థాయి సమగ్ర భూ-రికార్డుల పునఃపరిశీలన కార్యక్రమంగా చేపట్టాలని మా విజ్ఞప్తి.
భూ యజమానులు సమర్పించవలసిన పత్రాలు
సాధ్యమైనంత వరకు క్రింది పత్రాల ప్రతులను దరఖాస్తుతో జతచేయాలి:
ఆధార్/గుర్తింపు పత్రం
పట్టాదారు పాస్‌బుక్
టైటిల్ డీడ్/రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
తాజా Adangal
1-B / ROR
FMB/సర్వే స్కెచ్, అందుబాటులో ఉంటే
భూమికి సంబంధించిన పాత రిజిస్ట్రేషన్ పత్రాలు
భూమి పన్ను/శిస్తు రసీదులు
22-Aలో భూమి ఉన్నట్లు చూపించే రికార్డు/ఆన్‌లైన్ వివరాలు
గతంలో సమర్పించిన 22-A దరఖాస్తు/Representation మరియు acknowledgement, ఉంటే
సంబంధిత కోర్టు ఉత్తర్వులు, ఉంటే
ఇతర సంబంధిత రెవెన్యూ రికార్డులు.
తుది విజ్ఞప్తి
కావున పల్నాడు జిల్లాలోని ప్రజలు, రైతులు మరియు భూ యజమానుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 22-A నిషేధిత భూములపై జిల్లా స్థాయి ప్రత్యేక సమీక్ష నిర్వహించి, అర్హత ఉన్న భూములను నిబంధనల ప్రకారం నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మరియు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మనవి చేస్తున్నాము.
ప్రజలకు న్యాయబద్ధమైన భూ హక్కులు, పారదర్శకమైన రెవెన్యూ రికార్డులు మరియు సులభమైన పరిపాలనా సేవలు అందేలా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.


ధన్యవాదములతో,
భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా



పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్  గారు విచ్చేసి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది 

 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు  పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట విజయభాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా  ఆఫీస్ ఇంచార్జి చిరంజీవి గారు  ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నేలటూరి ఏసురత్నం నరసరావుపేట  బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా కలెక్టర్  కార్యాలయంలో  డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం  నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 

విషయం : 2026 ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు మరియు పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, కరువు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో సమగ్రంగా గుర్తించి అధికారికంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి.

2026 ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో పడకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 513 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 268 మండలాలు తీవ్రంగా, 245 మండలాలు మోస్తరు కరువు పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. తుది ప్రతిపాదనలు సెప్టెంబర్ 24లోగా పంపించి, అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రావ్యాప్తంగా 100 కరువు మండలాలు అంచనాలు పెరగడం ఆందోళనకరం 

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా మా ప్రతినిధులు గ్రామాల్లో రైతులు, కౌలు రైతులు మరియు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. పంటలు ఎండిపోవడం, సాగునీరు లేకపోవడం, బోర్లలో నీటి మట్టం తగ్గడం, తాగునీటి సమస్య, పశువులకు మేత కొరత మరియు రైతుల ఆర్థిక ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. కాబట్టి, కరువు మండలాలను కేవలం వర్షపాతం ఆధారంగా కాకుండా గ్రామస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి గుర్తించాలని కోరుతున్నాము.


మా విజ్ఞప్తులు
• మండలాలు, గ్రామాల వారీగా పంట నష్టం మరియు కరువు పరిస్థితులపై ప్రత్యేక సర్వే నిర్వహించాలి.
• సాగు విస్తీర్ణం, ఎండిపోయిన పంటలు, పంట నష్టం మరియు రైతుల వివరాలు నమోదు చేయాలి.
• 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టం ఉన్న రైతులకు నిబంధనల ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి.
• పంట బీమా పరిహారం, ప్రత్యామ్నాయ విత్తనాలు మరియు తదుపరి సాగుకు అవసరమైన సహాయం అందించాలి.
• తాగునీటి కొరత ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి, పాడైన బోర్లు మరియు పైప్‌లైన్లను మరమ్మతు చేయాలి.
• పశువులకు మేత, తాగునీరు మరియు పశువైద్య సేవలు అందించాలి.
• రైతులు మరియు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చెరువుల పూడికతీత, ఇంకుడుగుంటలు, చెక్‌డ్యామ్‌లు మరియు ఫారం పాండ్ల నిర్మాణ పనులు చేపట్టాలి.
• చెరువులు, కాలువలు మరియు రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిశీలించి సాగునీటి ప్రణాళిక రూపొందించాలి.
• భూగర్భ జలాల పరిస్థితిని గ్రామాల వారీగా పరిశీలించి నీటి సంరక్షణ, రీచార్జ్ పనులు చేపట్టాలి.

కరువు మండలాలను ప్రకటించిన వెంటనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా, ప్రత్యామ్నాయ విత్తనాలు, తాగునీరు, పశుగ్రాసం మరియు ఉపాధి చర్యలు అందేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలి.
కాబట్టి, పై అంశాలపై తక్షణ చర్యలు తీసుకుని రైతులు, కౌలు రైతులు మరియు గ్రామీణ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మనవి.

ధన్యవాదములతో,
భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా



పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమ్మ జిల్లాని గారు విచ్చేసి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది 

 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా  ఆఫీస్ ఇంచార్జి చిరంజీవి గారు  ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నేలటూరి ఏసురత్నం నరసరావుపేట  బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా జనతా ఆఫీస్ ఇంచార్జి చిరంజీవి గారు   బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

 


జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా కలెక్టర్  కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 


 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు  పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 


విషయం: ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, సింగిల్ విండో విధానంలో నిర్ణీత కాలపరిమితిలో అనుమతులు మంజూరు చేయడం, అనవసర ఆంక్షలు మరియు అధికారుల జాప్యాన్ని నివారించడం – సంబంధించి వినతిపత్రం.


భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం సందర్భంగా వివిధ వినాయక ఉత్సవ కమిటీల ప్రతినిధుల నుంచి అందిన ఫిర్యాదులు, సూచనలు మరియు విజ్ఞప్తులను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.


వినాయక చవితి భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అత్యంత ముఖ్యమైన పండుగ. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వేలాది వినాయక ఉత్సవ కమిటీలు భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి. ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక భద్రత, విద్యుత్ భద్రత, శబ్ద కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై నిబంధనలు ఉండటం అవసరమే. అయితే, అవి స్పష్టంగా, పారదర్శకంగా, రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా అమలవ్వాలి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సింగిల్ విండో విధానంలో వినాయక ఉత్సవాల అనుమతుల ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. ఒకే దరఖాస్తు ద్వారా పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో అనుమతులు పొందే విధానం ఉత్సవ కమిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


అయితే, క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు అనవసర జాప్యం, పలు శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అస్పష్టమైన నిబంధనలు, చివరి నిమిషంలో షరతులు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.


గత ప్రభుత్వం లో బహిరంగ గణేష్ మండపాలు, ఊరేగింపులు, సామూహిక కార్యక్రమాలపై కఠినమైన పరిమితులు విధించినవి  అనుమతులు, వివిధ శాఖల ఎన్‌ఓసీలు, ఊరేగింపులు, నిమజ్జనాల విషయంలో ఉత్సవ కమిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.


అందువల్ల, రాబోయే వినాయక చవితి ఉత్సవాలు ఎటువంటి  ఇబ్బందులు లేకుండా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా కింది చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము:


1.48 గంటల్లో అనుమతి: పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించిన ఉత్సవ కమిటీకి గరిష్ఠంగా 48 గంటల్లో అనుమతి మంజూరు చేయాలి.


2.సింగిల్ విండో విధానం: ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, విద్యుత్ తదితర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే దరఖాస్తుతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.


3.దరఖాస్తు ట్రాకింగ్ వ్యవస్థ: ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక ట్రాకింగ్ ఐడీ కేటాయించి, అది ప్రస్తుతం ఏ శాఖ లేదా ఏ అధికారి వద్ద ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకునే సదుపాయం కల్పించాలి.


4.అనుమతి నిరాకరణకు లిఖితపూర్వక కారణం: మౌఖికంగా అభ్యంతరాలు చెప్పి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఏ నిబంధన ప్రకారం అనుమతిని నిరాకరిస్తున్నారో స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేయాలి.


5.రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి నిబంధనలు: జిల్లా నుంచి జిల్లాకు, పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్‌కు నిబంధనలు మారకుండా రాష్ట్రస్థాయిలో ఒకే విధమైన మార్గదర్శకాలు జారీ చేయాలి.


6.అనధికారిక వసూళ్లకు అడ్డుకట్ట: ప్రభుత్వం నిర్దేశించని రుసుములు, విరాళాలు, “మామూలు” లేదా ఇతర అనధికారిక చెల్లింపులను ఉత్సవ కమిటీల నుంచి డిమాండ్ చేయకుండా కఠినమైన ఆదేశాలు ఇవ్వాలి. అక్రమంగా డబ్బు డిమాండ్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.


7.చివరి నిమిషంలో షరతుల మార్పు వద్దు: ఉత్సవాలకు కొద్ది రోజుల ముందు కొత్త నిబంధనలు విధించడం, ఇప్పటికే ఇచ్చిన అనుమతుల్లో మార్పులు చేయడం వంటి చర్యలను నివారించాలి. అవసరమైన అన్ని నిబంధనలను ముందుగానే ప్రకటించాలి.

ఊరేగింపులు, నిమజ్జనంపై ముందస్తు ప్రణాళిక: నిమజ్జన రూట్లు, సమయాలు, ట్రాఫిక్ మళ్లింపులు, నిమజ్జన ప్రదేశాలు తదితర వివరాలను ముందుగానే ప్రకటించాలి. చివరి నిమిషంలో మార్పులు చేసి భక్తులకు, ఉత్సవ కమిటీలకు ఇబ్బంది కలగకుండా చూడాలి.


8.నోడల్ అధికారి లేదా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు: ప్రతి జిల్లా, పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక ఉత్సవాల అనుమతుల కోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలి. ఉత్సవ కమిటీల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి.


9.భద్రతతో కూడిన స్వేచ్ఛాయుత ఉత్సవాలు: అగ్నిమాపక భద్రత, విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను ఉత్సవ కమిటీలు పాటించేలా అవగాహన కల్పించాలి. అయితే, ఈ నిబంధనల పేరుతో పండుగ నిర్వహణకు అనవసర అడ్డంకులు సృష్టించకూడదు.


10.ముందస్తు సమగ్ర మార్గదర్శక పత్రం: ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముందుగానే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శక పత్రాన్ని విడుదల చేయాలి. అందులో అనుమతుల విధానం, అవసరమైన పత్రాలు, భద్రతా ప్రమాణాలు, ధ్వని నియంత్రణ నిబంధనలు, ఊరేగింపు మరియు నిమజ్జన నియమాలను స్పష్టంగా పేర్కొనాలి.


కావున, వినాయక ఉత్సవ కమిటీలకు ఎటువంటి అనవసర ఇబ్బందులు కలగకుండా, అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అనుకూలంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

ధన్యవాదములతో,

భవదీయులు,

పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 

భారతీయ జనతా పార్టీ

పల్నాడు జిల్లా

 పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం లో భాగంగా డిఆర్ఓ గారికి పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు



 పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఎమ్మార్వో ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అలాగే మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇంటి పన్ను వేయించి చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ ని మేనేజ్ చేసి ఏడుగురు పేరు మీద ప్రభుత్వానికి సంబంధించిన సర్వే నెంబరు 138/1 సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అమ్మే వేయడం కొన్నవారు మరల అమ్మకానికి చూపగా అలాగే ఆ స్థలంలో ఉన్న బిల్డింగులు పడవేస్తున్నారు పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ అధికారులు అందరి పై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.


 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు  పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం


జరిగింది


 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .


 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు  పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా జనతా వారిది మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు గారు   తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు