October 2026




పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జనతా వారది కార్యక్రమంలో భాగంగా  డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది

  నిర్వహించిన పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర  కార్యదర్శి మేకల హనుమంతరావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలోకం సుధాకర్ బాబు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నబట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతా దేవి గారు పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పల్లపు శివయ్య పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి నేలటూరి ఏసు రత్నం జిల్లాలో వివిధ మోర్చాల బీజేపీ నాయకులు మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

To 
ది జిల్లా కలెక్టర్ 
.పల్నాడు జిల్లా 


విషయం: పశుపోషక రైతుల సమస్యల పరిష్కారం, పశువైద్య సేవలు, పశుగ్రాస భద్రత, బీమా–పరిహారం, గోకులం షెడ్లు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లాలోని పాడి రైతులు, గొర్రెలు–మేకల పెంపకందారులు, కోళ్ల ఫారం నిర్వాహకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి.
పశుసంవర్ధక రంగం గ్రామీణ కుటుంబాల జీవనోపాధికి, రైతుల ఆదాయానికి కీలకమైనందున, క్రింది అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

1. పశువైద్య సేవలు: గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యుల అందుబాటు, ఖాళీ పోస్టులు, మందుల నిల్వలను సమీక్షించి, టీకాలు, వ్యాధి నిర్ధారణ, అత్యవసర మొబైల్ వైద్య సేవలను బలోపేతం చేయాలి. ఈ మధ్య ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా నిర్ధారణ కలకలం చూసాము. జిల్లా నుంచి ఉన్నతాధికారులకు సిబ్బంది కొరతను నివేదించాలి. ఈ సంవత్సరం  రాష్ట్రానికి 83.69 లక్షల డోసులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయడం అయ్యింది అయితే వస్తవ సంఖ్య రెండవ దశ కవరేజ్ టీకా రికార్డులు పరిశీలించాలి.

2. పశుగ్రాసం–దాణా: కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, పశుగ్రాసం, దాణా, తాగునీటి సదుపాయాలు కల్పించాలి. అర్హులైన రైతులకు వర్తించే సబ్సిడీ పథకాల ప్రయోజనాలు అందించాలి. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల నవంబర్ నాటికి పశుగ్రాస కొరత పెరిగే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. అయితే జిల్లాలో ప్రత్యామ్నాయ ఆలోచనలపై రైతులకు అవగాహన కలిపించాలి. సైలేజ్ తయారీ, పశుగ్రాస విత్తనాల వినియోగం, పశువుల బలవంతపు విక్రయాల పై దృష్టి పెట్టాలి.

3. పాడి రైతుల సమస్యలు: పాల సేకరణలో నాణ్యత పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, చెల్లింపుల జాప్యాలను పరిష్కరించాలి. ఉత్పత్తి వ్యయాల పెరుగుదలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి.

4. బీమా–పరిహారం: పశువుల మరణాలకు సంబంధించిన పెండింగ్ బీమా క్లెయిమ్‌లు, అర్హమైన పరిహార దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించాలి.

5. గోకులం షెడ్లు–పథకాలు: మంజూరైన, పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న షెడ్ల వివరాలు, పెండింగ్ బిల్లులు, నిర్మాణ నాణ్యత, లబ్ధిదారుల ఎంపికను సమీక్షించాలి. అవకతవకలపై ఫిర్యాదులు అందితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. 70 నుంచి 90 శాతం సబ్సిడీ తో VB G Ram G పధకం నుంచి అందిస్తున్న షెడ్ల నిర్మాణం గోకులం పధకం అర్హత వున్నవారికి కాకుండా పలుకుబడిఉన్న వారికే కేటాయించారని అభియోగాలపై విచారణ చేయాలి. షెడ్డు నిర్మాణాలను ప్రత్యేక పరిశీలన చేయాలి 

6. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం: వ్యాధుల నియంత్రణ, టీకాలు, బయోసెక్యూరిటీ, నష్టపరిహారం, సంబంధిత ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించి, అర్హులైన రైతులకు ప్రయోజనాలు అందించాలి.

7. ప్రభుత్వ పథకాలు–ఫిర్యాదుల పరిష్కారం: రుణాలు, సబ్సిడీలు, బీమా పథకాలపై అవగాహన కల్పించి, దరఖాస్తుల జాప్యాలు, అక్రమ వసూళ్ల ఫిర్యాదులను పరిష్కరించాలి. గొర్రెలు, మేకల యూనిట్ల పథకంలో 2025–26 పథకంలో 500 గొర్రెలు, 25 పొట్టేళ్ల యూనిట్‌కు ₹1 కోటి వ్యయం ప్రతిపాదనతో పశుసంపద మిషన్ (NLM) కింద గొర్రెలు, పొట్టేళ్ల యూనిట్ల అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించగా ఆ విచారణ వేగవంతం చేయాలి.

పై అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించి, మండలాలవారీగా సమస్యలు, పెండింగ్ దరఖాస్తులు, బీమా క్లెయిమ్‌లు, గోకులం షెడ్ల పురోగతిపై నివేదిక రూపొందించాలి. తక్షణ సమస్యలను పరిష్కరించి, మిగిలిన వాటికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించాలి అని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.





పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది


 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో   పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు   పల్నాడు జిల్లా  ఆఫీస్ ఇంచార్జి చిరంజీవి గారు   నరసరావుపేట  బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



జనతా వారధి కార్యక్రమంలో భాగంగా  పల్నాడు జిల్లా కలెక్టర్  కార్యాలయంలో  వినతి పత్రం సమర్పించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో  పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు   పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం  నరసరావుపేట బీజేపీ నాయకులు సంపత్ కుమార్ గారు చిలకలూరిపేట పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య గారుపల్నాడు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.


గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికీ సమర్పిస్తున్న పిర్యాదు 
 
విషయం: జిల్లాలో సమగ్ర “కాలుష్య నివారణ కార్యాచరణ ప్రణాళిక” Comprehensive “Pollution Prevention Action Plan” ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వినతి.
 
భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసేందుకు ప్రతి శుక్రవారం “జనతా వారధి” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించి వారి సమస్యలు, ఫిర్యాదులు, సూచనలను స్వీకరిస్తున్నాము. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించినప్పుడు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, బహిరంగంగా చెత్త దహనం, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీరు, నిర్మాణాల దుమ్ము, వాహన కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం వంటి సమస్యలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న విషయం స్పష్టమవుతోంది.
 
ఇది కేవలం పరిశుభ్రతకు సంబంధించిన సమస్య కాదు. కాలుష్యం ప్రజల ఆరోగ్యం, తాగునీరు, వ్యవసాయం, జీవన ప్రమాణాలు మరియు భవిష్యత్ తరాల భద్రతకు సంబంధించిన అంశం.
 
అందువల్ల కాలుష్యం జరిగిన తరువాత ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే స్పందించే విధానంతో పాటు, కాలుష్యానికి మూల కారణాలను ముందుగానే గుర్తించి, ప్రమాదాన్ని తగ్గించి, నిరంతరం పర్యవేక్షించే “Preventive Pollution Management” విధానాన్ని జిల్లా స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
 
భారతీయ జనతా పార్టీ ప్రధాన సూచనలు

1. జిల్లా “Pollution Risk Assessment” చేపట్టాలి. జిల్లాలో కాలుష్యానికి ప్రధాన కారణాలైన పరిశ్రమలు, వాహన రద్దీ, నిర్మాణ ప్రాంతాలు, వ్యర్థాల డంపింగ్, బహిరంగ దహనం, మురుగునీటి విడుదల మరియు కాలుష్యానికి గురయ్యే నీటి వనరులను గుర్తించి జిల్లా Pollution Risk Map రూపొందించాలి. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి.
 
2. అధిక ప్రమాద పరిశ్రమలపై నిరంతర Compliance Monitoring ఉండాలి. పరిశ్రమలకు అనుమతులు ఉన్నాయా అనే అంశంతో పాటు, అనుమతులలో విధించిన పర్యావరణ ప్రమాణాలు వాస్తవంగా పాటిస్తున్నారా అనేది నిరంతరం పరిశీలించాలి. విశాఖపట్నం – LG Polymers స్టైరిన్ గ్యాస్ లీక్, 2020, విశాఖపట్నం నీటి కాలుష్యం – Meghadrigedda తదితర రిజర్వాయర్లు, అచ్యుతాపురం Brandix SEZ – అమోనియా అనుమానిత గ్యాస్ లీక్ 2022, KG Basin – ONGC పర్యావరణ ఉల్లంఘనలు (Effluent Treatment Plants నిర్దేశిత discharge standards అందుకోలేకపోవడం) అచ్చుతాపురం – Escientia ప్రమాదం 2024 (గాలి నీరు నాణ్యత క్షీనించి కలుషితమవ్వడం),  NTR జిల్లా – టైర్ పైరోలిసిస్ యూనిట్ 2026 ( Flare Gas ను 30 మీటర్ల stack ద్వారా కాకుండా ground level లో కాల్చడం) నెల్లూరు – రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు 2026 (శుద్ధి చేయని నీరు విడుదల), శ్రీ సిటీలోని TIL Healthcare ఫార్మా పరిశ్రమ ప్రమాదం (insufficient water level) ఇంకా ఎన్నో సంఘటనలు అధికారుల తనిఖీలు గమనించి గతంలో చోటుచేసుకున్న పారిశ్రామిక/పర్యావరణ ఘటనలు ముందస్తు పర్యవేక్షణ అవసరాన్ని తెలియజేస్తున్నాయి ప్రత్యేకించి రసాయన, ఫార్మా మరియు ఇతర అధిక ప్రమాద పరిశ్రమలలో ఉద్గారాలు మరియు వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరు, నీటి విడుదల, ప్రమాద నివారణ వ్యవస్థ, అత్యవసర స్పందన ప్రణాళిక వంటి అంశాలపై risk-based inspections నిర్వహించాలి.
 
3. పరిశ్రమల చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. పరిశ్రమల సమీపంలోని గ్రామాలు, నివాస ప్రాంతాలు మరియు నీటి వనరులపై పర్యావరణ ప్రభావాన్ని క్రమం తప్పకుండా పరిశీలించాలి. అవసరమైన చోట గాలి, నీరు మరియు ఇతర పర్యావరణ పరామితుల నమూనాలను పరీక్షించి, సమస్య గుర్తిస్తే, మూల కారణం వద్దే చర్య తీసుకోవాలి.
 
4. పట్టణాలు, గ్రామాల్లో బహిరంగ చెత్త దహనాన్ని అరికట్టాలి. చెత్తను బహిరంగంగా కాల్చడం వల్ల స్థానికంగా గాలి కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ తడి పొడి చెత్త వేరు చేయడం వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్ బహిరంగ దహనం నివారణ. వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలి. ఇప్పటికే అమలులో ఉన్న వ్యర్థాల సేకరణ, source segregation, processing వంటి వ్యవస్థలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించాలి.
 
5. వాయు కాలుష్యానికి పట్టణ స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. వాహన ఉద్గారాలు, రోడ్డు దుమ్ము, నిర్మాణ కార్యకలాపాలు మరియు ఇతర స్థానిక కాలుష్య వనరులను గుర్తించి వాటికి ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టాలి. నిర్మాణ ప్రాంతాల్లో dust control, నిర్మాణ సామగ్రిని కప్పి రవాణా చేయడం, రోడ్లపై మట్టి/వ్యర్థాలు పేరుకుపోకుండా చూడటం వంటి చర్యలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి.
 
6. నీటి కాలుష్యంపై “Source-to-Action” విధానం అమలు చేయాలి. నదులు, కాలువలు, చెరువులు, సరస్సులు మరియు భూగర్భ జలాల కాలుష్యాన్ని కేవలం శుభ్రపరిచే కార్యక్రమాలకు పరిమితం చేయకుండా, కాలుష్యం ఎక్కడి నుంచి వస్తోంది అనే మూలాన్ని గుర్తించి అక్కడే నియంత్రించాలి. కాలుష్యానికి కారణమయ్యే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు లేదా ఇతర విడుదలలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలి.
 
7. ప్రజల కాలుష్య ఫిర్యాదులకు Time-Bound Response విధానం ఏర్పాటు చేయాలి. ప్రజలు ఇచ్చే ప్రతి కాలుష్య ఫిర్యాదుకు నమోదు సంఖ్య ఇచ్చి, దాని పరిష్కారానికి స్పష్టమైన విధానం ఉండాలి. ఫిర్యాదు, స్థల పరిశీలన, అవసరమైతే నమూనాల పరీక్ష, కారణ నిర్ధారణ, చర్య, పరిష్కారం, Action Taken Report. ప్రజలకు తమ ఫిర్యాదుపై తీసుకున్న చర్యను తెలియజేయాలి.
 
8. జిల్లా స్థాయిలో “Environmental Coordination & Review” వ్యవస్థ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో APPCB, మున్సిపల్/పంచాయతీరాజ్, పరిశ్రమలు, రవాణా, ఆరోగ్యం మరియు సంబంధిత శాఖలతో సమన్వయ సమీక్ష నిర్వహించాలి. విద్యార్థుల్లో యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించాలి.

జనతా వారధి ద్వారా ప్రజలు చెబుతున్న సమస్యలు కేవలం ఫిర్యాదులు కావు  అవి వారి ఆరోగ్యం, వారి పరిసరాలు, వారి భవిష్యత్తుపై ఉన్న ఆందోళనకు ప్రతిబింబం. అందువల్ల ఈ వినతిపత్రాన్ని ఒక సాధారణ ఫిర్యాదుగా కాకుండా, జిల్లాలో కాలుష్య నివారణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ప్రజా విజ్ఞప్తిగా పరిగణించాలని కోరుతున్నాము.
ధన్యవాదములతో,
భవదీయులు,
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్ 
భారతీయ జనతా పార్టీ
పల్నాడు జిల్లా