పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జనతా వారది కార్యక్రమంలో భాగంగా  డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది

  నిర్వహించిన పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర  కార్యదర్శి మేకల హనుమంతరావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలోకం సుధాకర్ బాబు గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నబట్ల ఆదిత్య గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతా దేవి గారు పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పల్లపు శివయ్య పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి నేలటూరి ఏసు రత్నం జిల్లాలో వివిధ మోర్చాల బీజేపీ నాయకులు మరియు పల్నాడు జిల్లా బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

To 
ది జిల్లా కలెక్టర్ 
.పల్నాడు జిల్లా 


విషయం: పశుపోషక రైతుల సమస్యల పరిష్కారం, పశువైద్య సేవలు, పశుగ్రాస భద్రత, బీమా–పరిహారం, గోకులం షెడ్లు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

భారతీయ జనతా పార్టీ ప్రతి శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లాలోని పాడి రైతులు, గొర్రెలు–మేకల పెంపకందారులు, కోళ్ల ఫారం నిర్వాహకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి.
పశుసంవర్ధక రంగం గ్రామీణ కుటుంబాల జీవనోపాధికి, రైతుల ఆదాయానికి కీలకమైనందున, క్రింది అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

1. పశువైద్య సేవలు: గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యుల అందుబాటు, ఖాళీ పోస్టులు, మందుల నిల్వలను సమీక్షించి, టీకాలు, వ్యాధి నిర్ధారణ, అత్యవసర మొబైల్ వైద్య సేవలను బలోపేతం చేయాలి. ఈ మధ్య ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా నిర్ధారణ కలకలం చూసాము. జిల్లా నుంచి ఉన్నతాధికారులకు సిబ్బంది కొరతను నివేదించాలి. ఈ సంవత్సరం  రాష్ట్రానికి 83.69 లక్షల డోసులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయడం అయ్యింది అయితే వస్తవ సంఖ్య రెండవ దశ కవరేజ్ టీకా రికార్డులు పరిశీలించాలి.

2. పశుగ్రాసం–దాణా: కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, పశుగ్రాసం, దాణా, తాగునీటి సదుపాయాలు కల్పించాలి. అర్హులైన రైతులకు వర్తించే సబ్సిడీ పథకాల ప్రయోజనాలు అందించాలి. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల నవంబర్ నాటికి పశుగ్రాస కొరత పెరిగే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. అయితే జిల్లాలో ప్రత్యామ్నాయ ఆలోచనలపై రైతులకు అవగాహన కలిపించాలి. సైలేజ్ తయారీ, పశుగ్రాస విత్తనాల వినియోగం, పశువుల బలవంతపు విక్రయాల పై దృష్టి పెట్టాలి.

3. పాడి రైతుల సమస్యలు: పాల సేకరణలో నాణ్యత పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, చెల్లింపుల జాప్యాలను పరిష్కరించాలి. ఉత్పత్తి వ్యయాల పెరుగుదలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి.

4. బీమా–పరిహారం: పశువుల మరణాలకు సంబంధించిన పెండింగ్ బీమా క్లెయిమ్‌లు, అర్హమైన పరిహార దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో పరిష్కరించాలి.

5. గోకులం షెడ్లు–పథకాలు: మంజూరైన, పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న షెడ్ల వివరాలు, పెండింగ్ బిల్లులు, నిర్మాణ నాణ్యత, లబ్ధిదారుల ఎంపికను సమీక్షించాలి. అవకతవకలపై ఫిర్యాదులు అందితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. 70 నుంచి 90 శాతం సబ్సిడీ తో VB G Ram G పధకం నుంచి అందిస్తున్న షెడ్ల నిర్మాణం గోకులం పధకం అర్హత వున్నవారికి కాకుండా పలుకుబడిఉన్న వారికే కేటాయించారని అభియోగాలపై విచారణ చేయాలి. షెడ్డు నిర్మాణాలను ప్రత్యేక పరిశీలన చేయాలి 

6. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం: వ్యాధుల నియంత్రణ, టీకాలు, బయోసెక్యూరిటీ, నష్టపరిహారం, సంబంధిత ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించి, అర్హులైన రైతులకు ప్రయోజనాలు అందించాలి.

7. ప్రభుత్వ పథకాలు–ఫిర్యాదుల పరిష్కారం: రుణాలు, సబ్సిడీలు, బీమా పథకాలపై అవగాహన కల్పించి, దరఖాస్తుల జాప్యాలు, అక్రమ వసూళ్ల ఫిర్యాదులను పరిష్కరించాలి. గొర్రెలు, మేకల యూనిట్ల పథకంలో 2025–26 పథకంలో 500 గొర్రెలు, 25 పొట్టేళ్ల యూనిట్‌కు ₹1 కోటి వ్యయం ప్రతిపాదనతో పశుసంపద మిషన్ (NLM) కింద గొర్రెలు, పొట్టేళ్ల యూనిట్ల అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించగా ఆ విచారణ వేగవంతం చేయాలి.

పై అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించి, మండలాలవారీగా సమస్యలు, పెండింగ్ దరఖాస్తులు, బీమా క్లెయిమ్‌లు, గోకులం షెడ్ల పురోగతిపై నివేదిక రూపొందించాలి. తక్షణ సమస్యలను పరిష్కరించి, మిగిలిన వాటికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించాలి అని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
Next
This is the most recent post.
Previous
Older Post
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: